విశాఖపట్నం జిల్లా, సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) ::
33/11 కేవీ శోంఠ్యం సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విద్యుత్ అంతరాయం కారణంగా గొంతినవాణిపాలెం, మామిడిలోవ, జి.ఎస్. అగ్రహారం, ఎన్‌జీఆర్ పురం, గండిగుండం, రామవరం, కణమం, అయ్యవారి కణమం, బంటుమెరక, గోరింట, కొలవానిపాలెం, బి.డి.పాలెం తదితర ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ మేరకు విశాఖపట్నం ఆపరేషన్ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు తెలిపారు.


