కల్లలైన నా తెలంగాణ కల ( ళ )
————————————
కల్లలాయే నా తెలంగాణా కలలు
కళ లేమో కంచికాయే
మసి బారే మాణిక్యాలు
మకిలి బట్టే మధు ర ఫలాలు.
మచ్చుకైనా లేరైరి మర్యాద రామన్నలు
ముంచేటోళ్లేమో ముదిరి పో సాగిరి.
మోస గాళ్లేమో మొహరిస్తుo డి రి.
సదువులు సట్టు బండలాయే
డిం భకులేమో నిరక్షర కుక్షులైరి.
సమాజమేమో సాకిరేవాయే
సోయి లేని సన్నాసులేమో
సోమరి పోతులు అవుతుండిరి.
జీడీపీ యేమో జండా ఎగిరేసే
పేదరికమేమో కాలారేగిరిసే
వెలకట్టలేని లేని విలువలేమో వెల వెల పోయే.
ప్రజా పాలనేమో యెగిరి పాయె
ప్రజా సేవేమో ఇగిరి పోయే.
ప్రకృతేమో పగబట్ట సాగే
పాపపు జనాలేమో వికృత చేష్టలు డగ సాగిరి.
ఆన కట్టలేమో క్రుంగు బాటుతో కుంగుడాయే
ఆరు గాలం అన్నం పెట్టె రైతుకేమో కడగo డ్లాయే
నోటుకు ఓటేసు డాయే.
కాసుల కక్కుర్తి తో దొరికినంత దోసుకొనుడాయే
కాండక్ట్ / క్యారెక్టర్ లేని కాంట్రాక్టర్లయే
సుడిగుండంలో సామాన్యులు మునిగి పోవుడాయే
మది నిండా కలతా యే
కాసింత కునుకు లేకపోయే
మధుర ఫలమేమో మేడిపండాయే
ఎన్నటికీ స్సకారమౌతుందో నా ( తెలంగాణా ) కల?
ఎప్పటికి మాగుతుందో అపరిపక్వ ఫలం?
–దురుసోజు దుర్గా చారి

