గురుకుల విద్యార్థి సాత్విక్ మృతి.. కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం: రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి హరీష్ కుమారుడు సాత్విక్ మృతి చెందడం విషాదకరం.
విషయం తెలుసుకున్న వెంటనే తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరు శ్రీనివాస్ రెడ్డి, తావడబోయిన కృష్ణ, మోరపాక నాగయ్య, గంగరాజు, శివయ్య, మల్లయ్య తదితరులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు.
మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.1.20 లక్షలు, అలాగే PSR ట్రస్ట్ ద్వారా దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి న్యాయం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాయకులు ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.
విద్యార్థి సాత్విక్ మృతిపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం, తనవంతుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


