వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు ఖమ్మంలోని తమ స్వగృహంలో వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. వినాయకుని ఆశీస్సులతో కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి, శ్రేయస్సు నెలకొనాలని సండ్ర వెంకట వీరయ్య దంపతులు ఆకాంక్షించారు.



