సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి పట్టణంలోని జవహర్ నగర్లోని కృష్ణుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మువ్వా విజయబాబు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


