Monday, 14 September 2026
  • Home  
  • దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీ.. పువ్వాడ ఫౌండేషన్ సేవలు
- ఖమ్మం

దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీ.. పువ్వాడ ఫౌండేషన్ సేవలు

ఖమ్మం రోటరీ క్లబ్, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న సేవలో 1,140 మందికి కృత్రిమ పాదాలు అమర్చినట్లు తెలిపారు. ఈసారి 88 మందికి పాదాలు అందించగా, పువ్వాడ ఫౌండేషన్ రూ.3.52 లక్షలు అందించిందన్నారు. రోటరీ లింబ్ సెంటర్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో రోటరీ ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్, ప్రెసిడెంట్ హరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాళ్ళ పాపారావు, సెక్రటరీ దొడ్డపనేని సాంబశివరావు, వంగల జగన్నాథం, పసుమర్తి రంగారావు, NVNSN ప్రసాద్, చిటోజు రామకృష్ణ, వల్లభనేని రామారావు, RJC కృష్ణ, పగడాల నాగరాజు, బత్తుల మురళీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.