రఘునాథపాలెం / ఖమ్మం
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే, ప్రస్తుతం కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3-ఫేస్ విద్యుత్ కొరత, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలు మళ్లీ పునరావృతమయ్యాయని ఆరోపించారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్లలో నిలబెడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.



