ఏలూరు, ఏప్రిల్ 20 పున్నమి ప్రతినిధి సురేష్
ఏలూరు నందు DCMS ఫంక్షన్ హాల్ లో 18,19 తేదీలలో ఏపీసీఎన్ఎఫ్, ఆర్వైఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆర్గానిక్, నేచురల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించినారు. ఇందులో భాగంగా మేధో ఫ్రెష్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ ,సూరప్పగూడెం భీమడోలు వారు నిర్వహించిన స్టాల్ నందు సహజ సిద్ధ పద్ధతుల ద్వారా పండించినటువంటి బహురూపీ, కులాకర్, నవారా, కుంకుమసాలి ధాన్యముకు మంచి ఆదరణ లభించింది అలాగే “నవారా చద్దన్నము” స్టాల్ నందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. తన తాతల నాటి చద్దన్నమును తన తండ్రి వెజ్జు అప్పారావు ద్వారా తయారీ విధానాన్ని తెలుసుకొని ప్రజలకు రుచి చూపించారు. మేధో ఫ్రెష్ ఫామ్ డైరెక్టర్ అయినటువంటి వీజేవీ రంజిత్ వివిధ రకాల ఆర్గానిక్ రైస్ చద్దన్నము యొక్క ఉపయోగాలను ఏలూరు ప్రజలకు ఈ “ఏలూరు రైతు సంపద వేదిక”గా తెలియజేసినారు. ఈ చద్దన్నము వలన నరాల బలహీనతలు, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎముకల బలహీనత, రక్తహీనత, PCOD, PCOS, మైగ్రేన్, హార్మోన్స్ ఇన్ బాలన్స్ వంటి సమస్యల నుండి దూరమవుటకు ఈ చద్దన్నమును తమ ఆహార అలవాట్లలో చేర్చుకోవాలని తెలియజేసినారు. దీని గురించి సబ్స్క్రిప్షన్ తీసుకొనుటకు 7993374858 నెంబర్ ను సంప్రదించగలరు. ఇలాంటి అవకాశాన్ని రైతులకు అందించినటువంటి కలెక్టర్ కి, ఏలూరు రైతు సంపద వ్యవసాయ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.



