ఖమ్మం మామిళ్లగూడెంలో బీజేపీ నాయకులు వేల్పుల సుధాకర్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల 28వ వార్షికోత్సవ కార్యక్రమాలు 28 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో బీజేపీ ఖమ్మం 2వ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


