Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల జిల్లాలో రైల్ ట్రయల్ రన్ విజయవంతం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ లో భాగంగా బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు జిల్లాలో తొలిసారిగా రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అధికారులు రైల్వే ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు ఈ మార్గం పూర్తి అయితే చేనేత ఉత్పత్తుల రవాణా తో పాటు వేములవాడ భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడునుంది

రాజన్న సిరిసిల్ల

పేదల సొంతింటి కల కు ప్రభుత్వం శ్రీకారం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు భూమి పూజ చేశారు పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇండ్ల మంజూరు పేరుతో డబ్బులు అడిగే దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు పేదలకు సొంతింటిని అందించి వారి ఆత్మ గౌరవాన్ని పెంచడమే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ప్రధాన ఉద్దేశం అని వెల్లడించారు

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్లలో కమిషన్ సమీక్ష

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం సెప్టెంబర్ ఒకటవ తేదీన పర్యటించనుంది చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యుల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి చేరుకోనున్నారు ఉదయం 11 గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ సమస్య లు సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు తెలుసుకొని ఉన్నారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడ కాంగ్రెస్ కమిటీ కొత్త నాయకత్వం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీని పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు ఆదివారం నియమించారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు నూతన కమిటీ సభ్యులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు

రాజన్న సిరిసిల్ల

ఆలయానికి మినీ టాటా ఏస్ వాహనం విరాళం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు రీజనల్ మేనేజర్ రాజా నరేంద్ర వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప్ అందించారు సుమారు 7 లక్షల 25 వేల విలువైన వాహనం ఆలయ సేవలకు వినియోగించనున్నారు

రాజన్న సిరిసిల్ల

చేనేత కళాకారుడి మరో అద్భుతం నల్ల జగదీష్

పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల జగదీష్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు తెలుగు అక్షరమాల లో 56 అక్షరాలను పొందుపరుస్తూ పట్టుపోగులతో అందమైన చీరను నేశారు 6.30 మీటర్ల పొడవు 48 అంగుళాల వెడల్పు 650 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ చీరను 15 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు గతంలో అగ్గిపెట్టెలో ఇమిడి చీరను నేసిన ఆయన తన కళ ప్రతిభను మరోసారి చాటారు ఈ చీరను బాసర సరస్వతి అమ్మవారికి బహుకరించి నన్నట్లు తెలిపారు అక్షరాలతో అద్భుత చీర ఆవిష్కరణ నల్ల జగదీష్ ను చేనేత కళాకారుల అభినందించారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు సెప్టెంబర్ 26 నుండి 29 వరకు పోటీలు జరగనున్నాయి బాలుర విభాగంలో 34 జట్లు బాలికల విభాగంలో 34 జట్లు పాల్గొంటాయని సుమారు 1358 మంది క్రీడాకారులు హాజరు అవుతారని తెలిపారు మరియు హైదరాబాదులోని మరో జట్టుకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడ రాజన్న దర్శించుకున్న మంత్రి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరియు రాష్ట్రం సుఖ సంతోషాలతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

వేములవాడ ఆలయానికి రూ 25 వేల విరాళం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు ఇందులో భాగంగా కొత్తపల్లి హవేలీ గ్రామానికి చెందిన దూస రిషికేష్ తండ్రి మహేందర్ రూ 25 వేల నగదు విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మకు అందజేశారు అనంతరం రసీదు పొందారు

రాజన్న సిరిసిల్ల

రాఖీ పౌర్ణమి వేల అన్నాచెల్లెళ్ల ఆత్మీయత

పున్నమి ప్రతినిధి ఆగస్టు 28 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన సోదరి లీల సగృహంలో రాఖీ కట్టారు అనంతరం స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం చాటుకున్నారు రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.