పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల జగదీష్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు తెలుగు అక్షరమాల లో 56 అక్షరాలను పొందుపరుస్తూ పట్టుపోగులతో అందమైన చీరను నేశారు 6.30 మీటర్ల పొడవు 48 అంగుళాల వెడల్పు 650 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ చీరను 15 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు గతంలో అగ్గిపెట్టెలో ఇమిడి చీరను నేసిన ఆయన తన కళ ప్రతిభను మరోసారి చాటారు ఈ చీరను బాసర సరస్వతి అమ్మవారికి బహుకరించి నన్నట్లు తెలిపారు అక్షరాలతో అద్భుత చీర ఆవిష్కరణ నల్ల జగదీష్ ను చేనేత కళాకారుల అభినందించారు



