రామచంద్రపురం ఆగస్టు 01 (పున్నమి ప్రతినిధి)
స్థానిక రామచంద్రాపురం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శనివారం” లోకోస్” యాప్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.ఎన్ శోభన్ బాబు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళా సంఘాల లెక్కలు ఒకే విధానంలో పారదర్శకంగా నమోదు చేయడమే ఈ యాప్ యొక్క ఉద్దేశమని తెలియజేశారు తదుపరి ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాల గురించి వివోఏలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల ఏపిఎం పి గురుమూర్తి, సీసీలు పార్వతమ్మ, అరుణ సుధాకర్, అకౌంటెంట్ స్వర్ణలత మరియు ఎమ్మెస్ లీడర్లు మహాలక్ష్మి అరుణ వివో ఏలు మొదలగువారు పాల్గొన్నారు.


