Tuesday, 8 September 2026
  • Home  
  • పెరుమాండ్ల ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
- రంగారెడ్డి

పెరుమాండ్ల ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

పెరుమాండ్ల ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో సింధూరాభిషేకం.. ఆకుపూజ.. నైవేద్యం సమర్పణ మొక్కులు చెల్లించుకున్న కొంగల శ్రీశైలం కుటుంబ సభ్యులు మంగళ, శనివారాల్లో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు యాచారం, సెప్టెంబర్‌ 8: యాచారం మండలంలోని పెరుమాండ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొంగల శ్రీశైలం కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర పూజ, అభిషేకం, ఆకుపూజ, నైవేద్యం, మాల సమర్పణ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంగల శ్రీశైలం మాట్లాడుతూ.. మంగళ, శనివారాలు ఆంజనేయస్వామి వారికి అత్యంత విశిష్టమైన రోజులు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త మాట్లాడుతూ.. ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించడం భక్తుల ఆచార విశ్వాసాల్లో ముఖ్యమైనదని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో కడ్తాల్‌ ఎస్టీ సెల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విస్లావత్‌ శ్రీనునాయక్‌, మోతీలాల్‌, పోతాని శేఖర్‌గౌడ్‌, ఆలంపల్లి దుర్గేష్‌, నానక్‌నగర్‌, మేడిపల్లి, సరికొండ తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

పెరుమాండ్ల ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో సింధూరాభిషేకం.. ఆకుపూజ.. నైవేద్యం సమర్పణ

మొక్కులు చెల్లించుకున్న కొంగల శ్రీశైలం కుటుంబ సభ్యులు

మంగళ, శనివారాల్లో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు

యాచారం, సెప్టెంబర్‌ 8:
యాచారం మండలంలోని పెరుమాండ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొంగల శ్రీశైలం కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర పూజ, అభిషేకం, ఆకుపూజ, నైవేద్యం, మాల సమర్పణ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కొంగల శ్రీశైలం మాట్లాడుతూ.. మంగళ, శనివారాలు ఆంజనేయస్వామి వారికి అత్యంత విశిష్టమైన రోజులు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త మాట్లాడుతూ.. ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించడం భక్తుల ఆచార విశ్వాసాల్లో ముఖ్యమైనదని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు శుభం కలగాలని ఆకాంక్షించారు.

ఈ పూజా కార్యక్రమంలో కడ్తాల్‌ ఎస్టీ సెల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విస్లావత్‌ శ్రీనునాయక్‌, మోతీలాల్‌, పోతాని శేఖర్‌గౌడ్‌, ఆలంపల్లి దుర్గేష్‌, నానక్‌నగర్‌, మేడిపల్లి, సరికొండ తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.