పోలీసులకు టెక్నాలజీ అండ.. 25 బాడీ వార్న్ కెమెరాల విరాళం!
అనకాపల్లి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ CSR నిధులతో అనకాపల్లి జిల్లా పోలీసులకు 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ కెమెరాలను ప్రారంభించారు. పోలీసుల విధి నిర్వహణలో పారదర్శకత, భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖకు సహకరించిన సంస్థ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, ఆనంద్ గాల్ఫాడే, మదన్ మోహన్‌లను ఎస్పీ అభినందించారు.










