యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి జిల్లా టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం యలమంచిలి కొత్తపేట రామాలయం పార్కులో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని పలు టైక్వాండో క్లబ్బుల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో 38 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో 13 మంది బాలికలు, 25 మంది బాలురు ఉన్నారు. అలాగే 14 మంది రజత పతకాలు, 8 మంది కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతక విజేతలు ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
అతిథిగా హాజరైన ఏజీపీ రాజాన గోవిందరావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా టైక్వాండో కార్యదర్శి నగరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాయవరపు సుధాకర్, యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపరెడ్డి వెంకటరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్వీ రామకృష్ణ, స్పోర్ట్స్ కార్యదర్శి వేముశెట్టి కృష్ణ, పోలిశెట్టి వీర ప్రజానాయక్, కూనిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలిలో టైక్వాండో క్రీడాకారుల సత్తా.. 38 బంగారు పతకాలతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం యలమంచిలి కొత్తపేట రామాలయం పార్కులో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని పలు టైక్వాండో క్లబ్బుల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 38 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో 13 మంది బాలికలు, 25 మంది బాలురు ఉన్నారు. అలాగే 14 మంది రజత పతకాలు, 8 మంది కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతక విజేతలు ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అతిథిగా హాజరైన ఏజీపీ రాజాన గోవిందరావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టైక్వాండో కార్యదర్శి నగరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాయవరపు సుధాకర్, యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపరెడ్డి వెంకటరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్వీ రామకృష్ణ, స్పోర్ట్స్ కార్యదర్శి వేముశెట్టి కృష్ణ, పోలిశెట్టి వీర ప్రజానాయక్, కూనిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

