Tuesday, 22 September 2026
  • Home  
  • రైల్వేకోడూరులో భారీ ఉద్యోగ మేళా
- తిరుపతి

రైల్వేకోడూరులో భారీ ఉద్యోగ మేళా

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రైల్వేకోడూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. రైల్వేకోడూరు సాయి నగర్‌లోని శ్రీ సాయి డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 28న ఉదయం 8.30 గంటలకు మేళా ప్రారంభం కానుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చు. వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అర్హత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మేళాకు సంబంధించిన వివరాల కోసం 9052717078, 9550095775 నంబర్లలో సంప్రదించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.