నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 21 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: శ్రీ సంకల్ప్ సొసైటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్మల్లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల అన్నదాన కార్యక్రమంలో *ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్* పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ఆయన 25 కేజీల కంది పప్పును అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, *గణేష్ ఉత్సవాలు భక్తితో పాటు సోదరభావం, మతసామరస్యం, ఐక్యతను చాటేలా జరగాలని ఆకాంక్షించారు* . అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి, పరస్పర ఆత్మీయతను పెంచుతాయని అన్నారు.
*నిర్మల్లో అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ పండుగలు జరుపుకోవడం మన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. మతం ఏదైనా.. మానవత్వం ఒక్కటేనని* , సోదరభావం మరియు మతసామరస్యమే సమాజానికి బలమైన పునాది అని అన్నారు.
*శ్రీ సంకల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు సహకారంతో పాల్గొంటామని* సయ్యద్ హైదర్ తెలిపారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందించే మరిన్ని సేవా కార్యక్రమాలను సొసైటీ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్ జనరల్ సెక్రటరీ సీ.హెచ్.వినోద్, స్పోక్స్ పర్సన్ వసంత రావు, మరియు సోషల్ వర్కర్ ఎక్తా బ్లడ్ బ్యాంక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.


