Tuesday, 22 September 2026
  • Home  
  • విజయవాడ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో కే ఎస్ జోహార్ గారిని కలిసిన పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ
- ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో కే ఎస్ జోహార్ గారిని కలిసిన పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ

22 – 09 – 2026 విజయవాడ – ఎస్సీ కమీషన్ కార్యాలయం *చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ* గుంటూరు: చీకటి గోపి లాకప్ డెత్ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దళిత, బహుజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా చీకటి గోపి మృతి ఘటనకు సంబంధించిన అంశాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్‌ను దళిత, బహుజన ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు తెలిపారు. అయితే కేసులో నిజానిజాలు పూర్తిగా బయటకు రావాలంటే మృతదేహానికి ఎయిమ్స్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రీ-పోస్టుమార్టం నిర్వహించాలని ఎస్సీ కమిషన్‌ను కోరారు. అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ గారు స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. చీకటి గోపి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో బాధ్యులెవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, బహుజన ప్రజాసంఘాలు పోరాటాన్ని కొనసాగిస్తాయని మంద కృష్ణ మాదిగ గారు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ ను కలిసినవారిలో దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యా సాగర్, KVPS రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి, MRPS జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ అధికార ప్రతినిధి డా వై కే విశ్వనాధ్ మాదిగ, MRPS రాష్ట్ర మాజీ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, MRPS మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా తది తరులు పాల్గొన్నారు మాదిగ, జై భీమ్ సేన సేవాదళ్ వ్యవస్థాపకులు నీలాంబరం, MSP జాతీయ నాయకులు కూసిపూడి సత్యం మాదిగ తది తరులు పాల్గొన్నారు. -మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS)

22 – 09 – 2026
విజయవాడ – ఎస్సీ కమీషన్ కార్యాలయం

*చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ*

గుంటూరు: చీకటి గోపి లాకప్ డెత్ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దళిత, బహుజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ గారిని కలిశారు.

ఈ సందర్భంగా చీకటి గోపి మృతి ఘటనకు సంబంధించిన అంశాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్‌ను దళిత, బహుజన ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు తెలిపారు.

అయితే కేసులో నిజానిజాలు పూర్తిగా బయటకు రావాలంటే మృతదేహానికి ఎయిమ్స్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రీ-పోస్టుమార్టం నిర్వహించాలని ఎస్సీ కమిషన్‌ను కోరారు.

అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ గారు స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. చీకటి గోపి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనలో బాధ్యులెవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, బహుజన ప్రజాసంఘాలు పోరాటాన్ని కొనసాగిస్తాయని మంద కృష్ణ మాదిగ గారు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ ను కలిసినవారిలో దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యా సాగర్, KVPS రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి, MRPS జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ అధికార ప్రతినిధి డా వై కే విశ్వనాధ్ మాదిగ, MRPS రాష్ట్ర మాజీ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, MRPS మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా తది తరులు పాల్గొన్నారు మాదిగ, జై భీమ్ సేన సేవాదళ్ వ్యవస్థాపకులు నీలాంబరం, MSP జాతీయ నాయకులు కూసిపూడి సత్యం మాదిగ తది తరులు పాల్గొన్నారు.

-మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.