హుకుంపేట మండలం భీమవరం, చిట్టెంపాడు గ్రామాల్లో మంగళవారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సియ్యారి దొన్నుదొర పాల్గొని రైతులకు ఫొటోలతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతుల్లో భరోసా పెరిగిందన్నారు. రైతుల భూములకు మరింత రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తమ భూములపై రైతులకు హక్కులు, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

మీ భూమి–మీ హక్కు’తో రైతులకు భరోసా : దొన్నుదొర