Tuesday, 22 September 2026
  • Home  
  • ప్రాణం విలువ 8 లక్షలు
- ఆంధ్రప్రదేశ్

ప్రాణం విలువ 8 లక్షలు

ఆగష్టు 22 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి (బి) గ్రామానికి చెందిన రుక్మాబాయి (35) కడుపునొప్పితో బాధపడుతూ భైంసా పట్టణంలోని సాయి సుప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రుక్మాబాయికి కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో గత వారం సాయి సుప్రియ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుడు రజనీకాంత్ పరీక్షలు, స్కానింగ్ నిర్వహించిన అనంతరం గర్భసంచిలో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు కణితిని తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం చికిత్స అందించి రెండు రోజుల క్రితం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.అయితే ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ కడుపునొప్పి తీవ్రం కావడంతో రుక్మాబాయిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. స్కానింగ్‌లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ నిర్వహించినట్లు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. రెండో ఆపరేషన్ అనంతరం ఉదయం వైద్యుడు రోగిని పరిశీలించినప్పుడు మాట్లాడుతున్నారని, కొద్దిసేపటి తర్వాత ఫిట్స్ రావడంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యుడు రజనీకాంత్ తెలిపినట్లు సమాచారం.*కుటుంబ సభ్యుల ఆరోపణలు*అయితే వరుసగా రెండుసార్లు ఆపరేషన్ చేయాల్సి రావడం, చికిత్సలో లోపాలు ఉండటం వల్లే రుక్మాబాయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రి వైద్యుడితో మాట్లాడి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.రూ.8 లక్షల పరిహారానికి అంగీకారంఆందోళన నేపథ్యంలో భైంసా డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్లు సమాచారం. మృతురాలి పిల్లల భవిష్యత్‌ కోసం రూ.8 లక్షలను వారి పేర్లపై డిపాజిట్ చేయడానికి అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆందోళనను విరమించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామమైన ఝరి (బి)కి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.