Monday, 31 August 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మోహన్ నాయుడు దుర్మరణం-గాలి చలపతి, మురళి నివాళి
- తిరుపతి

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మోహన్ నాయుడు దుర్మరణం-గాలి చలపతి, మురళి నివాళి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం పొయ్యి కొత్తూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్ మోహన్ నాయుడు (మదన్) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శనివారం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే, మదన్ మోహన్ నాయుడు తన వ్యక్తిగత పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక అంబులెన్స్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలైన ఆయనను వెంటనే తిరుపతిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన పొయ్యికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి గాలి చలపతి నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు పొయ్యి గ్రామానికి చేరుకుని, మదన్ మోహన్ నాయుడు భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదన్ మోహన్ నాయుడు మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ, పార్టీ పరంగా తగిన సహాయ సహకారాలు అందేలా పూర్తి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.