Monday, 31 August 2026
  • Home  
  • క్రీడలతోనే శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ-తిరుపతి డీఈఓ కె.వి.ఎన్. కుమార్
- తిరుపతి

క్రీడలతోనే శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ-తిరుపతి డీఈఓ కె.వి.ఎన్. కుమార్

విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, క్రీడా మైదానాల్లో ఆటలు ఆడుతూ శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని RPBS జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం–2026, క్రీడా ప్రతిభా అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. పాఠశాల స్థాయిలోనే గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి సరైన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులను విద్య, నైతిక విలువల్లో ముందుంచాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ కిషోర్, MEO బాలయ్య, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి భార్గవి, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు మరియు విద్యార్థి క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.