Monday, 31 August 2026
  • Home  
  • ఎస్ ఐ ఆర్- 2026 ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
- విజయనగరం 

ఎస్ ఐ ఆర్- 2026 ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన

*SIR-2026 ప్రక్రియపై పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన* –ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ విజయనగరం, జిల్లా బ్యూరో రమణ, ఆగస్టు 29: పున్నమి ప్రతినిధి SIR-2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా భోగాపురం మండలంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 227, 228, 231లను ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో SIR-2026కు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, ఎన్్యుమరేషన్ ఫారాల స్వీకరణ, పెండింగ్ దరఖాస్తులు, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల వివరాలు తొలగించే ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీత గడువులో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న SIR-2026 పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ సూచించారు. ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం అందించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఈఆర్వో ఆశయ్య, ఏఈఆర్వో హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

*SIR-2026 ప్రక్రియపై పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన*

–ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ

విజయనగరం, జిల్లా బ్యూరో రమణ, ఆగస్టు 29: పున్నమి ప్రతినిధి

SIR-2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా భోగాపురం మండలంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 227, 228, 231లను ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో SIR-2026కు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, ఎన్్యుమరేషన్ ఫారాల స్వీకరణ, పెండింగ్ దరఖాస్తులు, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల వివరాలు తొలగించే ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీత గడువులో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో చేపడుతున్న SIR-2026 పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ సూచించారు. ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం అందించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు.

ఈ పరిశీలనలో ఈఆర్వో ఆశయ్య, ఏఈఆర్వో హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.