వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక, పద్మరాజుపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.
- మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు.
- వరి నాట్ల సమయంలో నారు చివర్లు చిదిమేయడం ద్వారా కాండం తొలిచే పురుగు, తెల్లకంకి ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు.
యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక, పద్మరాజుపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు. వరి నాట్ల సమయంలో నారు చివర్లు చిదిమేయడం ద్వారా కాండం తొలిచే పురుగు, తెల్లకంకి ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని, క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.