Wednesday, 23 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభోత్సవానికి పేట బయ్యవరం నుంచి కూటమి శ్రేణులు..!!

అనకాపల్లి జిల్లా : ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి నియోజకవర్గం, పేట బయ్యవరం: పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గంలోని పేట బయ్యవరం గ్రామం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎడ్ల చినబాబు, మాజీ వైస్ ఎంపీపీ గొన్నబోతుల శేషు, మాజీ సర్పంచ్ గంజి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మగ్గా బాబురావు, పులపర్తి నీటి సంఘం వైస్ చైర్మన్ ఎడ్ల కాంతారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ ఆడపడుచులు కార్యక్రమానికి బయలుదేరారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి పరంగా మరింత ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అనకాపల్లి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సుందరపు ఈశ్వరరావు సుడిగాలి పర్యటన

యలమంచిలి నియోజకవర్గంలో “జోహార్ వైఎస్సార్” నినాదాలు అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): దివంగత ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా యలమంచిలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన కృషిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెద్దపల్లి అగ్రహారం, ఉప్పరాపల్లి, సర్వసిద్ధి తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు “జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్.. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు మార్మోగాయి. వైఎస్సార్ పేదల పాలిట పెన్నిధి అని సుందరపు ఈశ్వరరావు కొనియాడారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదలు, రైతుల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైఎస్సార్‌కు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

అనకాపల్లి

సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించిన పట్టణ అధ్యక్షుడు నానాజీ…!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి : మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సోమవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ (నానాజీ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి, గత రెండు సంవత్సర కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, జిల్లాలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. యువతకు పెద్దపీట వేస్తూ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బొద్ధపు. శ్రీనివాసరావు, వార్డు ఇంచార్జ్ బొద్ధపు. నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షుడు నమ్మి.రమణ, జనసేన వార్డు అధ్యక్షుడు బోద్ధపు గణేష్, వార్డు సెక్రటరీ పందల సూరిబాబు, దాంట్ల విజయకుమార్ తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ స్థాయి సమావేశం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : సెప్టెంబర్ 2న పాయకరావుపేట ‘జలహారతి’ని జయప్రదం చేయాలని పిలుపు ​యలమంచిలి :పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ​ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలి. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు రావడం ఒక గొప్ప వరమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే ​బండారు సత్యానందం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రాంతాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, జలహారతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని అన్నారు. అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ​బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే నీటి పారుదల ప్రాజెక్టును పూర్తి చేసి జలహారతి ఇస్తామని సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే ప్రభుత్వం మనదని తెలిపారు. ​ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై కూలంకషంగా చర్చించారు. ​ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, రూరల్ ప్రెసిడెంట్ సన్యాసి నాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, అచ్చుతాపురం మండల ప్రెసిడెంట్ పేలా తులసీరామ్, నాలుగు మండలాల అబ్జర్వర్లు, స్టేట్ డైరెక్టర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు.. 1600 మంది పోలీసులతో భద్రత

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 1600 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్సైలు సహా పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

అనకాపల్లి

జర్నలిస్ట్ ల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వ ఆమోదం…

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ధన్యవాదాలు తెలిపిన ఏపీ ఈఎంజేఏ అనకాపల్లి జిల్లా శాఖ యలమంచిలి : రాష్ట్ర వ్యాప్తంగా వున్న అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ప్రకటించడం పట్ల ఏపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ ఈఎంజేఏ జిల్లా అధ్యక్షుడు రుద్ర చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మంత్రి మార్కాపురం చేరుకున్న సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆయనను కలిసి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే నివాస స్థలాలకు సంబంధించిన అంశం గురించి చర్చించారు. స్పందించిన మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితమే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించిందని తెలిపారు. ఈ పథకం వలన రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు 20 వేల మంది అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు ఉపయోగం జరగనుందని, అలాగే ఈ పాలసీ వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.ఈ పాలసీ పొందిన వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మృతి చెందితే ఆ కుటుంబానికి రూ 10 లక్షల రూపాయల మేరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని, కావున ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన జర్నలిస్ట్ లను కోరారు. అలాగే అర్హులైన జర్నలిస్ట్ లకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు జర్నలిస్ట్ లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు.

అనకాపల్లి

యలమంచిలి సబ్ జైలును సందర్శించిన సివిల్ జడ్జి జి. స్పందన..!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి : స్థానిక సబ్ జైలును సోమవారం ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జి. స్పందన సందర్శించి, తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని ముద్దాయిలతో నేరుగా మాట్లాడి, వారి కేసు వివరాలను మరియు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని పెట్టుకోలేని రిమాండ్ ఖైదీలకు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది (లీగల్ ఎయిడ్) సహాయాన్ని అందించి, బెయిల్ పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైదీలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నా, జైలులో ఇతరత్రా ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఖైదీలకు చట్టపరంగా అందాల్సిన సౌకర్యాలను సరిగ్గా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సబ్ జైలు అధికారులు, జైలు సిబ్బంది, కోర్టు/న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

పోలవరం జలహారతికి ఏటికొప్పాక రైతాంగం కదలాలి!

పాయకరావుపేటలో సెప్టెంబర్ 2న చారిత్రాత్మక జలహారతి కార్యక్రమం అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పోలవరం ఎడమ ప్రధాన కాలువ జలహారతి కార్యక్రమం సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో జరగనున్న నేపథ్యంలో ఏటికొప్పాక గ్రామ ప్రజలు, రైతులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సేవా కేంద్రం పిలుపునిచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేసే దిశగా పోలవరం ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పోలవరం నీరు అందుబాటులోకి వస్తే వేలాది ఎకరాలు సస్యశ్యామలం కావడంతో పాటు రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. “నీరు ఉంటేనే పంట.. పంట ఉంటేనే రైతు భవిష్యత్తు” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ జలహారతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఏటికొప్పాక గ్రామం నుంచి పాయకరావుపేటకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలవరం జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి

అంత్యోదయ స్ఫూర్తితో ఆత్మగౌరవం.. సాధికారత దిశగా బీజేపీ

అనకాపల్లిలో ఘనంగా సంచార జాతుల విముక్త దివాస్ “స్ఫూర్తి” అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి డా. రావు గోపాల్ రావు కళాకేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్త దివాస్ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సంచార, విముక్త జాతుల ఆత్మగౌరవం, సంక్షేమం, సాధికారతపై నాయకులు అవగాహన కల్పించారు. బ్రిటిష్ పాలనలో అన్యాయానికి గురై, తరతరాలుగా వివక్షను ఎదుర్కొన్న సంచార, విముక్త జాతుల గౌరవం, అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. “సంక్షేమం మాత్రమే కాదు.. సాధికారతే లక్ష్యం” అనే స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల బీజేపీ అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి, నగిరెడ్డి శ్రీనుబాబు, పనసపల్లి రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

గంజాయి సేవించే వారిపై ‘డ్రగ్ టెస్టింగ్’ అస్త్రం..!

అనకాపల్లి జిల్లా: ఆగస్టు 30 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు పట్టణ ఎస్ఐ సావిత్రి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గంజాయి, డ్రగ్స్ సేవించే వారిని తక్షణమే గుర్తించేందుకు అత్యాధునిక ‘డ్రగ్ టెస్టింగ్ కిట్ల’ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టౌన్ ఎస్సై సావిత్రి తెలిపారు. ఇటీవల పట్టణ పరిధిలో గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో కొంతమందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురు మాదకద్రవ్యాలు వాడినట్లు రిపోర్టుల్లో నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. వారిని వ్యసనం నుంచి బయటపడేసి, పునరావాసం కల్పించేందుకు అనకాపల్లిలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి ఉచిత వైద్యం, మానసిక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి సేవించినా లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యలమంచిలిని ‘డ్రగ్ ఫ్రీ టౌన్’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ డిఆర్‌పి రమ్య, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.