పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
సెప్టెంబర్ 2న పాయకరావుపేట ‘జలహారతి’ని జయప్రదం చేయాలని పిలుపు
యలమంచిలి :పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలి. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు రావడం ఒక గొప్ప వరమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రాంతాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, జలహారతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని అన్నారు. అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే నీటి పారుదల ప్రాజెక్టును పూర్తి చేసి జలహారతి ఇస్తామని సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే ప్రభుత్వం మనదని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, రూరల్ ప్రెసిడెంట్ సన్యాసి నాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, అచ్చుతాపురం మండల ప్రెసిడెంట్ పేలా తులసీరామ్, నాలుగు మండలాల అబ్జర్వర్లు, స్టేట్ డైరెక్టర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


