Wednesday, 23 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఏటికొప్పాక జడ్పీహెచ్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

గురువే జ్ఞానజ్యోతి.. భావితరాలకు మార్గదర్శి! యలమంచిలి , సెప్టెంబర్ 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కె. అమ్మాజీ గారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, మంచి నడవడికను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటిచెప్పేలా ఉత్సాహభరితంగా సాగింది.

అనకాపల్లి

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు.. భక్తజన సందోహం మధ్య ఘనంగా ఉట్టి మహోత్సవం.!

కృష్ణుడి నామస్మరణతో మార్మోగిన ఎర్రవరం అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి: పట్టణంలోని ఎర్రవరంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే యాదవ సోదరులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సాంప్రదాయ ఉట్టి కొట్టే మహోత్సవం భక్తులు, యువత ఉత్సాహంతో ఘనంగా సాగింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు), బోదేపు గోవింద్, గుప్తా, అధ్యక్షులు దూళి అప్పలచిట్టి, ఉపాధ్యక్షులు కిల్లాడి సత్యనారాయణ, సబ్బు రమణ, సొరంగి చిన్న, మాజీ కౌన్సిలర్లు పిట్టా సత్తిబాబు, సియాద్రి శ్రీనివాసరావు, పిట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్

అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యలమంచిలి మండలంలోని రుక్మిణీపురం,రేగుపాలెం గ్రామాల్లో. కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి ఉత్సవం (ఉట్టి కొట్టే కార్యక్రమం)తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ధర్మాన్ని పరిరక్షించి, సమాజంలో శాంతియుతమైన జీవనాన్ని అందించడమే శ్రీకృష్ణుడి సందేశం. జగద్గురువు శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

అయ్యన్నపాత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రగడ..

అనకాపల్లి జిల్లా : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ​యలమంచిలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదినాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ “అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర ప్రజా గొంతుకగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు. నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన అనుభవం, దిశానిర్దేశం ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన రమేష్ కుమార్, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షుడు లాలం భరత్, మునగపాక మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట విజయ్, టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాజు, ఆడారి ఆదిమూర్తి, ఎరిపిళ్లి చిట్టిబాబు, సేనాపతి నాగేశ్వరరావు, మజ్జి రామకృష్ణ, మామిడి శివ అప్పారావుతో పాటు యలమంచిలి తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్ ఇంఛార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు..! అభిమానులకు రూ.5 లక్షల బీమా కానుక..!!

అనకాపల్లి జిల్లా :(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎలమంచిలి నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలు ఎలమంచిలి: మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని పుట్టినరోజు కానుకగా అందజేశారు. ఈ బీమా పాలసీని గల్లా కొండలరావు ద్వారా ద్వారపురెడ్డి నాగేశ్వరరావు అందజేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా ఎలమంచిలి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అభిమానులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 1,500 మామిడి, జామ, కొబ్బరి తదితర మొక్కలను నాటారు. రాష్ట్రంలో చిరంజీవి జన్మదినం సందర్భంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఎలమంచిలి నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కలు నాటడం విశేషంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అభిమానుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జే. ఏ. సి, ప్రతినిధులు తెలిపారు. చిరంజీవి అభిమానులు చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

అనకాపల్లి

పోలవరం ఎడమ కాలువ నీటిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు..!

అనకాపల్లి జిల్లా (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు అంశంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై విమర్శలు చేశారు. అనకాపల్లి పర్యటనను కూడా ప్రభుత్వం మరో ఈవెంట్‌గా మార్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం కాకుండా, ఉత్తరాంధ్రకు శాశ్వతంగా సాగు, తాగునీటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.

అనకాపల్లి

గోదావరి జలాలకు ఘనంగా ‘జలహారతి’…!

అనకాపల్లి జిల్లా : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి నియోజకవర్గ రైతాంగ సుదీర్ఘ స్వప్నం నెరవేరింది. గోదావరి ఎడమ కాలువ (కుడుకాలువ) నీరు ప్రాంతానికి చేరుకోవడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు యలమంచిలి నియోజకవర్గంలో టౌన్ పరిధిలో పెద్దపల్లి గ్రామం, వెంకటాపురం మరియు యలమంచిలి రూరల్ పరిధిలో షేకలపాలెం కాలువ వద్ద గంగమ్మ తల్లికి, గోదావరి జలాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ ‘జలహారతి’ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంతోకాలంగా సాగునీటి కోసం నిరీక్షిస్తున్న మన ప్రాంత రైతులకు ఈ గోదావరి జలాలు కొత్త ఊపిరి పోశాయి. ఈ నీటి రాకతో యలమంచిలి నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది.* ఈ కాలువ నీటి వల్ల కేవలం పంట పొలాలకే కాకుండా, నియోజకవర్గంలోని పలు గ్రామాల తాగునీటి ఎద్దడి తీరుతుంది. భూగర్భ జలాలు కూడా విశేషంగాఈ కాలువ నీటి వల్ల కేవలం పంట పొలాలకే కాకుండా, నియోజకవర్గంలోని పలు గ్రామాల తాగునీటి ఎద్దడి తీరుతుంది. భూగర్భ జలాలు కూడా విశేషంగా పెరుగుతాయి.* చివరి ఆయకట్టు రైతు వరకు ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రైతాంగ సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత.ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల పార్టీ ప్రెసిడెంట్ నానాజీ, అచ్చుతాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్ , యలమంచిలి రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ సన్యాసినాయుడు , జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు రాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి , జిల్లా అధికారి ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ బొడ్డపు శ్రీనివాసరావు, దాంట్ల వెంకటస్వామి, సేనాపతి నాగేశ్వరరావు, శ్రీను, రమణబాబు , ఎరిపిళ్ళి చిట్టిబాబు, యలమంచిలి టౌను జనసేన పార్టీ అధ్యక్షులు బద్ధపు శ్రీనివాసరావు, నమ్మి రమణ, మజ్జి రామకృష్ణ బిశెట్టి చిన్నారావు, ఐటీడీపి అశోక్,సేనాపతి తులసిరామ్,యల్లపు శ్రీనివాస్ రావు,ఎల్లపు గోపి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిపార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక నుంచి పులపర్తికి వెళ్లాలంటే.. ఒకపక్క రోడ్డు కష్టాలు, మరోపక్క రైల్వే గేట్ ఇబ్బందులు!

రహదారి అధ్వానం.. రైల్వే గేటుతో ప్రజలకు తప్పని ఇబ్బందులు అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 4 (పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్): ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఏటికొప్పాక గ్రామానికి రహదారి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక నుంచి పులపర్తి మీదుగా NH-5 ప్రధాన రహదారికి వెళ్లే మార్గం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి అభివృద్ధి చేయకపోవడంతో అత్యవసర సమయంలో అంబులెన్సులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏటికొప్పాక–పద్మనాభరాజుపేట మధ్య ఉన్న రైల్వే గేటు ప్రజలకు ప్రధాన సమస్యగా మారింది. రైళ్ల రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో 30 నిమిషాలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఈ ఆలస్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏటికొప్పాక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఏటికొప్పాక నుంచి పులపర్తి–NH-5 రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే గేటు వద్ద అండర్‌పాస్ లేదా ఆర్‌ఓబీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రైల్వే శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏటికొప్పాక ప్రజల రహదారి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

అనకాపల్లి

విద్యార్థుల క్రీడా కలలకు రెక్కలు.. రేవు పోలవరం జడ్పీహెచ్ స్కూల్‌కు సీనియర్ క్రికెట్ టీం చేయూత.

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): రేవు పోలవరం జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సీనియర్ క్రికెట్ టీం ముందుకు వచ్చి స్పోర్ట్స్ కిట్‌ను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాలకు స్పోర్ట్స్ కిట్ అందించిన క్రికెట్ టీం సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందించిన క్రీడా సామగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు కారే అమ్మోరయ్య, చోడిపల్లి లోవరాజు, సింహాచలం, బొడ్డు ధనరాజు, గనగళ్ల బంగారు రాజు, గనగల నాగరాజుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలకు క్రీడా సామగ్రి, విద్యా సామగ్రి అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాఠశాల సిబ్బంది కోరారు. సమాజంలోని దాతలు, యువత, సేవా సంస్థలు ఇలాంటి పాఠశాలలకు అండగా నిలిస్తే మరెంతో మంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి

“జోహార్ వైఎస్సార్” నినాదాలతో మార్మోగిన గ్రామం అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో బుధవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్” అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.