Sunday, 6 September 2026
  • Home  
  • అయ్యన్నపాత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రగడ..
- అనకాపల్లి

అయ్యన్నపాత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రగడ..

అనకాపల్లి జిల్లా : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ​యలమంచిలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదినాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ “అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర ప్రజా గొంతుకగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు. నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన అనుభవం, దిశానిర్దేశం ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన రమేష్ కుమార్, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షుడు లాలం భరత్, మునగపాక మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట విజయ్, టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాజు, ఆడారి ఆదిమూర్తి, ఎరిపిళ్లి చిట్టిబాబు, సేనాపతి నాగేశ్వరరావు, మజ్జి రామకృష్ణ, మామిడి శివ అప్పారావుతో పాటు యలమంచిలి తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్ ఇంఛార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

​యలమంచిలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదినాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ “అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర ప్రజా గొంతుకగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు. నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన అనుభవం, దిశానిర్దేశం ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన రమేష్ కుమార్, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షుడు లాలం భరత్, మునగపాక మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట విజయ్, టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాజు, ఆడారి ఆదిమూర్తి, ఎరిపిళ్లి చిట్టిబాబు, సేనాపతి నాగేశ్వరరావు, మజ్జి రామకృష్ణ, మామిడి శివ అప్పారావుతో పాటు యలమంచిలి తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్ ఇంఛార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.