Monday, 29 June 2026
  • Home  
  • చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు అవసరం
- తిరుపతి

చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు అవసరం

శ్రీ కాళహస్తి, జూన్ 28, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి: పోలియో మహమ్మారిని సమాజం నుంచి శాశ్వతంగా నిర్మూలించి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 34వ వార్డు మున్సిపల్ పాఠశాల కేంద్రంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో సుమారు 120 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. పోలియో చుక్కలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్ మెదడు లేదా వెన్నుపాముపై దాడి చేయకుండా కాపాడతాయని వివరించారు. దీనివల్ల పక్షవాతం, శాశ్వత అంగవైకల్యం వంటి ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.