కృష్ణుడి నామస్మరణతో మార్మోగిన ఎర్రవరం
అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
యలమంచిలి: పట్టణంలోని ఎర్రవరంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే యాదవ సోదరులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సాంప్రదాయ ఉట్టి కొట్టే మహోత్సవం భక్తులు, యువత ఉత్సాహంతో ఘనంగా సాగింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు), బోదేపు గోవింద్, గుప్తా, అధ్యక్షులు దూళి అప్పలచిట్టి, ఉపాధ్యక్షులు కిల్లాడి సత్యనారాయణ, సబ్బు రమణ, సొరంగి చిన్న, మాజీ కౌన్సిలర్లు పిట్టా సత్తిబాబు, సియాద్రి శ్రీనివాసరావు, పిట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


