Wednesday, 23 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

అనకాపల్లి టౌన్ పరిధిలో వరుస దొంగతనాల కేసుల ఛేదన, నిందితుల అరెస్ట్,

అనకాపల్లి, ఆగస్టు 30: ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) అనకాపల్లి పట్టణ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అనకాపల్లి టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసుల వివరాలు: స్కూటీ డిక్కీల చోరీ కేసు: బీఆర్‌టీ కాలనీకి చెందిన ముప్పిడి రాజు @ జైరాజు అనే పాత నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎన్‌టీఆర్ గ్రౌండ్ వద్ద పార్క్ చేసిన స్కూటీ డిక్కీ తెరిచి రెండు సెల్‌ఫోన్లు, అలాగే చోడవరం నాయుడు జ్యువెల్స్ పార్కింగ్ ఏరియాలో స్కూటీ డిక్కీ నుంచి ₹5,000 నగదు దొంగిలించినట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి నగదు, సెల్‌ఫోన్లను రికవరీ చేసి, గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులు: అనకాపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఒకటి, సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద మరొకటి — ఒకే రోజు రెండు స్కూటీలను దొంగిలించిన కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ చోరీలకు ఒక మైనర్ బాలుడు పాల్పడినట్లు గుర్తించి, అతని వద్ద నుంచి రెండు స్కూటీలను రికవరీ చేశారు. పోలీస్ అధికారులకు ఎస్పీ గారి ప్రశంసలు: ఈ కేసులను త్వరితగతిన ఛేదించి సొత్తును రికవరీ చేయడంలో చురుగ్గా వ్యవహరించిన అనకాపల్లి టౌన్ ఎస్ఐ అల్లు వెంకటేశ్వర రావులతో పాటు ప్రతిభ కనబరిచిన సిబ్బంది సముద్రం, ఆర్.పి.నాయుడు, టీ.ఎస్.నాయుడు లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసించారు.

అనకాపల్లి

వరహానది ఆయకట్టు కాలువకు అడ్డంగా కాంక్రీట్ గోడ నిర్మాణం.. 3,600 ఎకరాల రైతుల ఆందోళన..!!!

అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎస్.రాయవరం మండలంలోని వరహానది ఆయకట్టు పారుదల కాలువ దిగువ ప్రాంతంలో సుమారు 3,600 ఎకరాల వ్యవసాయ భూములకు నీరు పారేందుకు ఇబ్బందులు కలిగే విధంగా కాలువకు అడ్డంగా సిమెంట్ కాంక్రీట్‌తో గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై దిగువ ప్రాంత రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మండల స్థాయి నాయకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల సహకారంతో ఆదివారం సెలవు రోజును అవకాశంగా తీసుకొని కాలువకు అడ్డంగా సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులు చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ గోడ నిర్మాణం వల్ల దిగువ ప్రాంతంలోని మూడు గ్రామాలకు చెందిన సుమారు 3,600 ఎకరాల వ్యవసాయ భూములకు పారుదల నీరు సక్రమంగా అందక తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువకు అడ్డంగా గోడ నిర్మించడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని, ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్ గానీ, సంబంధిత శాఖల అనుమతులు గానీ ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ ప్రాంతంలోని మూడు గ్రామాల ప్రజలు అడ్డుపడుతున్నప్పటికీ, పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణంపై సోమవారం సంబంధిత డీఈ (డిప్యూటీ ఇంజినీర్) అధికారికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఉప్పరాపల్లి గ్రామానికి చెందిన సుందరపు ఈశ్వరరావు, తేటకలి సత్యనారాయణ, ఇతర గ్రామ పెద్దలు తెలియజేసారు .

అనకాపల్లి

తెలుగు భాషా దినోత్సవం – జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహణ….!

రేవుపోలవరం: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ జడ్పీహెచ్ఎస్ రేవుపోలవరం పాఠశాలలో శనివారం *తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవంను* పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్యానికి ప్రముఖుల చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేసిన *గిడుగు వెంకట రామమూర్తి పంతులు* సేవలను స్మరించుకున్నారు. మాతృభాషను ప్రేమించి, గౌరవించి, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా *జాతీయ క్రీడా దినోత్సవం* సందర్భంగా హాకీ దిగ్గజం *మేజర్ ధ్యాన్‌చంద్‌ను* స్మరించుకున్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు వివిధ క్రీడలపై అవగాహన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు మరియు *విద్యార్థులు* పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. *”మాతృభాషను గౌరవిద్దాం – క్రీడలను ప్రోత్సహిద్దాం”* అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

అనకాపల్లి

ఎమ్మెల్యే విజయ్ కుమార్‌ కి రాఖీ కట్టిన కలెక్టర్ విజయకృష్ణన్….!

Search.. logo పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ​యలమంచిలి : రాఖీ పౌర్ణమి వేడుకలను యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ​అనంతరం ఎమ్మెల్యే మాట్లాడూ.. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్ విజయకృష్ణన్ అందిస్తున్న సేవలు, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అనకాపల్లి

హోం మంత్రి అనిత చేతుల మీదుగా ప్రగడ నాగేశ్వరరావుకి రాఖీ శుభాకాంక్షలు..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ఎలమంచిలి: రాఖీపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు శుక్రవారం సాయంత్రం (28 ఆగస్టు 2026) తమ కార్యాలయంలో తన సోదరుడైన ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావును రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని, ప్రేమానురాగాలను పెంచే పర్వదినమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలియజేశారు.

అనకాపల్లి

కార్పొరేట్ సేవా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం: మై హోమ్ ఇండస్ట్రీస్..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద నున్న, మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రారంభమై 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సేవా స్ఫూర్తిని చాటుతూ మహా సిమెంట్ ఫ్యాక్టరీ కుటుంబ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహా సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ బి. రామస్వామి, పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఎల్. శ్రీనివాసరావు, సీఎస్ఓ డి. వెంకట్రావు, తో కలిసి ఉద్యోగులు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌కు రక్తదానం చేశారు. మై హోమ్ ఇండస్ట్రీస్ 19వ వార్షికోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రాణాలను కాపాడే మహోన్నత రక్తదానం ద్వారా జరుపుకోవడం సంస్థ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలను సంస్థ ప్రతినిధులు అభినందించారు. “రక్తదానం.. ప్రాణదానం” అనే సందేశాన్ని సమాజానికి చాటుతూ, మై హోమ్ ఇండస్ట్రీస్ 19వ వార్షికోత్సవ వేడుకలు సేవా భావంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనకాపల్లి

ఏటికొప్పాక జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం

తెలుగు వెలుగు.. క్రీడా స్ఫూర్తి! యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లా రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి, భారత క్రీడా రంగానికి చిరస్మరణీయ సేవలందించిన మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఊడి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, విద్యార్థులు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని సూచించారు. అలాగే చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భాషాభిమానం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా సాగింది.

అనకాపల్లి

ఎరుకువానిపాలెంలో పర్యావరణ రక్షాబంధన్ వేడుకలు(ఎంపీయూపీ పాఠశాల)

అనకాపల్లి జిల్లా , ఆగస్టు 28: ఎంపీయూపీ పాఠశాల – ఎరుకువానిపాలెంలో నేడు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా, పర్యావరణ పరిరక్షణ సందేశంతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్వయంకృషితో పర్యావరణహిత రాఖీలను తయారు చేశారు. రక్షాబంధన్‌ను వినూత్నంగా నిర్వహిస్తూ, విద్యార్థులు తయారు చేసిన రాఖీలను పాఠశాల ఆవరణలోని చెట్లకు కట్టి, “చెట్లను కూడా మన సోదరుల్లా రక్షించాలి” అనే సందేశాన్ని అందించారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహనను ప్రధాన ఉపాధ్యాయలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విద్యార్థుల్లో పెంపొందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.పీ.బి. శ్రీధర్, ఉపాధ్యాయులు శ్రీమతి జయశ్రీ రాణి, శ్రీమతి సుజాత, శ్రీమతి ఉమ , శ్రీ కృష్ణారావు , శ్రీ మూర్తి , అలాగే SMC చైర్మన్ అరిగా శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి భానుమతి గారు,పద్మిని,లక్ష్మి,శ్రీలక్ష్మి అతిథులుగా హాజరై విద్యార్థులకు రాఖీలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేసి, వారితో ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అతిథులు ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకతను, పర్యావరణంపై వారికున్న బాధ్యతను ఉపాధ్యాయులు అభినందించారు. సంప్రదాయ పండుగలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానిస్తూ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రకృతి ప్రేమ, విలువలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. “చెట్లకు రాఖీ – ప్రకృతికి రక్షణ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు అతిథుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల నూతన స్ఫూర్తిని నింపింది.

అనకాపల్లి

యలమంచిలి న్యాయవాదులు విధుల బహిష్కరణ….!

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ నిరసన ఎలమంచిలి, ఆగస్టు 28 —( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎలమంచిలి న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విధులను బహిష్కరించారు. న్యాయవాదుల గౌరవం, భద్రత మరియు న్యాయవాద వృత్తి రక్షణ కోసం రాజస్థాన్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణపై మాట్లాడుతూ, శుక్రవారంతో పాటు సోమవారం కూడా తమ విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. సందర్భంగా న్యాయవాదులు తమ నిరసనను వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలమంచిలి న్యాయవాదుల డిమాండ్‌ను పరిష్కరించాలని, కోర్టు ఆవరణలో తమ వృత్తిపరమైన భద్రతకు హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక అభివృద్ధికి మహా బాట.. హస్తకళల థీమ్ పార్కుకు శంకుస్థాపన!

కళాకారుల కలలకు రెక్కలు.. పర్యాటక గ్రామంగా ఏటికొప్పాక అభివృద్ధికి శ్రీకారం ఎలమంచిలి, ఆగస్టు 28 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక హస్తకళాకారుల చిరకాల కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది. ఏటికొప్పాకలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న హస్తకళల థీమ్ పార్క్‌కు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, శ్రీ ఎస్.ఎస్. రావత్ ఐఏఎస్, శ్రీ రవి పటాన్ శెట్టి ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యాటక అభివృద్ధి మరియు సాంస్కృతిక శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏటికొప్పాక హస్తకళలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, థీమ్ పార్క్ ఏర్పాటుతో కళాకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఏటికొప్పాకను పర్యాటక గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని తెలిపారు. థీమ్ పార్క్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పార్క్ ద్వారా ఏటికొప్పాకకు వచ్చే పర్యాటకులకు హస్తకళల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించడంతో పాటు, కళాకారుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, అధికారులు హస్తకళాకారులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. కళాకారులు తయారు చేస్తున్న ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను మరింత అభివృద్ధి చేసి, కళాకారులకు మెరుగైన ఆదాయం వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, హస్తకళాకారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థీమ్ పార్క్ ఏర్పాటుతో ఏటికొప్పాక హస్తకళలకు మరింత ప్రాచుర్యం లభించడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగి గ్రామానికి ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చేకూరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.