పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి : మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సోమవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ (నానాజీ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి, గత రెండు సంవత్సర కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, జిల్లాలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. యువతకు పెద్దపీట వేస్తూ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బొద్ధపు. శ్రీనివాసరావు, వార్డు ఇంచార్జ్ బొద్ధపు. నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షుడు నమ్మి.రమణ, జనసేన వార్డు అధ్యక్షుడు బోద్ధపు గణేష్, వార్డు సెక్రటరీ పందల సూరిబాబు, దాంట్ల విజయకుమార్ తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


