Tuesday, 12 May 2026

Blog

నిర్మల్

గృహలక్ష్మి లబ్ధిదారులకు మొండి చెయ్యి…?

పున్నమి ప్రతినిధి ముధోల్: ఇంద్రమ్మ పథకంలో అవకాశం కల్పించండి ప్రజా ప్రతినిధులు-అధికారులను కోరుతున్న లబ్ధిదారులు ఇల్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి కలను సహకారం చేయడానికి ప్రోసిడింగ్ కాపీలను అందించింది. ముధోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో దాదాపు 3000 మంది లబ్ధిదారులకు 2023 సెప్టెంబర్ నెలలో ప్రొసీడింగ్ కాపీలను అందించింది. లబ్ధిదారులు తమ సొంతింటి కలను సహకారం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 3 లక్షల రూపాయలను లబ్ధిదారులకు చెల్లిస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు సైతం ఇంటి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు బేస్మెంట్- స్లాబ్ వేసిన తర్వాత ఇల్లు మొత్తం పూర్తి అయితే మూడు విడతల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. అయితే అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గృహలక్ష్మి పథకానికి బదులుగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. ప్రజా పాలనలో భాగంగా లబ్ధిదారుల నుండి ప్రభుత్వం వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇంద్రమ్మ కోసం సైతం దరఖాస్తులు స్వీకరించారు. అయితే అప్పటికే గృహలక్ష్మి పథకం ద్వారా ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను ప్రారంభించి వివిధ దశలకు చేరుకుంది. 2025 మార్చి నెలలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో గృహలక్ష్మి లబ్ధిదారుల వివరాలను సేకరించి పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. మండల అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది గృహలక్ష్మి లబ్ధిదారులకు సంబంధించి గృహాల వివరాలను వారి స్టేజీల ఆధారంగా నమోదు చేసుకుని మండల అధికారులకు అందించారు. మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల వివరాలను జిల్లా అధికారులకు పంపారు. అయితే ఇంద్రమ్మ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో గృహలక్ష్మి లబ్ధిదారులు సైతం ఉన్నారు. ప్రభుత్వం సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసింది. తమకు గతంలోనే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లను మంజూరు చేసిందని అనంతరం అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని లబ్ధిదారులు పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

తిరుపతి

తాగునీటి మోటారుకు మరమ్మత్తులు

పున్నమి న్యూస్,జూలై(శ్రీ కాళహస్తి ప్రతినిధి) ఏర్పేడు మండలం కుక్కల గుంట పంచాయితీ పాయల్ సెంటర్ నందు పది రోజులుగా మోటార్ మరమ్మత్తులకు గురి కావడం జరిగింది. వెంటనే ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడుకి గ్రామస్థులు మరియు టిడిపి కార్యకర్త లోకేష్ వర్మ చరవాణి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. కార్యకర్త మరియు గ్రామస్థులు ఆదేశాల మేరకు మండలా ధ్యక్షులు ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడంతో పంచాయతీ సెక్రటరీ పిఎస్ దీప్తి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి మోటారుకు మరమ్మత్తులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించారు. గ్రామస్తులు మండలాద్యక్షులు పేరం నాగరాజునాయుడు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాదయ్య, పూడి మురళి, బిల్లు యువరాజు,డీలర్ జయశేఖర్ రాజు,మణిరాజు పాల్గొన్నారు.

ఖమ్మం

రాజా సాయి మందిరం లో అన్నదానం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ గ్రామం లో వెలసిన ఉన్న శ్రీ రాజా సాయి మందిరం లో గురువారం సందర్భముగా అన్నదాతలు కీర్తిశేషులు పల్లపోతుల నరసింహారావు గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు పల్లపోతుల కృష్ణారావు గారు సావిత్రి దంపతులు వి ఎం బంజర్. శ్రీ వనమా నాగేశ్వరరావు గారు టీచర్ గారు ఈరోజు వారి సర్వీస్ నుండి ఆనందంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి శ్రీమతి వనమా ఇందిరా గారు అన్నదానం, వి ఎం బంజర్ . శ్రీ జాలాది శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు దంపతులు కొత్త కారాయి గూడెం అన్నదానం. శ్రీ జన్నారెడ్డి ఉమేష్ చంద్రారెడ్డి లండన్ లో ఉన్నత చదువు కొరకు ప్రయాణం సందర్భంగా జన్నారెడ్డి జ్యోతి రాజిరెడ్డి వి ఎం బంజర్ దాతల సహకరమ తో అన్న దానం నిర్వహించడం జరిగింది అని దేవస్థాన ఛైర్మన్ శ్రీమతి జెన్నారెడ్డి విజయ నరసింహ రెడ్డి తెలియజేసారు.

ఖమ్మం

ఫుడ్ ఇన్స్పెక్టర్ లు జర పట్టించుకోండి

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా లో 5 నియోజకవర్గాలు 25 మండలాలు 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయ్. 25 మండలాల్లో సుమారుగా 500 నుండి 1000 మధ్య హోటల్ రెస్టారెంట్ లు, బిర్యానీ పాయింట్లు ఉన్నాయ్.ఉన్నోళ్లు పెద్ద పెద్ద రెస్టారెంట్ లు లేనోడు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్ లకి వెళ్తుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటీ అంటే ఏ ఒక్క చోట కూడా నాన్యమైన శుచి కరమైన ఆహరం అందిచడం లేదు. నిల్వ ఉన్న చికెన్ సార్వ లు, చికెన్ లు, ఇతర ఆహార పదార్ధాలని వినయోగ దారులకి అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మురుగు నీటి కాల్వల పక్కన బండ్లు పెట్టి ఆహార పదార్ధాలు తయారు చేసి విక్రఇస్తున్నారు. అవి తిని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. వర్షాలు మొదలై సీజనల్ రోగాలు ఒక పక్కన ఉంటే నాణ్య మైన ఆహరం అందిచకుండా ప్రజల ఆరోగ్యం తో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారస్తులు ఒక పక్క. ఇప్పటికి అయినా జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు హోటల్, రెస్టారెంట్ లు, ఆహార సంభందిత పరిశ్రమ ల మీద దాడులు చేసి నాసి రక మైన ఆహరం అందజేస్తున్న వాటిని సీజ్ చేసిన కఠిన శిక్షలు అమలు చెయ్యాలిసిన అవసరం ఎంత అయినా ఉంది అని ప్రజలు కోరుతున్నారు

ఖమ్మం

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పంపిణి నిరంతర. ప్రక్రియ. మంత్రి పొంగులేటి

*రేషన్ కార్డులు పంపిణి* నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేల కొండపల్లి మార్కెట్ యార్డ్ నందు జరిగిన కార్యక్రమం లో తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డు లు పంపిణి చేశారూ. మండలం మొత్తం 1000 నూతన కార్డులు మంజూరు అవ్వగా 650 కార్డులు పంపిణి చేశారూ. ఈ సందర్భముగ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పంపిణి నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమం లో మువ్వ విజయ్ బాబు, పి సీతారాములు, బేబీ స్వర్ణ కుమారి, బొడ్డు బొందయ్యా, మామిడి వెంకన్న, శాఖమూరి రమేష్, నెల్లూరు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

గుండ్ల రాజేష్ కి నివాళులు అర్పించిన మాజీ శాసన సభ్యులు సండ్ర

ఖమ్మం పున్నమి ప్రతినిధి హైదరాబాదులో షటిల్ ఆడుతూ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. గురువారం రాకేష్ దశదిన కర్మ తల్లాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సండ్ర వెంకట వీరయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు దంపతులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని ఆభయం ఇచ్చారు. అనంతరం రాకేష్ ను ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకటలాల్, పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు జివిఆర్, నాయకులు దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, పెరిక నాగేశ్వరరావు, గుండ్ల నాగయ్య, కోడూరు వీర కృష్ణ, రఘు తదితరులన్నారు.

తెలంగాణ

నకిరేకల్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా!

నకిరేకల్ లో జులై 29,30 రోజులలో సీఐ అధ్యర్యంలో ఇందిరాగాంధీ బొమ్మ వద్ద నుండి కడపర్తి రోడ్డు వరకు మరియు బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు మీద ఉన్న బండ్లను, చెత్త లేకుండా తొలగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, మునిసిపల్ కమీషనర్, వారి సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు.

ఖమ్మం

బిజెపి కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కి పితృ వియోగం

ఖమ్మం జిల్లా బిజెపి సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి భోల్లా బిక్షపతి తండ్రి భోల్లా చిన్న లక్ష్మయ్య ఈరోజు అనారోగ్యం కారణల వల్ల బోనకల్ మండలం ముష్టికుంట గ్రామం లో వారి స్వగృహం నందు మరణించారు. వారి యొక్క మృతి పట్ల బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, తాండ్ర వినోద్ రావు, వీరపనేని ఆప్పారావ్, తాల్లూరు సురేష్ దంపతులు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.

సంగారెడ్డి

నారాయణఖేడ్ జూలై 30: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: సబ్ కలెక్టర్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను నారాయణఖేడ్ డీఎల్పీఓ సంజీవరావు గారు, నిజాంపేట్ ఎంపీడీవో సంగ్రామ్ గారు, నిజాంపేట్ ఎంపీవో విజయ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను మరింత వేగంతో నిర్వహించాలని సూచించారు.

ఖమ్మం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన మంత్రి తుమ్మల

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణకు యూరియా సరఫరాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచందర్ రావు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని తెలంగాణకే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందనడం అవివేకం అన్నారు. రామచందర్ రావు వ్యాఖ్యలు బీజేపీకి రైతులపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు వద్దని ఎన్నిసార్లు కోరినా రామచందర్ రావు వైఖరి మారడం లేదన్నారు. రాజీనామా సవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తే బాగుంటుందని సెటైర్ వేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం గొప్పు లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు రైతులను తప్పుదారి పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితిపై లెక్కలతో సహా కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు. కాగా రాష్ట్రంలో సరిపడి యూరియా స్టాక్ ఉందని అయినా ఎరువుల కొరత ఎందుకు ఉందని ఇటీవల రామచందర్ రావు ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లోకి యూరియా వెళ్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన తుమ్మల రామచందర్ రావుపై అసహనం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.