Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షుణ్ణి పరామర్శించిన తాండ్రా వినోద్ రావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు బానోత్ రాంబాబు గారి తండ్రి బానోత్ హరినాయక్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు చిట్టి రామవరం లోని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈకార్యక్రమంలో బుడగం రవి, సొప్పరి క్రాంతి, వీరన్న, ముచ్చ కుర్తి కిరణ్, మాచర్ల మహేష్, కందికట్ల వెంకట్, మల్లం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నారాయణఖేడ్ జూలై 30: ‘స్పాట్ అడ్మిషన్కు దరఖాస్తు చేసుకోండి

నారాయణఖేడ్ పట్టణంలోని TG సాంఘిక సంక్షేమ గురుకులబాలుర కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరంలోఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 31న స్పాట్ అడ్మిషన్లునిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లింగారెడ్డి మంగళవారంతెలిపారు. స్థానికంగా ఎంపీసీ, బైపీసీలో ప్రవేశంపొందేందుకు విద్యార్థులు తమ అర్హత గల ఒరిజినల్ధ్రువపత్రాలతో గురువారం హాజరు కావాలన్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు దరఖాస్తులుస్వీకరిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఐడియా బాక్స్ లను ఏర్పాటు చెయ్యాలి.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల క్రింద ఉన్న ఉన్నత పాఠశాలలో ఐడియా బాక్సులను ఏర్పాటు చేయాలనిజిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి బుధవారం తెలిపారు.ఇన్ స్పైర్ సంబంధించిన ప్రాజెక్టు వివరాలను ఐడియాబాక్సులలో విద్యార్థులతో వేయించాలని చెప్పారు.ఐడియా బాక్సులకు వచ్చినా ఉత్తమ ప్రాజెక్టులనుఆన్లైన్లో నమోదు చేయించాలని పేర్కొన్నారు.

అన్నమయ్య

పోల్లపల్లిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మహిళకు రక్త గాయం…..

చిట్వేల్ మండల పరిధిలోని పోలోపల్లి గ్రామం నందు సోమవారం రాత్రి మణికల మల్లికార్జున కుటుంబానికి మరియు అతని దగ్గరి మనస్పర్ధలు బంధువులు రత్నయ్య కుటుంబానికి పాత గొడవలు ఉండి మనస్పర్ధలు ఉండగా నిన్నటి దినం అనగా 28వ తేదీ జులై రాత్రి సుమారు 8 గంటల సమయంలో సదురు రత్నయ్య తన కూతురు పెళ్లి పత్రికను మల్లికార్జున కు మరియు అతని తమ్ముడు అయినా రమేష్ అనువారికి ఇవ్వడానికి వెళ్ళగా ఆ సమయములో మల్లికార్జున, రమేష్ అనువారు రత్నయ్యతో మీకు, మాకు గొడవలు ఉన్నవి కదా నీవు ఎందుకు మా ఇంటి వద్దకు ఎలా వచ్చావు అని అడగగా మాట మాటకు వచ్చి గొడవ పడుతుండగా అందుతూ అక్కడికి వచ్చిన రత్నయ్య బంధువులు శివయ్య,పెంచలయ్య, నరసింహులు అని వారు మల్లికార్జున, మల్లికార్జున కొడుకు రాకేష్, మల్లికార్జున తమ్ముడు రమేష్, మల్లికార్జున భార్య ప్రమీల అను వారిపై గొడవ చేయగా ప్రమిల కు తల పైన రక్త గాయము కాగా మిగతా వారికి మూగ దెబ్బలు తగిలినవి. ఈ గలాట విషయము చిట్వేల్ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో si.G. నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆర్థిక సహాయం

సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆర్థిక సహాయం నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర వున్న అమరావతి కోచింగ్ సెంటర్ లో B. కాగేశ్వరరావు గారు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి), నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు, త్వరలోనే అగ్ని వీర్, అగ్నిపత్ ప్రారంభమవుతాయి కనుక, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుందని, సహాయం చేయమని, సంస్థలకు మరియు దాతలకు కోరడం జరిగింది,ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి సంస్థ తరఫున నిరుపేద విద్యార్థులు ఫిట్నెస్ కోసం 8000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మన సంస్థ సభ్యులు రేవాడ త్రినాధ రావు మాస్టర్, సురపతి లక్ష్మణరావు మరియు వరప్రసాద్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గుండవిల్లిపేట పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన

నరసన్నపేట మండలం, జూలై 29:మండలంలోని గుండివిల్లిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార నాణ్యతను సుదీర్ఘంగా పరిశీలించిన ఆయన, పిల్లలకు పోషకాహారంతో కూడిన, శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.

అన్నమయ్య

విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ

రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

*కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి*

*ఘనంగా మంథని మున్సిపాలిటీ నాలుగవ మహాసభలు* *కార్మికుల హక్కుల కోసం రాజిలేని పోరాటాలు నిర్వహించాలి* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీనియర్ మున్సిపల్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య సహార్థ సందేశం ఇవ్వగా, మున్సిపల్ కార్మికులు గడిపెళ్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూఎస్బీసీ నాయకులు *ముక్కెర్ల యాదయ్య, జి లక్ష్మీనరసింహారెడ్డి, మెతుకు సైదులు, మైలారం సత్తయ్య* మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి, పీఆర్సీని ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సీ పీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ భాస్కర్, జీ వి రమణారావు, జె కరుణాకర్, జనార్ధన్, బాలయ్య, విజయ, టి. వెంకన్న కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు. *USPC యాదాద్రి జిల్లా కమిటీ*

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.