Tuesday, 12 May 2026

Blog

E-పేపర్

వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు

ఖమ్మం

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పెనుబల్లి నాయకులు

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లో మంగళవారం నాడు జరిగిన బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు యొక్క ఆత్మీయ సమ్మేళనం లో సత్తుపల్లి నియోజకవర్గం లో పెనుబల్లి నాయకులు పడిగలమధు, బొర్రా నరసింహ రావు, మహేష్, చెక్కిలాల మంగేశ్వరావ్ లు పాల్గొన్నారు

ఖమ్మం

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పెనుబల్లి నాయకులు

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లో మంగళవారం నాడు జరిగిన బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు యొక్క ఆత్మీయ సమ్మేళనం లో సత్తుపల్లి నియోజకవర్గం లో పెనుబల్లి నాయకులు పడిగలమధు, బొర్రా నరసింహ రావు, మహేష్, చెక్కిలాల మంగేశ్వరావ్ లు పాల్గొన్నారు

అన్నమయ్య

బాణాసంచా చేతిలో పేలి తీవ్రంగా గాయపడ్డ పోలోపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు

చిట్వేలి(పున్నమి ప్రతినిధి) జూలై 29 అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోలోపల్లి గ్రామం కు చెందిన కోటేశ్వర రావు అనే యువకునికి చేతిలో బాణాసంచ పేలి తీవ్రంగా గాయాలయ్యాయి. స్నేహితుని బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా కోటేశ్వర రావు తప్పతాగి నాటు రాకెట్ చేతితో పట్టుకొని వెలిగించగా, చేతిలో పేలి తీవ్ర గాయాలయ్యాయి. హుటా హుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కంటికి, చేతులకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్

రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

పున్నమి ప్రతినిధి నిర్మల్: సారంగాపూర్ మండల కేంద్రంలో మండలానికి చెందిన 2118 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది శుభ పరిణామం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారని, ప్రస్తుతం అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇంకా రేషన్ కార్డులు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, నాయకులు రావుల రాంనాథ్, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో,మండల అధ్యక్షులు, మండల నాయకులు, కారకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బోటిమీద పల్లి పంచాయతీ వాస్తవ్యులు అన్నంగి రామలక్ష్మమ్మ గారికి ₹71,664 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , మరియు ముక్కా వరలక్ష్మి

ఓబులువారిపల్లి, (పున్నమి ప్రతినిధి)జులై 28 ఓబులువారిపల్లి మండలం కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన అన్నంగి రామలక్ష్మమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹71,664 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి *ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

అన్నమయ్య

కాకర్ల వారిపల్లి గ్రామ వాస్తవ్వులు పొలిన సుబ్బారాయుడు ₹84,928 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి

ఓబులువారిపల్లి (పున్నమి ప్రతినిధి) జూలై 28 ఓబులువారిపల్లి మండలం బొటిమీడిపల్లి పంచాయతీ కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన పొలిన సుబ్బారాయుడు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹84,928 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి వెళ్లి అందించారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ:”ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ఖమ్మం

ఘనంగా డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్. మీట్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యాసంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ మీట్ సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగినది ఈ మీట్ కి ముఖ్య అతిథిగా యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొని మెడికల్ సీటు సాధించిన విద్యార్ధులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం ఈగ భరణి, రాయల సతీష్, ఈగ లక్ష్మి, రాయల ఈశ్వరీ మరియు అకాడమీ సిబ్బంది విద్యార్థిని, విద్యార్దూ లు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

స్నేహితురాలికి ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిది “స్నేహితురాలికి ఆర్థిక సహాయం” వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన గుడిసె పద్మ ఇటీవల ఆక్సిడెంట్ అయ్యి వెన్నెముక,కాలు విరిగింది..ఆ విషయం తెల్సుకున్న తన పదవ తరగతి మిత్రులు 51,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది, భవిష్యత్తులో పద్మ కుటుంబానికి ఆసరాగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న మిత్రులను వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు

హైదరాబాద్

ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని చారిత్రత్మక ప్రదేశాలను అభవృద్ధి పరచాలి :మంత్రి తుమ్మల

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి స్టాఫ్ రిపోర్టర్) హైదరాబాద్‌ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి పరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, హార్టికల్చర్‌, హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్‌ ఎం.డి. శ్రీమతి వల్లూరి క్రాంతి, జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డిలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఏకో , టెంపుల్‌ టూరిజంలను అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరితహోటల్‌, కనిగిరిహిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రులు తెలిపారు. దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇందుకు టూరిజం డిపార్టుమెంట్‌, కార్పొరేషన్‌లు కృషి చేయాలని మంత్రులు తెలిపారు. అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రదేశంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, కొత్తగూడెంలో ఉన్న హరితహోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.