Tuesday, 12 May 2026

Blog

అన్నమయ్య

బొప్పాయి రైతుల గిట్టుబాటు ధర కోసం రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద, సిఐటియు, ఏపీ రైతు సంఘం ధర్నా !  సబ్ కలెక్టర్ వినతి పత్రం!!

అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం  బొప్పాయి రైతులు, గిట్టుబాటు ధర కోసం సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, అనంతరం సబ్ కలెక్టర్ వైకోమ్ దేవి మేడం గారికి వినతి పత్రం అందజేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో, దాదాపు 20 వేల ఎకరాల పైగా బొప్పాయి సాగు చేస్తున్నారని, రైతులు ఏడాది పాటు, దుక్కిలు, దున్ని ఎరువులు, వేసి మందులు,కూలీలు, ట్రాన్స్పోర్ట్, ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటగా రైల్వే కోడూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన,  సేటులు, మధ్య దళారులు, సిండికేట్ఐ, రోజురోజుకి ధరలు తగ్గిస్తున్నారు అన్నారు. మొదటిసారి రెండు వారాల క్రితం,  కిలో16 రూపాయలు, ధర పెట్టి, నేడు కిలో 13 రూపాయలు, తగ్గించారని, తిరిగి సోమవారం కూడా ధర తగ్గిస్తున్నారని తెలిపారు. విత్తనం కిలో, నాలుగు లక్షల పెట్టాలని, అందులో నాసిరకం, కల్తీ విత్తనాలు రైతులుకు సరఫరా చేస్తున్నారన్నారు. నర్సరీలో చెట్టు రెండు నెలల తర్వాత, 15 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలన్నారు.   1000 కేజీలకు, 100 కేజీలు, తరుగు సూట్ పేరుతో, రైతుల నుంచి తీసుకుంటున్నారని,  రైతులను దళారులు మోసం చేస్తున్నారన్నారు. లైసెన్స్ లేకుండా,  కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని,  బొప్పాయి పంటని మార్క్పేడు ద్వారా కొనుగోలు చేసి, కనీసం ధర 25 రూపాయలు నిర్ణయించి కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ గారు స్పందించి, మార్కెటింగ్ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు, ఇండస్ట్రియల్ అధికారులతో, సమావేశమై, రెండు రోజుల్లో విషయం చెబుతానని  హామీఇచ్చారు. నాయకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో బొప్పాయి రైతులు ,  కులమతాలకు, రాజకీయాలకు, అతీతంగా, ఐక్యంగా, ప్రభుత్వం పైన, మధ్య దళాలకు వ్యతిరేకంగా, పోరాటం చేసి, గిట్టుబాటు ధర, సాధించుకోవాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్  రైతు సంఘం (ఏఐకేఎస్), జిల్లా నాయకులు పందికాళ్ళ మణి, రైతు నాయకులు, మద్దిన కోటయ్య నాయుడు. డి, గిరిబాబు రాజు, ముద్దా పెంచల్ రెడ్డి, తుంగా శివకృష్ణ చౌదరి,  మన్నూరు. విశ్వనాథరెడ్డి,  ఈర్ల.ఈశ్వరయ్య, శివారెడ్డి, నాని,  రవిరాజు, వి రాజా, చింజి సుబ్రమణ్యం, కొండల సాయిబాబు,  వై.ఆదినారాయణ, అధిక సంఖ్యలో రైతుల పాల్గొన్నారు.

ఖమ్మం

జిల్లా కి ముగ్గురు మంత్రుల్లున్నా అభివృద్ధి శున్యం : బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం జిల్లా లో ఉప ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రులు ఉన్నా జిల్లా లో అభివృద్ధి మాత్రం శున్యం అని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. కాలువ కి గండి పడితే బాగుచేయడం చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత బి ఆర్ ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో అవినీతిమయం అయింది అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు . ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధిస్తారు అని రాబోయే ఎన్నికల్లో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కి పట్టం కట్టడానికి సిద్ధం గా ఉన్నారు అని నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు

ఖమ్మం

ఆర్య వైశ్య రాజకీయ రణభేరి ని జయప్రదం చెయ్యండి :ఆచంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి

పువ్వాడ నాగేంద్ర కుమార్(పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) ఆర్యవైశ్య రాజకీయ రణభేరి ని జయప్రదం చెయ్యాలి అని ఖమ్మం జిల్లాఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు సోమవారం నాడు ఖమ్మం నగరం లోని ఆర్యవైశ్య పెద్దలు భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ని కలిసి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శ్రీ ఆచంటి కోటేశ్వరరావు ఆగస్టు 3న హైదరాబాదులో జరగబోవు ఆర్యవైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు

E-పేపర్

జన్మభూమి ఋణం తీర్చుకుంటున్న డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి… కలుగట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన… నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరంకు విశేషస్పందన లభించింది.

నంద్యాల, జూలై 28, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి గత 40 ఏళ్లుగా సొంత గ్రామం కలుగట్ల గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలతో జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నారు. గత 40 ఏళ్లుగా కలుగట్ల గ్రామంలోని డిగ్రీ, పీజీ విద్యార్థుల తన విద్యాసంస్థలో ఉచిత విద్య అందిస్తున్నారు. తమ సొంత గ్రామమైన కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో ఉచితంగా కంటి, మధుమేహం, బిపి వంటి రోగాల నివారణ కోసం ప్రఖ్యాత డాక్టర్ లను తీసుకొని వచ్చి శిబిరం నిర్వహించారు. *ఈ మూడు రోగాలతో ఎంతో మంది బాధ పడుతున్నారని, ప్రభుత్వ, ప్రవైట్ ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేసుకోలేని వారికోసం ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. *మాటలలో చెప్పలేని సహాయం డాక్టర్ జి. రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సతీమణి విజయ కుమారి, కొడుకు, కోడలు హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డిలు చేస్తున్నారు. నడవలేని రోగులను వారే స్వయంగా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. డాక్టర్లకు వైద్య శిబిరంలో సహాయకులు అవధూత శ్రీకాశిరెడ్డి నాయన భక్త బృందం రోగులకు సేవలు అందించారు. గ్రామ పెద్దలు నాగార్జునరెడ్డి తదితరులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు, అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన భక్త బృందంకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నామన్నారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబుకు ఘన సన్మానం

*టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబుకు ఘన సన్మానం* మంథని/హైదరాబాద్, జులై 28, పున్నమి ప్రతినిధి: సికింద్రాబాద్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబును ఆదివారం బ్రాహ్మిణ్ వెల్ఫేర్ ట్రస్ట్, బ్రాహ్మిణ్ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మిణ్ సంఘ నాయకులు, ప్రముఖులు పాల్గొని దుద్దిళ్ళ శ్రీను బాబు సేవా పరమతను ప్రశంసించారు. ఆయన సామాజిక సేవ, ప్రజా సమస్యలపై పట్టుదల, రాజకీయాల్లో విశ్వసనీయతకు గుర్తింపుగా ఆత్మీయ సత్కారం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించబడినాయి. కార్యక్రమం ముగింపు సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

పెద్దపాడులో యోగా శిబిరం – సంపూర్ణ ఆరోగ్యానికి నూతన దారి

శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ హాపీనెస్ సెంటర్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి 17 వరకు ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుపూజ్యుడు డా. కె. అమ్మన్నాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యోగా, ధ్యానం, ప్రాణాయామం, సూక్ష్మవ్యాయామం, బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ట్రైనింగ్ మొదలైన పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ శిబిరంలో శ్రద్ధగా పాల్గొన్న సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మహిళలు, యువత ముఖ్యంగా 50 మందికిపైగా సాధకులు యోగా సాధనలో పాల్గొన్నారు. షీట్స్ వేసుకుని, శాంతమైన వాతావరణంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, శ్వాసాభ్యాసాలు చేసిన వారి ఆనందం చూస్తే మానసికంగా వారిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్న టీచర్ కింజరాపు అమ్మన్నాయుడు మాట్లాడుతూ, యోగా శిబిరం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు 7989752675 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు.

ఖమ్మం

బిజెపి పెనుబల్లి మండల సమావేశం

పెనుబల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు కన్వీనర్ రామలింగేశ్వర రావు పాల్గొన్నారు ఈ సమావేశంలో మండలంలో అన్ని ఎంపీటీసీ లకు పోటీ చేయాలని కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి రమేష్ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మండల అధ్యక్షులు బుర్ర నరసింహారావు వెంకటస్వామి సత్యనారాయణ రెడ్డి మహేష్ గారు గాయం నాగరాజు కిరణ్ గ తిరుపతమ్మ విజయలక్ష్మి కోట సుధాకర్ రమేష్ మహేష్ కృష్ణ రాంబాబు చంటి అనిత చావను బాబు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పర్యటన ని విజయవంతం చెయ్యండి : నెల్లూరి

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం పర్యటన ని విజయవంతం చెయ్యాలి అని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఈవి రమేష్, ధనియాకుల వెంకట్ నారాయణ, పమ్మి అనిత, విజయ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 36 39 డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు

ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – 36… 39 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన రాజమహేంద్రవరం : జులై 27పున్నమి ప్రతి నిది నగరంలోని ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు ఆ సమస్య నుంచి కొంతలో కొంతైనా ఉపసమనం కల్పించేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక 36.. 39 డివిజన్లకు సంబంధించి తుమ్మలోవ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న కల్వర్టులు, డ్రైనేజీల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరం మొత్తం అభివృద్ధి చెందుతోందన్నారు. నగర సుందరీకరణతో పాటు ప్రధాన రహదారులతో అనుసంధానమైన రోడ్లు కూడా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతోందన్నారు. పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మురగునీరు సక్రమంగా పారేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోందన్నారు. గత పాలకులు చేసిన అనాలోచిత పనులు కారణంగా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం జరుగుతోందని, ఆ అర్ధం లేని పనులను ఇప్పుడు తాము సరి చేయడం జరుగుతోందన్నారు. గత వైకాపా మాజీ ప్రజా ప్రతినిధులు చేసిన అనవసరమైన పనులు కారణంగా ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం తాము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు ఏం కావాలో… వారికి ఏం అవసరమో… వారి ఆలోచనలకు తగ్గట్టుగానే చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు యాళ్ల ప్రదీప్‌, తంగెళ్ళ బాబీ, కరగాని వేణు, తుల్లి పద్మ, స్థానిక పెద్దలు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

సహాయం కోసం విజ్ఞప్తి

సహాయం కోసం విజ్ఞప్తి: నమస్కారం, నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర గత పది సంవత్సరాలుగా B. కాగేశ్వరరావు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి) ఆధ్వర్యంలో అమరావతి కోచింగ్ సెంటర్ సంస్థను స్థాపించి, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. త్వరలోనే అగ్ని వీర్ మరియు అగ్నిపత్ ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో, వారి ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుంది. కానీ, B. కాగేశ్వరరావు గారు తన స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. కావున, వారు సహాయం కోరుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, మన సంస్థ తరఫున కోచింగ్ సెంటర్‌ను సందర్శించి, వారి ఆవశ్యకతలను పూర్తిగా అర్థం చేసుకున్నాం. మేము సహాయం చేయడానికి కోరుకుంటున్నాము. మీరు ఈ కార్యక్రమం కోసం సహాయం అందించగలరు, దయచేసి సిక్కోలు స్వచ్ఛంద సేవాసమితి ద్వారా అందించగలరని అభ్యర్థిస్తున్నాం. ఫోన్ నంబర్: P/G: 8985995001 ధన్యవాదాలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.