Tuesday, 12 May 2026

Blog

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం

*మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా కుడుదుల వెంకన్న, వైస్ చైర్మన్, డైరెక్టర్లు శనివారం హైదరాబాద్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో మంత్రి మాట్లాడుతూ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కలిసి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైతుల కష్టాలను తీర్చడానికి వారి వెన్నంటే ఉండాలని, వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల చైర్మన్స్, డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల..!!

*జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల…!!* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ ఎం ప్రథమ సంవత్సరం చదువుతూ, ఇటీవల ప్రకటించిన జ్యుడిషియరీ నియామక ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి ( జే సీ జే ) గా ఎన్నికయిన సహచర విద్యార్థిని ధరావత్ సుష్మ ను తమ బ్యాచ్మెట్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ (సతీష్ ) అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమతో పాటు పీజీ చేస్తున్న సుష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో జ్యుడిషియర్ విభాగంలో మరింత ఎత్తుకు ఎదుగాలని పలువురు ఆకాంక్షించారు. అదేవిధంగా పదవ తరగతి వరకు సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో చదివి, ఆ తర్వాత హైదరాబాద్ లోని పెండెకంటి న్యాయ కళాశాలలో ఎల్ ఎల్. బి పూర్తి చేసి, గ్రామీణ నేపథ్యం న్యాయ శాస్త్ర ప్రతిభకు అడ్డురాదనీ నిరూపించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయిన సుష్మ ను సహచర విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాస్త్ర పీజీ విద్యార్థి ఇనుముల సత్యనారాయణ తో పాటు సహచర పీజీ విద్యార్థులు నరేష్ రాథోడ్, ప్రభావతి, నవీన్ కుమార్, ఆనంద్, వేణుగోపాల్, సువర్ణ, శరత్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీజేపీ జిల్లా కోశాధికారి గా నానాజీ

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కోశాధికారిగా కాట్రేనికోన మండలం నడవపల్లి కి చెందిన గ్రంధి నానాజీ నియమితులయ్యారు. ఆయన గతంలో జిల్లా ఉపాధ్యక్షులు గా పార్టీ కి విశేష సేవలు అందించారు. నడవపల్లి పంచాయితీ వార్డు నంబర్ గా కూడా ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు యనమదల వెంకటరమణ ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్

కేటీఆర్ మీద సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు నిజమే : బండి సంజయ్

పున్నమి ప్రతినిధి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మీద పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.సి ఎం రమేష్ సవాల్ కి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.వారిద్దరి మధ్య బహిరంగ ఏర్పాటు చేస్తాఅన్నారు.కేటీఆర్ తో చర్చ కి సిఎం రమేష్ ని తీసుకోని వస్తాను అని బహిరంగ చర్చ కి తేదీ సమయం కేటీఆర్ చెప్పాలన్నారు.భారత రాష్ట్ర సమితి అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాము, ఆ పార్టీ ని బిజెపి లో కలుపుకునే ప్రసక్తే లేదు,ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభ లో ఇదే చెప్పారని బండి సంజయ్అన్నారు

ఖమ్మం

బోయపాటి శ్రీనివాస్ ని కలిసిన ఖమ్మం బాలయ్య

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) *మోతుగూడెం లో అఖండ2 చిత్రం షూటింగ్ షెడ్యూలు పూర్తి చేసుకొని మార్గమధ్యంలోనే ఖమ్మంలో ఆగి, అమ్మ మెస్ లో అభిమానులతో కలిసి లంచ్ చేసి కాసేపు నందమూరి అభిమానులతో మాట్లాడిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.. సెప్టెంబర్ 25 దసరా రోజు న అఖండ టు చిత్రం రిలీజ్ అవుతుంది అని, ఆరోజు అభిమానులకీ మరియు సినీ ప్రేక్షకుల అందరికి పండగ రోజు అని ఖమ్మం బాలయ్య బాబు అభిమానులతొ బోయపాటి చెప్పటం జరిగింది… బోయపాటిని కలిసిన నల్లమల రంజిత్,చంద్రశేఖర్,సాయి తేజ, కృష్ణ, కిరణ్,శ్రీధర్,నరేష్,సతీష్,మురళి,మహేష్,గోపి తదితరులు అభిమానులు ఉన్నారు…*

ఖమ్మం

తెలంగాణ ఎరువు ల కొరత కి కారణం కేంద్రం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మంత్రి తుమ్మల

ఖమ్మం పున్నమి ప్రతినిధి తెలంగాణ లో ఎరువు ల కొరత కి కారణం కేంద్రం నిర్లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ విమర్శించారు.వర్షాకాలం ప్రారంభం కాకముందు నుండే కేంద్ర ప్రభుత్వం ని సంప్రదించిన స్పందన కరువు అయినా తుమ్మల నాగేశ్వరావ్ అన్నారు.జూన్ నెలలో 45% కొరత ఉంది అని, దీని మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి లేఖలు రాసి నట్లు తెలిపారు.

చిత్తూరు

ఏనుగుల దాడులో మామిడి తోట ధ్వంసం

పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు రూరల్ మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపాన గల పంటపొలాలపై శనివారం రాత్రి ఏనుగులు వచ్చి గ్రామానికి ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా అక్కడున్న అరటి చెట్లను కూడా పూర్తిగా విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి ఆ సమయం రైతు తన పొలంలోనే నివాసముంటున్న ఇంటి పక్కనే వచ్చి పంటలను నష్టపరచడం ఆ ఏనుగుల శబ్దాలకు రైతు బయటకు వచ్చి ఏనుగును చూసి వాటి గాండ్రింపులకు భయబ్రాంతులకు గురై పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఆ ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచి ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చంద్రవేణెమ్మ వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి మామిడి తోటలో అమర్చిన సీసి కెమెరాను కూడా విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని ఉదయం పొలంలోకి వెళ్ళి గమనించిన ఆ రైతులు కోత దశలో ఉన్న మామిడి కాయలు ఆఖరి సమయంలో రేట్లు బాగున్నాయని ఇలాంటి సమయంలో ఏనుగులు వచ్చి మాకు నష్టం కలిగించాయని ఇదివరకే అనేక సార్లు వచ్చి మా తోటలతోపాటు గ్రామంలో చాలా మంది రైతుల పంటలను కూడా నష్టపరిచాయానిఈ విదంగా గ్రామంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ వచ్చి పంటలను నష్టపరుస్తూనే ఉన్నాయి రైతులు పూర్తిగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని అటవి ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అటవి శాఖ అధికారులు అదుపు చేయలేకపోతున్నారని వాళ్ళు పూర్తిగా విఫలమౌతున్నారని గ్రామం లోని రైతులు వాపోతున్నారు పంటపొలాలపై ఏనుగులు రాకుండా పంటలను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించి అటవి సమీపాన గల ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అటవి శాఖ అధికారులకు. ప్రభుత్వ పాలకులకు తెలియపరుస్తున్నా కానీ ఇంతవరకు వాటిని పట్టించుకునే నాథుడే లేరని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రాత్రి జరిగిన విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిపారు వారు వచ్చి నష్టమైన రైతుల పంటలను పరిశీలించి నష్టమైన పంటలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలిపారు

చిత్తూరు

పలమనేరు లయన్స్ క్లబ్ లో 70 మందికి కంటి పరీక్షలు.

పలమనేరు, జులై 27 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో 70 మంది కంటి రోగులు పరీక్షలు నిర్వహించుకున్నారు.వీరిలో ఎంపిక చేసిన 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనునట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె ఆర్ జయశంకర్, సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ తెలిపారు. ఈ శిబిరానికి దాతగా లయన్ పత్తి శ్రీనాథ్ వ్యవహరించారు.తదుపరి కంటి చికిత్స శిబిరాన్ని ఆగస్టు 24వ తేదీ ఆదివారం నిర్వహించినట్లు వారు తెలిపారు.ఇందులో వైద్యులు డాక్టర్ నారాయణ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, సీనియర్ సభ్యులు ఎం శ్రీరాములు శెట్టి చంద్రమౌళి, పుగలెంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పేదల ఆరోగ్యానికి అండగా సీఎం సహాయ నిధి రూ ₹6,45,000/-

చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 27 చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ, పెద్దురు గ్రామ వాస్తవ్వులు ఎదుటి భాస్కర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. ₹6,45,000/-విలువగల చెక్కులు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డిమాట్లాడుతూ.“పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అండగా నిలవడం అభినందనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం ఎంతో మందికి జీవనాధారం అవుతోంది. ప్రతి అర్హునికి ఈ సాయం అందేలా మా ప్రయత్నం కొనసాగుతుంది,”అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.“చిట్వేల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించిన ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం కొంతైనా తగ్గిస్తాయి. ముఖ్యమంత్రి గారి సంక్షేమ దృక్కోణం వల్లే ఇటువంటి కుటుంబాలకు వెంటనే సహాయం అందుతోంది. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు పాల్కొన్నారు.

ఖమ్మం

నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలి కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలని కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి అన్నారు శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి నగరపాలక సంస్థ లో వివిధ విభాగల అధికారులు తో సమీక్సించారూ. ఈ సం దర్భము గా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ పన్నులు చెల్లి స్తున్న నగర ప్రజకిమెరుగైన వసతులు కల్పించాల్సిన భాద్యత నగర పాలక సంస్థ మీద ఉంది అన్నారు. రోడ్లు, పారిశుధ్య వసతుల మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.