Tuesday, 12 May 2026

Blog

చిత్తూరు

పలమనేరు లయన్స్ క్లబ్ లో 70 మందికి కంటి పరీక్షలు.

పలమనేరు, జులై 27 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో 70 మంది కంటి రోగులు పరీక్షలు నిర్వహించుకున్నారు.వీరిలో ఎంపిక చేసిన 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనునట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె ఆర్ జయశంకర్, సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ తెలిపారు. ఈ శిబిరానికి దాతగా లయన్ పత్తి శ్రీనాథ్ వ్యవహరించారు.తదుపరి కంటి చికిత్స శిబిరాన్ని ఆగస్టు 24వ తేదీ ఆదివారం నిర్వహించినట్లు వారు తెలిపారు.ఇందులో వైద్యులు డాక్టర్ నారాయణ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, సీనియర్ సభ్యులు ఎం శ్రీరాములు శెట్టి చంద్రమౌళి, పుగలెంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పేదల ఆరోగ్యానికి అండగా సీఎం సహాయ నిధి రూ ₹6,45,000/-

చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 27 చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ, పెద్దురు గ్రామ వాస్తవ్వులు ఎదుటి భాస్కర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. ₹6,45,000/-విలువగల చెక్కులు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డిమాట్లాడుతూ.“పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అండగా నిలవడం అభినందనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం ఎంతో మందికి జీవనాధారం అవుతోంది. ప్రతి అర్హునికి ఈ సాయం అందేలా మా ప్రయత్నం కొనసాగుతుంది,”అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.“చిట్వేల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించిన ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం కొంతైనా తగ్గిస్తాయి. ముఖ్యమంత్రి గారి సంక్షేమ దృక్కోణం వల్లే ఇటువంటి కుటుంబాలకు వెంటనే సహాయం అందుతోంది. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు పాల్కొన్నారు.

ఖమ్మం

నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలి కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలని కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి అన్నారు శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి నగరపాలక సంస్థ లో వివిధ విభాగల అధికారులు తో సమీక్సించారూ. ఈ సం దర్భము గా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ పన్నులు చెల్లి స్తున్న నగర ప్రజకిమెరుగైన వసతులు కల్పించాల్సిన భాద్యత నగర పాలక సంస్థ మీద ఉంది అన్నారు. రోడ్లు, పారిశుధ్య వసతుల మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

తెలంగాణ మంచిర్యాల

పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి

*పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి* మంచిర్యాల, జులై 26, పున్నమి ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ ను బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయనీ, అలాగే దేశంలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ, బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేరో బీసీ సమాజానికి చెప్పాలని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా, బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం బాధాకరం అని అసహనం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే, ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకుడు కర్రె లచ్చన్న, జిల్లా కార్యదర్శి శాఖపురి భీం సేన్, నాయకులు అంకం సతీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ బిజెపి కమిటీ సమావేశం విజయవంతం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు *ధనియాకుల వెంకటనారాయణ* అధ్యక్షతన ఈనెల 29వ తారీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు *శ్రీ ఎన్ రామచంద్ర రావు* ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం విచ్చేస్తున్న సందర్భంగా, ఈ కార్యక్రమం గురించి సన్నాహక సమావేశం 53వ డివిజన్ గట్టయ్య సెంటర్ నేహా అపార్ట్మెంట్లో జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య పాల్గొని, ఖమ్మం టూ టౌన్ లో 15 డివిజన్లో కాను పది డివిజన్లకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, రాష్ట్ర అధ్యక్షుడికి టూ టౌన్ కమిటీ నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో జన సంద్రోహంతో ఆహ్వానం పలకాలని, తెలియజేశారు, ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి తోడూపు నూరి రవీందర్, 43వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి మాజీ మండల అధ్యక్షులు తాజానూత భద్రం, 44వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి 2 టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, 49వ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి ఈశ్వర ప్రగడ రామారావు, 51వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క రవి గౌడ్, 52వ డివిజన్ సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి దాసరి మధు, 53వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి, ఖమ్మం టూ టౌన్ ట్రెజరర్ దాసరి వీరభద్రం, 54వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జిలు సీనియర్ నాయకులు మరియు ఖమ్మం టూ టౌన్ కార్యదర్శి, జిల్లెల్ల నాగరాజు, పువ్వాడ నాగేందర్, 56వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జి సీనియర్ నాయకులు వల్లభనేని పుల్లయ్య, 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఇనుగుర్తి ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు,

కామారెడ్డి

రామారెడ్డి గంగమ్మ వాగు నిండు కుండల మరి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది

రామారెడ్డి మండలం : రామారెడ్డి గ్రామం లో గంగమ్మ వాగు నిండు కుండల మరి రామారెడ్డి చుట్టూ పక్కన గ్రామాల ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది గా మారింది అధికారుల నిర్లక్ష్యం వనాల ప్రజలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు రామారెడ్డి చుట్టూ పక్కన పరిసర ప్రాంతాలకు చెందిన వాహనదారులు ఇప్పుడు పోసానిపెట్ గ్రామం మీదుగా కామారెడ్డి వెళ్ళాలి కావున ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలనీ కోరుకుంటూన్నారు. ఇంతటి వర్షంలో కూడా పోలీస్ సిబ్బంది ప్రజలకు సహకరించి వంతెన వరకు ఎవ్వరిని వెళ్లకుండా గ్రామ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు

అన్నమయ్య

బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని 28న రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయండి విలేకరుల సమావేశంలో రైతు సంఘాల పిలుపు

చిట్వేల్ (పున్నమి ప్రతినిధి) జూలై 26 అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం అంబేద్కర్ విగ్రహ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సాయంత్రం బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పంది కాలమని మాట్లాడుతూ గత మూడు రోజులుగా చిట్టి వేల రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి గిట్టుబాటు ధర కనీసం 25 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొదట 16రూపాయలు నిర్ణయించి మూడు రోజుల్లో 13రూపాయలకు తగ్గించడంతో, రోజురోజుకి దళారులు సిండికేట్ ధర తగ్గించడంతో బొప్పాయి రైతులు ఆందోళనకు దిగారు అన్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వ్యాపారస్తులతోనూ మార్కెట్ అధికారులతోనూ రెవెన్యూ అధికారులతోనూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర 25 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి విత్తనాలు మొలక కొనుగోలు, ఎరువులు దుక్కెలు కూలీలు మందులు ట్రాన్స్పోర్ట్ ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే రైతుల ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళారులు సూటు వడ్డీ, పర్సంటేజీ నకిలీ విత్తనాలు రైతుల్ని మోసం చేస్తున్నారన్నారు.దీనికి నిరసనగా 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని. రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వై ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఓ పెంచలయ్య తుంగ శివకృష్ణ కొండల సాయి బాబు ఎం బాల సంతోష్ రెడ్డి మన్నూరు విశ్వనాథరెడ్డి తుంగ కోటేశ్వర చౌదరి పురం రమణయ్య సి సుబ్బరాయుడు రవిరాజు వై ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి.

కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలి..కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం. వెంకటాద్రి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. అన్ని ట్రయల్ కేసుల్లో సత్వర, సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్ట్ ద్వారా సంబంధిత కేసులలో సి.సి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతనంగా అమలులోకొచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్ కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్ధవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ జి. ఆదినారాయణ రెడ్డి, ఎస్ఐ రవికుమార్. కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ సన్నాహక సమావేశం.

తెలంగాణ రాష్ట్ర నూతన బిజెపి అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ఈ నెల 29వ తేదీ ఖమ్మం పర్యటన నేపథ్యంలో లో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షత న జరిగిన సన్నాహాక సమావేశం లో ముఖ్య అతిధి గా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య విచ్చేసి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు పర్యటన ని సప్త పది ఫంక్సన్ హల్ నందు జరిగే బూత్ అధ్యక్షులు సమావేశం ని జయప్రదం చేయాలి అని అంజయ్య విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశం లో టి. భద్రం. రవి గౌడ్, వల్లభనేని పుల్లయ్య, దాసరి వీరభద్రం ఉపేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, టి. రవీందర్, దాసరి మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం మెడికల్ కళాశాలలో అనాటమీ విభాగంలో బంగారు పతకం సాధించిన మోగంటి వెంకట సాత్విక్ శర్మ

మచిలీపట్నం, జూలై 26:ఎస్.పి.వి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మచిలీపట్నం లో అనాటమీ (Anatomy) విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోగంటి వెంకట సాత్విక్ శర్మ గారు బంగారు పతకం (Gold Medal) సాధించారు. విద్యార్ధి ఈ విజయాన్ని తన కృషితో సాధించగా, ఈ గౌరవం కలకాలం గుర్తుండిపోయేలా చేసింది.వెంకట సాత్విక్ శర్మ తల్లిదండ్రులు శ్రీ మోగంటి వెంకట కామేశ్వర రావు గారు మరియు శ్రీమతి శైలజ గారు తన కుమారుని విజయాన్ని చూసి ఆనందానికి అవధులు లేకుండా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థికి ఆశీర్వాదాలు తెలిపిన తన పెద్దనాన్న పెద్దమ్మ ఎంవి జనార్దనరావు, లక్ష్మీ అతని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.ఇది కళాశాలకి గర్వకారణంగా మారింది. అంతే కాదు, ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.