Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సహాయం కోసం విజ్ఞప్తి

సహాయం కోసం విజ్ఞప్తి: నమస్కారం, నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర గత పది సంవత్సరాలుగా B. కాగేశ్వరరావు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి) ఆధ్వర్యంలో అమరావతి కోచింగ్ సెంటర్ సంస్థను స్థాపించి, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. త్వరలోనే అగ్ని వీర్ మరియు అగ్నిపత్ ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో, వారి ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుంది. కానీ, B. కాగేశ్వరరావు గారు తన స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. కావున, వారు సహాయం కోరుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, మన సంస్థ తరఫున కోచింగ్ సెంటర్‌ను సందర్శించి, వారి ఆవశ్యకతలను పూర్తిగా అర్థం చేసుకున్నాం. మేము సహాయం చేయడానికి కోరుకుంటున్నాము. మీరు ఈ కార్యక్రమం కోసం సహాయం అందించగలరు, దయచేసి సిక్కోలు స్వచ్ఛంద సేవాసమితి ద్వారా అందించగలరని అభ్యర్థిస్తున్నాం. ఫోన్ నంబర్: P/G: 8985995001 ధన్యవాదాలు.

అన్నమయ్య

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రామానాయుడు

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రామానాయుడు రైల్వే కోడూర్ జులై 27 ( పున్నమి న్యూస్) మంగంపేటలోని పలు నివాసాలను సందర్శించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, గతంలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. అనంతరం కోడూరు 20 ఏళ్ల వెనకబాటును తీర్చే ఒక్క అడుగు.. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాజెక్టు కోసం మంత్రి రామానాయుడు కి విజ్ఞప్తి. రైల్వే కోడూరు అభివృద్ధి పథంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో,రైతన్నల కష్టాలను తీరుస్తూ… పంట భూములకు సోమశిల బ్యాక్ వాటర్స్ అందేలా చర్యలు తీసుకోవాలని ముక్కా రూపానంద రెడ్డి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కి విజ్ఞప్తి చేశారు. ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “ప్రజల ప్రేమ, ఆదరణే మాకు బలము. ఈ రోజు మీరు ఇచ్చిన గౌరవం మా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల మధ్యకి వచ్చి, ప్రతి ఇంటిలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే మా లక్ష్యం అని అన్నారు. మంత్రివర్యులు రామానాయుడు మాట్లాడుతూ. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ప్రజలు కూటమి పై చూపుతున్న నమ్మకానికి నిదర్శనం. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే మా బాధ్యత. అని పేర్కొన్నారు.

అన్నమయ్య

ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి మంత్రి నిమ్మల రామానాయుడు ని కోరిన బత్యాల

గుంజన ఏరును పరిశీలించిన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు రైల్వే కోడూర్ జులై 27 ( పున్నమి న్యూస్ ) *గుంజన ఏరుకు ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తున్న స్థానిక ప్రజలు* *రైల్వేకోడూరులో శాంతినగర్ నరసరాంపేట కు మధ్యలో ఉన్న గుంజన ఏరును 27-07-2025వ తేదీ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు విచ్చేసి గుంజన ఏరుకు ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అక్కడకి విచ్చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు తో ప్రతి సంవత్సరం వచ్చే వరదల కారణంగా ఏటిలో వరద ఉధృతి పెరిగి భూమి కోతకు గురై ఏటిని ఆనుకొని ఉన్న భవనాలు కూలిపోవడం జరుగుతుందని. వర్షాకాలంలో ఏరు వచ్చిన ప్రతిసారి రాత్రి సమయాల్లో నిద్ర కూడా పట్టడం లేదని భయాందోళకంగా ఉంటుందని ప్రతి సంవత్సరం వర్షాలకి ఎంతో కొంత ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూ ఉందని గతంలో ఇల్లు దెబ్బతిన్న వారికి కొంతమేర ఆర్థిక సహాయం మరియు విత్యావసర వస్తువులను, కట్టుకోవడానికి బట్టలు అందజేసి మాకు అండగా నిలబడ్డారని తెలిపారు. అలాగే పలుమార్లు మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా ప్రొటెక్షన్ వాల్ నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలని చాలా సంవత్సరాల నుండి బత్యాల చంగల్ రాయుడు ప్రయత్నిస్తున్నారని. కనీసం ఇప్పటికైనా ప్రొటెక్షన్ వాల్ కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని నిమ్మల రామానాయుడు ని కోరారు. అనంతరం టిడిపి మాజీ ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు టిడిపి కార్యాలయానికి విచ్చేయగా అక్కడ రైల్వేకోడూరు ప్రస్తుత రాజకీయ పరిణామాలు పై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ ఇంకా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీశ్రీశ్రీ రెడ్డెమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన కస్తూరి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలోని చిన్నరాచపల్లి గ్రామం నందు 27వ తేదీన ఆదివారం నాడు రెడ్డిపల్లెమ్మ తల్లి జాతర శుభ సందర్భంగా స్థానిక గ్రామ వాస్తవ్యులు గోపాల్ నాయుడు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎస్.సి చైర్మన్ జవహర్ కు సత్కారం

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన ఆత్మీయ సత్కార సభలో ప్పాల్గొన్న జవాహర్,ఆయన ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం వేదికపై ప్రసంగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు శ్రీ కె.ఎస్ జవహర్ . ఈ కార్యక్రమంలో గుంటూరు నియోజకవర్గ ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహ్మద్ , మాజీ మంత్రి వర్యులు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, లిడ్ కేప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు , రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ , గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీల, మాజీ క్రీస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల జోషఫ్ ఇమ్మానుయేల్ మరియు ఇతర ముఖ్య నాయకులు, దళిత ప్రజా సంఘాలు, దళిత ఉద్యోగ సంఘాల జే. ఏ. సి.వారు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం. .. రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి ఆదేశాలతో కార్యక్రమంయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలో 13వ వార్డు లో సేవాదళ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ విజయాలు ప్రగతి పతం సకల జన హితం మన ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం 18 నెలల్లో రాష్ట్రంలో చేపట్టిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియమాకాలు చేపట్టింది వివిధ శాఖల్లో 60 వేలుప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు గృహజ్యోతి ఉచిత విద్యుత్ 50 నుంచి 200 వరకు . 500 కు గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు నిర్మించి పథకం ఐదు లక్షల వరకు రాజు యువ వికాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు యువకులకు నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బారత పథకం సన్నధాన్యానికి 500 బోనస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులకు ఉచిత విద్యుత్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెట్టుబడి వెలువ ఎస్సీ వారికి వర్గీకరణ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఒకే క్యాంప్ ఆఫీస్ లో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పోలీస్ కుటుంబాల పిల్లలకు నాయనమైన విద్య అందించే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ గురుకులాలు డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంపు ఫ్యూచర్ సిటీ రీజినల్ రింగ్ రోడ్ ఉస్మానియా యూనివర్సిటీ మెట్రో మూసి పునర్జీవ గాంధీ సరోవరం హైదరాబాద్ మురికినీటి మూసి నది ఉన్నది ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతుంది అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవరం తీర్చిదిద్దుతుంది నిరుపేదలకు సన్నబియ్యం దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పట్టిష్ట కోసం కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు 13వ వార్డు ఇంచార్జ్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తానని అన్నారు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర మాట్లాడుతూ ఆ రోజుల్లో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ సేవాదళ్ బోర్డ్ ఏర్పాటు చేసినారు శిక్షణ కార్యక్రమాలు వాలంటరీ తయారు చేసి గ్రామ గ్రామాన బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధివిధానాలు చేసినారు కత్తి సాము కర్ర సామ్ మరెన్నో విద్యలు నేర్పించినారు స్వతంత్ర పోరాటంలో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు అలాగే కాంగ్రెస్ సేవాదళ్ పండిట్ జవహర్లాల్ నెహ్రు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ వీళ్లం చేసినారు ఎంతో త్యాగదనుల పోరాటం రాబోయే రోజుల్లో మన మాజీఎఐ సిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని చేయడం లక్ష్యంగా పని చేస్తామని అన్న రూ రాబోయే రోజుల్లో యాదాద్రి జిల్లాలో అన్ని మండలాల్లో కమిటీలు వేసి బూతు స్థాయి గ్రామస్థాయి మండల టౌన్ సాయి నియామకంజరిపి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోనగిరి జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు సోమ రవీందర్ రెడ్డి బోనగిరి పట్టణ సేవాదళ్ అధ్యక్షులు డా కూర్ ప్రకాష్ మాట్లాడుతూ ఒకటి నుంచి 35 వాట్స్. ప్రతిలాస్ట్ చివరి ఆదివారంరోజు జండా ఆవిష్కరణ ఉంటుంది జెండా నియమ నిబంధనలు బూతు స్థాయి కమిటీలు వేయడం జరుగుతుంది యువజన నాయకులు వస్తువుల సాయి బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బత్తిని జితేందర్ వేషాల రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు..

తూర్పు గోదావరి

MPJ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర లో నిర్వహించి న సభ

రాజమండ్రి జూలై 27 పున్నమి ప్రతినిధి. కాకినాడ రాగంపేట దగ్గర ఉన్న అల్పాల ఎడ్యుకేషనల్ సొసైటీ లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారు నిర్వహించిన సభకు ఉత్తరాంధ్రకు చెందిన వారు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న జర్నలిస్టులు జమాత్ ఇస్లామిక్ హింద్ అందరు పాల్గొన్నారు అన్నిటి గురించి ఇంకా ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఎం పి ఏ మందు ఉంది పోరాడుతాదని అక్కడకు వచ్చిన సమస్త ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు ఈ కార్యక్రమానికి మంగళాధిగా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇంకా అక్కడ సీనియర్ జర్నలిస్టులకు మెమొంటో సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమానికి పిచ్చుక శ్రీనివాసరావు (,ఏపీ సి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు ), నటుకుల శ్రీనివాసరావు ( డైరెక్టర్ లీగల్ అవేర్నెస్ ఆఫ్ ఇండియా ), జనాబ్ షేక్ ముస్తఫా( రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే), జనాబ్షే షే క్ సలీం, చిక్కిన సమర్పణ కుమార్, షేక్ ఖాదర్ షేక్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం, మరియు కార్యకర్తలు ఇంకా కొత్త సభ్యత్వాలు చేసిన నాయకులు అందరూ పాల్గొన్నారు

నంద్యాల

పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా… మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

నంద్యాల, జులై27,పున్నమి ప్రతినిధి: పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి రూ. 1,04,508 లక్షల చెక్కును నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కు చెందిన తక్షిత అనే బాలిక కు వైద్యం కోసం చిన్నారి తండ్రి అమలదిన్నె ప్రవీణ్ కు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపం మేరకు ఆమె సిఫారసు చేసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకునేందుకు పేద రోగులకు భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు.

చిత్తూరు

ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఏపీఎన్జీజీవో సంఘం నాయకులు

పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి వీడి, చొరవగా పరిష్కార చర్యలు తీసుకోవాలని పలమనేరు ఏపీఎన్జీజీవో సంఘం అధ్యక్షుడు ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు ఎన్జీవో హోం నందు జిల్లా అధ్యక్షుడు రాఘవులు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలమనేరు ఎన్జీఓ సంఘం తరపున ఈ అంశాలు ప్రస్తావించారు. కొత్త పీఆర్సీ కమీషన్ ఏర్పాటు,పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల విడుదల,సరెండర్ లీవుల చెల్లింపు, బకాయిల చెల్లింపులు,మధ్యంతర భృతి ప్రకటించడం,ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య శాఖలో చేపట్టిన బదిలీలలో అవినీతి, అక్రమాలు,సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఎన్జీఓ సంచారం మాస పత్రిక చందా దారుల పెంపు తదితర అంశాలపై చర్చించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెంచలరావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం జిల్లా లోని అన్ని తాలూకా ల నాయకులతో పాటు పలమనేరు నియోజకవర్గం తరఫున జిల్లా ఎన్జీజీఓ సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీపతియాదవ్, కార్యదర్శి ఎం జయమ్మ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

మనకి బాత్ కార్యక్రమం..

ఈరోజు మన్ కీ బాత్ 124వ ఎపిసోడ్ ను భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండో పట్టణం పరిధిలోని 133 పోలింగ్ బూత్ 50 డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ బిజెపి అభ్యర్థి మహేందర్ సింగ్ నివాసంలో వీక్షించడం జరిగింది,, ఈ కార్యక్రమంలో రెండో పట్టణం ప్రధాన కార్యదర్శులు రుద్రగాని మాధవ్ గౌడ్ 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్,, కన్నేకంటి కృష్ణ చారి 58వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జి ,, రెండో పట్టణం ఉపాధ్యక్షులు భూక్య వెంకట్ 50 వ డివిజన్ నాయకులు,, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జ్యోతుల యుగంధర్ 10వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్, 51 వ డివిజన్ బిజెపి కాంటెస్ట్ అభ్యర్థి, జిల్లా నాయకులు నక్క రవి గౌడ్,, జిల్లా నాయకులు 55వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ గౌడ్ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోయల వెంకట ,, 58వ డివిజన్ భాజపా నాయకులు అంబటి క్రాంతి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ని వీక్షించడం జరిగింది ,,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.