Tuesday, 12 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

*మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య పై చర్యలు తీసుకువలి*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య పై చర్యలు తీసుకువలి పోతాల భారతమ్మ ఈ రోజు జిల్లా కలక్టర్ గారికి పోతాల భారతమ్మ రాజ్ గ్రాం పెంచికల్ పహాడ్ మం| భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి ప్రాతానికి చెందిన నివాసురాలిని. నేను మహిళారైతును నాపేరు మీద పట్టా భూమి కలదు సర్వే నెం 206 లో 1-37 గుంటల భూమి కలదు 2018 సం| వరకు నాపేరు పహనిలో రావడం జరిగినది ఆ తదనతరము జూన్ 2018 నుండి కే.ల్. నర్సింహ్మరెడ్డి తండ్రి పంట రెడ్డి కి మారడము జరిగినది మళ్ళి 03-03-2020 నుండి మడుగు పుర్ణ జనార్దన్ రెడ్డి పేరు రావడము జరుగుచునాది ఇట్టి భూమి ప్లాట్లు చేయడము జరిగినది ఇట్టి భూమి ని మేము ఇతరులకు అమ్మడము చేయకుండన్నీ అగ్రిమెంట్ చేయ కుండనీ ఏలాటి విక్రయాలు చేయకుండనీ నా యొక్క భూమిని కే.ల్. నర్సింహరెడ్డి కబ్జా పెట్టుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయిం చుకోవడము జరిగినది ఇతనికి సహకరించిన మాజీ జే.డ్.పి.సి బిర్లా మల్లయ్య కలిసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి నారు కావున ఇట్టి భూమి పై విచారణ చేసి నా యొక్క భూమిని నాకు ఇప్పించి నాకు న్యాయ చెయ్యాలి అని డిమాండ్ చేసారు…

యాదాద్రి భువనగిరి

ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి భూషి మహేష్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని గౌరవనీయులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడం జరిగింది. కబ్రిస్తాన్ వైకుంఠధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూముల కు హక్కును కల్పించి పట్టాలను ఇవ్వాలని, డప్పు చెప్పు వృత్తిదారులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు వరకు పెంచాలని, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ లోన్లు తీసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి ప్రతి దళిత వాడను అభివృద్ధి చేయాలని కోరనైనది. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లను విద్య హక్కు చట్టం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగళ్ల రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం మహేందర్, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొట్ల అనిల్, కలకుంట్ల రమేష్, బైరపాక సురేష్, మోత్కుపల్లి రవి, ముడుగుల రాములు, బోగారం మురళి, పెరుమళ్ళ కిషన్, బొట్ల మహేష్, బొట్ల పరశురాం, తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్‌ల ప్రారంభోత్సవం

ఓబులవారిపల్లి పున్నమి ప్రతినిధి జూలై 28 విద్యా మౌలిక సదుపాయాలకు మరింత బలం – ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్ ఓపెనింగ్‌కు హాజరైన ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ ఓబులవారిపల్లె పాలిటెక్నిక్ కాలేజ్ బీసీ విద్యార్థుల హాస్టల్ అవసరాన్ని గుర్తించిన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్టల్ నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని హామీ ఇచ్చారు కాలేజ్ కంప్యూటర్స్ ల్యాబ్ & కెమిస్ట్రీ ల్యాబ్ కల్పించిన ఆల్ఫా మేనేజంగ్ డైరెక్టర్ D సుధాకర్ యాదవ్ ధన్యవాదములు తెలిపిన ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఓబులవారిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు ఎన్డీఏ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , అలాగే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు.విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది కీలకమైన ముందడుగని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు అరవ శ్రీధర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతలు ల్యాబ్‌లు పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సందేశాన్ని అందించారు.పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య విద్యను ప్రోత్సహించేందుకు ఈ తరహా అభివృద్ధి పనులు మరింతగా జరుగుతాయని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు.

అన్నమయ్య

రూ.1.70 కోట్లతో చిన్న ఓరుంపాడు నుంచి గాదెల కొత్తపల్లి సబ్స్టేషన్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం పనులను పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 28 డబుల్ రోడ్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. చిన్న ఓరుంపాడు నుండి గాదెల కొత్తపల్లి సబ్‌స్టేషన్ వరకు రూ.1 కోటి70 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించబోయే రోడ్ పనులకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా, అంతరాజంపేట నుండి తూర్పుపల్లి సివిల్ రోడ్‌కి కనెక్ట్ చేసే మార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు.ఈ అభివృద్ధి పనుల పరిశీలనకు చిన్న ఓరుంపాడు గ్రామానికి విచ్చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనుల ప్రగతిని సమీక్షించారు.అంతరం తారు రోడ్ నాణ్యత ను పరిశీంచడం జరిగింది, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదారి కనెక్టివిటీ పెరగడం ద్వారా అభివృద్ధికి దారితీసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు తెలిపారు.

అన్నమయ్య

రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై పోలీసుల అవగాహన, వాహనాలు తనిఖీలు

ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై పోలీసులు వాహనచోదకులకు అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీ చేపట్టి హెల్మెట్ ధరింపు ఆవశ్యకత పై చైతన్యం చేయడంతో పాటు రోడ్డు భద్రత నిబంధనల అమలుపై దృష్టి సారించారు. ఓవర్ లోడింగ్, త్రిబుల్ రైడింగ్,డ్రంకన్ డ్రైవ్,సెల్ఫోన్ డ్రైవింగ్,తదితర ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరూ సహకరించాలని, రోడ్డు సేఫ్టీ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేస్తూ వాహనాలను తనిఖీ చేపట్టారు

తూర్పు గోదావరి

కూటమి పాలనలోనే పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం

కూటమి పాలనలోనే పేపరుమిల్లు కార్మికులకు న్యాయం – రూ.5,800 పెంచారు – త్వరలో మంచి అగ్రిమెంటు, ఎన్నికలు జరుగుతాయి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషి ఫలిస్తుంది – వైసీపీ పాలనలోనే ఆ‌ నాయకులు ఏమీ చేయలేకపోయారు – వైసీపీ వర్గపోరుతో కార్మికులకు నష్టం జరిగిందని అందరికీ తెలుసు – ఇప్పుడొచ్చి గొప్పలు చెప్పుకోవద్దు – మిల్లు కార్మికులకు జీతాలు ఎక్కువని నాడు జగన్ అనడం మరిచారా? – సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని కార్మికులను జగన్ భయపెట్టారుకదా – మండిపడిన మిల్లు కార్మిక సంఘాల నాయకులు రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో నష్టపోయిన పేపరుమిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేసిందని మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మిల్లు కార్మికు సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మిల్లు కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని,వారి వర్గపోరుతో కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మిల్లు కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేశారని ఆయన అన్నారు. త్వరలో మిల్లు గుర్తింపు యూనియన్ ఎన్నికలు,మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరిగిందని, ఎన్నికలు కూడా జరిగాయని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పేపరుమిల్లు కార్మికులకు నష్టం కలిగించాయని, దీక్షలు పేరిట ఒక వర్గం నాయకులు కూర్చోవడం లేచిపోవడం వెంటవెంటనే జరిగేవని, కార్మికులకు అప్పుడు, ఇప్పుడు కూటమి వైసీపీ నాయకులవల్ల ఎలాంటి మేలు జరగలేదని మొకమాటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు సూట్ కేస్ నాయకులని, కూటమి ప్రజాప్రతినిధులు అలా ఎప్పుడూ సూట్ కేసులకు ఆశపడరని ఆయన అన్నారు. మిల్లు సీఎస్సార్ నిధులు నగరంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సంగతి ప్రజలకు, మిల్లు కార్మికులకు తెలుసని ఆయన అన్నారు. కార్మిక నాయకుడు దుత్తరపు గంగాధర్ మాట్లాడుతూ ఐదేళ్ళ వైసీపీ పాలనలో కార్మికులకు ఎలాంటి అగ్రిమెంట్ చేయలేక పోయొరని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు రూ.5,800 జీతం పెంచిందని ఇదంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి,మంత్రి కందుల దుర్గేష్ చొరవతో జరిగిందని అన్నారు. తాము ధర్నాలు, దీక్ష చేయడంవల్లే జరిగిందని వైసీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమని, అలాగైతే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వర్గపోరులో నష్టపోయిన కార్మికులకు నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్, తదితరులు తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగినట్లుగానే కార్మికులకు వేతనాలు పెంపు జరిగిందని, వైసీపీ నాయకుల వల్ల కాదని ఆయన అన్నారు. ఎస్.కె.ఎస్.కార్మిక సంఘం నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ వల్ల కార్మికులకు రూ.5,800 జీతం పెరిగిందని, త్వరలో మంచి అగ్రిమెంట్ జరుగుతుందని అన్నారు.వైసీపీ నాయకులు చేసిందేమి లేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్ లో తాము సమ్మె చేస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ కార్మిక నాయకులను తన బస్సులోకి పిలిచి మిల్లు కార్మికులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ అని, సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని అనడం వైసీపీ నాయకులకు గుర్తు లేదా అని ప్రశ్నించారు.వైసీపీ నాయకుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ జీతాలు పెరిగాయని, ఆయన తెలిపారు.వైసీపీ నాయకుల ధర్నాల వల్ల జరిగిందని చెప్పుకోవడ తగదని‌ ప్రకాష్ హితవు పలికారు.కార్మికులకు మూడు సంవత్సరాల ఆరు నెలలకు ఒకసారి అగ్రిమెంట్ జరగాలని, 2019 లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో అగ్రిమెంట్ చేశారని తర్వాత వచ్చిన వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్మికులను గాలికి వదిలేశారని, పరంపర కార్మికులకు కూడా న్యాయం చేయలేక పోయారని ఆయన విమర్శించారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరంపర కార్మికులకు కూడా న్యాయం చేశారని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మిల్లు టిఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఎం బోసు, కార్యదర్శి కె రమణ రావు, కార్మికులు కళ్యాణ్, సురేష్, ఎన్ విజయ్, అశోక్, ఏం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని కస్తూరి వారి పల్లి గ్రామ వాస్తవ్యులు ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ కేకే చౌదరి సోదరుడు కస్తూరి చంద్ర నూతన గృహప్రవేశం చేయి సందర్భంగా 27వతేదీన ఆదివారం నాడు వారి స్వగృహం నందు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన మన ప్రియతమ నాయకులు కేక చౌదరి, కస్తూరి విశ్వనాధ నాయుడు, నరసింహ ప్రసాద్ లారీ సుబ్బరాయుడు,విశ్వేశ్వర నాయుడు, లోకేష్,నవీన్ పార్టీ నాయకులు మరియు బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.

నంద్యాల

శ్రీశైల పుణ్య క్షేత్రంకు రండి సార్ అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల జూలై 28 పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: శ్రీశైల పుణ్య క్షేత్రంకు రండి సార్ అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భూకైలాసంగా విరాజిల్లుతూ అష్టా దశశక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దర్శనం కోసం శ్రీశైలం రావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు. సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తన భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ మర్యాద పూర్వకంగా కలిచామని, పవిత్రమైన, ఎంతో విశిష్టమైన శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించమని హృదయ పూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ ఆహ్వానించడం జరిగిందని, ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

లయన్స్ నిర్విరామ, నిస్వార్ధ సేవలకు సలాం – రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె.పూర్ణ చంద్రరావు- ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తాం – లయన్ డాక్టర్ పైడి సింధూర(శ్రీకాకుళం నగరం – )

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా జరిగింది. పూర్వపు గవర్నర్ డిఎస్ఎస్వి.వర్మ, ప్రస్తుత గవర్నర్ కె.వి. సుబ్బరాజు, నున్న శ్రీనివాస రావు నేతృత్వంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలిగా ప్రముఖ వైద్యురాలు లయన్ పైడి సింధూర బాధ్యతలు అందుకోగా, కొత్త కార్యవర్గంలో టెక్కం రామ్ గోపాల్ (సెక్రటరీ), బరాటం కృష్ణ చైతన్య (ట్రెజరర్), ఇతర ఎంసీ సభ్యులు, నూతన సభ్యులు ప్రమాణస్వీకరణ చేశారు. ముఖ్య అతిథిగా..రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె.పూర్ణ చంద్రరావు పాల్గొని మాట్లాడుతూ లయన్స్ నిర్విరామ, నిస్వార్ధ సేవలకు సలాం అని, సింధూర అధ్యక్షతన విలువలుగల సేవలు కొనసాగించి స్ఫూర్తిప్రదాతగా నిలవాలన్నారు. పూర్వపు గవర్నర్ డిఎస్ఎస్వి.వర్మ, ఉప గవర్నర్ నున్న శ్రీనివాస రావు లు మాట్లాడుతూ సింధూర బృందం సేవా కార్యక్రమాలతో ముందుకుసాగాలన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ లో కీలకంగా వ్యవహరించే..లయన్స్ ఇంటర్నేషనల్ ను ముందుకు నడిపించే … నటుకుల మోహన్, పొన్నాడ రవి కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతల నిర్వహణలో భాగంగా అంతా కలిసి పనిచేస్తూ ముందుకువెళ్తామన్నారు. అనంతరం అధ్యక్షురాలు పైడి. సింధూర మాట్లాడుతూ సమాజానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో మార్పు తెస్తానని, ముఖ్యంగా యువతను చైతన్యపరుస్తామన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తామని, కాన్సర్ రహిత జిల్లాగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఇతర సేవాసంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వక్తలు హాజరు అయ్యారు.

ఖమ్మం

రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన ని జయప్రదం చెయ్యండి

భారతీయ జనతాపార్టీ *రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపురాజు రామచందర్ రావు * నూతన అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లా కి విచ్చేయిచున్న సందర్భంగా ఖమ్మం జిల్లా తరుపున వారికి ఘన స్వాగతం పలకడం కోసం మరియు వారి పర్యటన ను విజయవంతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. *ప్రోగ్రాం షెడ్యూలు* *29.07.2025 మంగళవారం* *9:00 am – మామిళ్లగూడెం టోల్ ప్లాజా వద్ద స్వాగతం* *10:30am – కాలఒడ్డు దగ్గరి నుండి బైక్ ర్యాలీ* *11:30am – అంబేద్కర్ విగ్రహంకు పూల మాల ,ZP సెంటర్* *12:00 pm – సప్త పది ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తలు, నాయకులు,పార్టీ అభిమానులతో సమావేశం.* *2:00pm మేధావుల సదస్సు ,సూర్య తేజ ఫంక్షన్ హాల్,కోర్ట్ పక్కన,ఖమ్మం. పైకార్యక్రమములో బీజేపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కోరడమైనది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.