Tuesday, 12 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూఎస్బీసీ నాయకులు *ముక్కెర్ల యాదయ్య, జి లక్ష్మీనరసింహారెడ్డి, మెతుకు సైదులు, మైలారం సత్తయ్య* మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి, పీఆర్సీని ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సీ పీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ భాస్కర్, జీ వి రమణారావు, జె కరుణాకర్, జనార్ధన్, బాలయ్య, విజయ, టి. వెంకన్న కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు. *USPC యాదాద్రి జిల్లా కమిటీ*

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

యాదాద్రి భువనగిరి

దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్ కటా రాజులు గారు పాల్గున్నారు, ఈ సందర్బంగా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు మరియు స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప గారు మాట్లాడుతు ప్రజా స్వామ్యం లొ ఓటు చాల విలేవైనది అని తెలిపారు, విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ సౌజన్య గారు మట్లాడుతు ఎన్నికలు గెల్పుందిన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కి కృషి చెయ్యాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గున్నారు

యాదాద్రి భువనగిరి

శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు భువనగిరి పట్టణంలో శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది*, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు రాజు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అతి పురాతన పెద్ద దేవాలయం శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి వారీ ఆలయంలో ఈరోజు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈరోజు పుట్టలో పాలు పోసి వారు కోరిన కోరికలు స్వామివారి అనుగ్రహంతో నెరవేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ, కప్పగంతుల ప్రవీణ్ శర్మ పుట్టపాక భీష్మ శర్మ దర్గా ఈ దేవేందర్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

హనుమకొండ

వ్యవసాయ సొసైటీ ఎరువుల సరఫరా పై తనికి చేసినా హన్మకొండ కలెక్టర్…

ఈరోజు PACS మాదారం ఎరువుల గోదామును తనిఖీ చేసిన హన్మకొండ కలెక్టర్ గౌరవ శ్రీమతి *శ్రీ స్నేహ శబరిష్,* గారు. రికార్డులను పరిశీలించినారు అక్కడ ఉన్న రైతులను యూరియా సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాదారం సొసైటీ చైర్మన్ *నల్లెల్ల లింగమూర్తి* గారు మాదారం సొసైటీ పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నందున మాదారం సొసైటీకి అదనంగా 300 టన్నుల యూరియాను కేటాయించాలని గౌరవ కలెక్టర్ గారిని కోరినారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు నోడల్ ఆఫీసర్ జ్యోతి గారు CEO రాజేందర్ AEO శైలజ గారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంథని మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్తు భారత్, ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. ఓ పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏఈపిఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి పాలక వర్గం ప్రమాణ స్వీకారం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) *శ్రీ పార్వతి భీమేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లోని శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్య అతిధి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుమ్మరు దయాకర్ రెడ్డి హాజరై ప్రమాణ స్వీకరం చేయించారూ. కమిటీ చైర్మన్ గా :ఐతనబోయిన శ్రీనివాస్ డైరెక్టర్ లు గా వల్లాపు నాగయ్య మామిడి సురేంద్ర శ్యాములేటి శ్రీను జనగమ వెంకటేశ్వర్లు కేసేబోయిన రామ కృష్ణ లు ప్రమాణస్వీకారం చేశారు

నిర్మల్

లక్ష్మణచాందా మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిని

పున్నమి ప్రతినిధి నిర్మల్ లక్ష్మణచందా మండలానికి చెందిన 18 గ్రామ పంచాయతీల 613 మంది లబ్ధిదారులకు మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి అవసరం ఉందని, ఇంకా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో, నాయకులు రావుల రాంనాథ్ , మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్, జీవన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఓస రాజు, సురేష్, రాజేశ్వర్, పోషెట్టి, రవి, చంద్రమోహన్ రెడ్డి, రాజు కుమార్, గంగాధర్, ప్రవీణ్, వడ్డే శ్రీను, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఖమ్మం పర్యటన విజయవంతం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్టమొదటి సారి ఖమ్మం విచ్చేసిన రామచందర్ రావు కి ఖమ్మం బిజెపి శ్రేణులు ఖమ్మం జిల్లా సరిహద్దు మామిళ్ల గూడెం టోల్ ప్లాజా నుండి ఘన స్వాగతం పలికి ర్యాలీ గా ఖమ్మం జిల్లా లోకి తొడ్కోని వచ్చారు. కూసుమంచి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరంఖమ్మం నగరం కి వచ్చారు. ర్యాలీ గా స్థానిక జిల్లా పరిషత్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక బైపాస్ రోడ్డు నందు సప్త పడి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతు రైతులకి ఇచ్చిన హామీలని బేషరత్తు గా అమలు చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు పార్టీ సిద్దాంతం కోసం పని చేస్తారే తప్పు మరే ఇతర ప్రలోభాలకి తలోగ్గి పని చేసేవారు కాదన్నారు. పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మునుపేన్నాడు లేని విధంగా బిజెపి అభ్యర్థి అయినా తనకు అధిక ఓట్లు వేశారు అని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని అయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శున్యం అని అన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఆ ప్రజలనే మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మొహం చాటస్తే ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందన్నారు ఎరువుల విషయం లో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ని ఇబ్బందులు పెడుతుంది అని తుమ్మల అంటూనరాని అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. తుమ్మల నాగేశ్వరావ్ చేసిన ఆరోపణ ని నిరూపించ లేకపోతే తుమ్మల నాగేశ్వ రావ్ రాజీ నామ చెయ్యాలి అని సవాల్ విసిరారు. ఎన్ని క ఏది అయినా విజయం బిజెపి దే అని, బి ఆర్ ఎస్ పని అయిపోయింది అని ప్రధాన పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్య అని అయన అన్నారు. ఖమ్మం, నల్గొండ బ్యాచ్ కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ,తాండ్రా వినోద్ రావు, దేవకీ వాసుదేవరావు, చావా కిరణ్, రవి రాదోడ్, నున్న రవికుమార్, గేంటెల విద్యాసాగర్,పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు, గోంగూర వెంకటేశ్వర్లు దొంగల సత్య నారాయణ, ఈవి రమేష్ నంబూరి రామలింగేశ్వరావ్ లు శ్రీమతి కొల్లిపక శ్రీదేవి పాల్గొన్నారు

ఖమ్మం

జై గల్లా అనే నినాదాల తో మార్మోగిన సమావేశం మందిరం

*జై గల్లా.. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. తాండ్ర వినోద్ రావు జిందాబాద్ అనే నినాదాలతో మర్మోగిన సమావేశ మందిరం* ఖమ్మం పున్నమి ప్రతినిధి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్ట మొదటి సారిగా ఖమ్మం వచ్చిన నేపథ్యంలో స్థానిక సప్త పది ఫంక్సన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం లో గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్ రావు, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అభిమానులు గల్లా సత్య నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి తాండ్రా వినోద్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అని, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వారి అభిమానలు నినాదాలు చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.