Tuesday, 12 May 2026

Blog

సంగారెడ్డి

నారాయణఖేడ్ జూలై 30: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: సబ్ కలెక్టర్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను నారాయణఖేడ్ డీఎల్పీఓ సంజీవరావు గారు, నిజాంపేట్ ఎంపీడీవో సంగ్రామ్ గారు, నిజాంపేట్ ఎంపీవో విజయ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను మరింత వేగంతో నిర్వహించాలని సూచించారు.

ఖమ్మం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన మంత్రి తుమ్మల

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణకు యూరియా సరఫరాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచందర్ రావు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని తెలంగాణకే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందనడం అవివేకం అన్నారు. రామచందర్ రావు వ్యాఖ్యలు బీజేపీకి రైతులపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు వద్దని ఎన్నిసార్లు కోరినా రామచందర్ రావు వైఖరి మారడం లేదన్నారు. రాజీనామా సవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తే బాగుంటుందని సెటైర్ వేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం గొప్పు లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు రైతులను తప్పుదారి పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితిపై లెక్కలతో సహా కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు. కాగా రాష్ట్రంలో సరిపడి యూరియా స్టాక్ ఉందని అయినా ఎరువుల కొరత ఎందుకు ఉందని ఇటీవల రామచందర్ రావు ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లోకి యూరియా వెళ్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన తుమ్మల రామచందర్ రావుపై అసహనం వ్యక్తం చేశారు.

ఖమ్మం

నేల కొండ పల్లి మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి సిసిరోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసారు రూ. 22 లక్షలతో మండ్రాజుపల్లి నుంచి కోరుట్లగూడెం వరకు పిఆర్ రోడ్డు, రూ.15 లక్షలతో బోదులబండలో సీసీ రోడ్లు, సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చెరువుమాదారంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారూ

తూర్పు గోదావరి

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు వికరిస్తున్న లేదా సేవిస్తున్న వారు వివరములు పోలీసు వారు తెలియజేయాలి

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి. రాజమహేంద్రవరం: జిల్లా. జూలై 30:తెలుగు వార్త ప్రతినిధి జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ మరియు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ యాంటిబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో రెండు‌ డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి,ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు, ఈగల్ టీం,ది‌రాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటిబయాటిక్స్ నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ మరియు సదస్సు నిర్వహించారు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో ర్యాలీని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ఝ్ర ప్రభుత్వ‌పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్సు డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయమన్నారు. యాంటిబ‌యోటిక్స్ మ‌రియు నార్కోటిక్స్ డ్ర‌గ్స్ వినియోగంపై ప్ర‌జల‌లో అవ‌గాహ‌న క‌ల్గించ‌డానికి ఈ కార్యక్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటి బ‌యోటిక్స్ వాడ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాలు దెబ్బ‌తింటున్నాయ‌ని, అందువ‌ల్ల ప్ర‌జ‌లు ముందుగా డ్రగ్స్ వినియోగంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల కళాశాలలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నామని చెప్పారు. మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పోలీసులకు తెలియచేయాలని కోరారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న అటువంటి వారిపై పి.డి.యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ… ప్రభుత్వం సూచనల మేరకు మాత్రమే మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్ ఎన్. బి. ఎం. మురళీకృష్ణ డి.ఎస్.పి సెంట్రల్ జోన్) రమేష్ బాబు ఇన్స్పెక్టర్ డి సి ఆర్ బి పవన్ కుమార్ రెడ్డి , ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ అప్పారావు ఇన్స్పెక్టర్( సి సి ఎస్) శ్రీధర్ కుమార్ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి పి.నాగమణి గారు నగరంలోని మెడికల్ షాపు యాజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు, తూర్పుగోదావరిజిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీ మరియు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్ల కార్డులను వారంతా ప్రదర్శించారు.

ఖమ్మం

బిజెపి ఖమ్మం జిల్లా శ్రేణులకి ధన్యవాదములు

మంగళవారం నాడు జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ఖమ్మం పర్యటన ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్, రాష్ట్ర నాయకులు తాండ్రా వినోద్ రావు, గల్లా సత్య నారాయణ, నున్న రవికుమార్, ఈ వి రమేష్ చావా కిరణ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్,దొంగల సత్య నారాయణ నంబూరి రామలింగేశ్వరావ్ లు ధన్యవాదాలు తెలియజేసారు

తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి

ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.

*డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత.* *ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.* *_పెద్దపల్లి డీసీపీ కరుణాకర్_* రామగుండం, జులై 30, పున్నమి ప్రతినిధి:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి లోని ఆద్య బ్యాంకెట్ హాల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు, బస్ డ్రైవర్లకు బుధవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు. పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, విద్యార్థులను ఎక్కించేటప్పుడు, బస్సు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బస్సును క్రమం తప్పకుండా ప్రతి రోజూ తనిఖీ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద, ప్రధాన కూడల్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని, విద్యార్థుల భద్రత కోసం బస్  పూర్తిగా ఆగిన తరువాత పిల్లలను ఎక్కించడం, దించడం కోసం ఒక వ్యక్తిని విద్యార్థులకు సహాయంగా ఏర్పాటు చేయాలని, టైర్లు, బ్రేక్లు, ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించాలని, బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పాలని కోరారు. విద్యార్థులు బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యత వహించాలనే విషయం గుర్తుంచుకోవాలని, మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,  బస్సులో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించాలని, విద్యార్థులతో ఓపిక, సహనంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలని, పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించడానికి, యాజమాన్యం, తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై నమోదు చేయు కేసులు, శిక్షల గురించి వివరించారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేయడం వలన మరణం సంభవిస్తే – 106(1) BNS [304-A IPC], సిగ్నల్ జంప్ చేసిన సందర్భం, రాంగ్ రూట్ లో వెళ్ళిన సందర్భంలో మరణం సంభవిస్తే, బలమైన సందర్భంలో – 105 BNS [304(ii) IPC], అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఒక వ్యక్తికి – సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125(a) BNS [337 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో –  125(b) BNS [338 IPC], పట్టణ ప్రాంతంలో, రద్దీ ప్రదేశాలలో, సాధారణ సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు  నడిపినచో సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125 BNS [336 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో – 281 BNS [279 IPC], మైనర్ కి వాహనం ఇచ్చి ప్రమాదానికి గురి చేసినట్లయితే – 180 MV Act, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే – 3 r/w 181 MV Act, మద్యం తాగి వాహనం నడినట్లయితే – 185 MV Act, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు అయితే – 196 MV Act, సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్ అనూష, ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్సై వెంకటేష్, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, రామగిరి ఎస్సై శ్రీనివాస్, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్, డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆగస్టు నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష పూజలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. – ఆగస్టు 8న ఉదయం 8 నుండి 10 గంట‌ల వరకు వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం – ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం…… – ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం – ఆగస్టు 9న శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి తిరుమంజనం, – ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఆల‌యంలో బాలాలయం, జీర్ణోద్ధరణ – ఆగస్టు 24న పుబ్బ నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, గ్రామోత్సవం – ఆగస్టు 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రాకారోత్సవం

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడా పెద్ద బాబు ప్రోత్సాహకాలు

విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించరుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకులు అందజేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి యూనిఫామ్ నాణ్యమైన భోజనం మూలిక వసతులు తల్లికి వందనం కార్యక్రమాల పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.చదివే సంస్కారం నేర్పిస్తుందని తెలుగు ఒకటే కాకుండా హిందీ ఆంగ్లం కూడా బాగా నేర్చుకొని తద్వారా మేధాసంపత్తిని పెంపొందించుకోవాలన్నారు. విద్యా సంస్కారం సంస్కృతిని తెలియజేస్తుందని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులలో మానసికంగా శారీరకంగా శక్తిని పెంపొందించు అందుకోసం ఉదయం రాగి జావా చీకీలు నాణ్యమైన ఆహార పదార్థములను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు ఊహించిన విధంగా మేము కూడా మా వంతు సహాయం చేస్తామని వచ్చే ఏడాది మరింత ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు ఊహించని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తానని మేడా విజయ శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పాఠశాల తో పాటు బాలికల కళాశాలలో ఇంత గొప్ప ఉపాధ్యాయులు పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదివి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ తాము అందించిన నగదు ప్రోత్సాహకులు కేవలం కొంతమేర చిన్న సహాయమే అని విద్యార్థులు ఇంకా బాగా చదివి తద్వారా ఉన్నత పదవులు పొందాలన్నారు చదువుతో సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది అన్నారు.ఆగస్టు15న నిర్వహించే క్రీడ సంస్కృత పోటీలకు సంబంధించి విద్యార్థులందరికీ బహుమతులు అందజేస్తామన్నారు. పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమకైనా తమ వంతు సహకారం అందిస్తామన్నారు అనంతరం పదో తరగతిలో అఖిల్, ప్రధమ ,ఆశిక్ ద్వితీయ యేసు ప్రియ ,తృతీయ స్థానంలో అలాగే ఇంటర్మీడియట్ ప్రధమ మోబినా ,ద్వితీయ అక్షయ, తృతీయ గాయత్రిలకు, 5000 3000 2000 చొప్పున నగదు ప్రోత్సాహంతో పాటు మమంతలను అందజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మరియు నాగిరెడ్డిపల్లి గ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగన్నపల్లి వెంకటరమణ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా తెదేపా నాయకులు ధనుంజయ నాయుడు పాఠశాలలకు మెమొటోలను అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాలకు అన్ని విధంగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. బాలికల ఇంటర్ కళాశాలకు సంబంధించి ల్యాబ్ అందుబాటులో లేదని ప్రస్తుతం నందలూరు జూనియర్ కళాశాలకు వెళ్లాల్సిన వస్తుందని ఇందుకోసం మీ వంతు సహాయం చేయాలని హెడ్మాస్టర్ గంగన్నపల్లి వెంకటరమణ కోరగా అందుకు సానుకూలంగా మెడ విజయ శేఖర్ రెడ్డి మరియు జంబు సూర్యనారాయణ స్పందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు ధనుంజయ నాయుడు సిరిసిల్ల నాగేంద్ర దండు నాగేశ్వరరావు మట్టి బాబు మెహర్ కనకుర్తి వెంకటయ్య తుమ్మాది శివకుమార్ నరసింహ వెంకటసుబ్బయ్య సుధాకర్ రెడ్డి లేబక శ్రీను,ఇరువురి మురళి తదితరులు పాల్గొన్నారు,

ఖమ్మం

దళిత మోర్చా సీనియర్ నాయకుని కుటుంబం కి ఆర్థిక సహాయం

ఖమ్మం జిల్లా బిజెపి దళిత మోర్చా జిల్లా సీనియర్ నాయకులు చింత ముళ్ల వీర స్వామి కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు. వారి కుటుంబఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లా బిజెపి కార్యలయం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు సమక్షంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో సేకరించిన కొంత మొత్తం ని వారి కి అంద జేశారు ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు దొడ్డపనేని ఆప్పారావ్, పువ్వాడ నాగేంద్ర కూమర్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, కృష్ణ చారి, రుద్ర గాని మాదవ్ దాసరి మధు జ్యోతుల యుగంధర్ నాయుడు, బి వెంకట్ మహేందర్ సింగ్, కందుల శ్రీ కృష్ణ, సురేష్ గౌడ్ లు ఉన్నారు.

ఖమ్మం

కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షుణ్ణి పరామర్శించిన తాండ్రా వినోద్ రావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు బానోత్ రాంబాబు గారి తండ్రి బానోత్ హరినాయక్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు చిట్టి రామవరం లోని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈకార్యక్రమంలో బుడగం రవి, సొప్పరి క్రాంతి, వీరన్న, ముచ్చ కుర్తి కిరణ్, మాచర్ల మహేష్, కందికట్ల వెంకట్, మల్లం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.