Tuesday, 12 May 2026

Blog

నంద్యాల

30 ఆవులతో వెళ్తున్న కంటైనర్

ఆత్మకూరు వార్తలు | నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో 30 ఆవులతో వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని అడ్డగించి, అధికారులకు సమాచారం ఇచ్చారు. తరువాత పరిశ్రమ పర్యవేక్షణ అధికారులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న ఆవుల సరఫరాకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 📍 ఘటన స్థలం: ఆత్మకూరు, నంద్యాల జిల్లా 📅 తేదీ: 2025 జూలై 31 🗂️ వర్గం: పరిశ్రమ/గోరక్షణ/పర్యవేక్షణ వార్తలు

నంద్యాల

నంద్యాల జిల్లా, పాణ్యం మండలం మద్దూరు PHCలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం

నంద్యాల జిల్లా, పాణ్యం మండలం మద్దూరు PHCలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మద్దూరు PHC మెడికల్ ఆఫీసర్ డా. సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సన్మాన కార్యక్రమంలో ANM లు, ఆశా వర్కర్లు, ఇతర మెడికల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల సేవలను గుర్తించి వారికి శాలువాలు కప్పి, పుష్పహారాలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమం స్థానికంగా మానవీయ విలువలు, సహకారం, సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పింది. పాణ్యం మండలంలో సేవలందించిన ఆరోగ్య కార్యదర్శుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు.

నంద్యాల

కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు

◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు ||* ◼️ *నంద్యాల జిల్లా,బనగానపల్లె:* ▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన మంత్రి సోద‌రుడు. ▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి. ▪️కానిస్టేబుల్‌పై మంత్రి సోద‌రుడు దాడి వీడియో వైర‌ల్‌ … స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు. *▪️అతని ఫై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.* *▪️ఈ ఘటన పై హోమ్ మంత్రి అనితా ఎలా స్పందిస్తారో చూడాలి అంటు కామెంట్స్.* ▪️నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి ,గంటా రామ్ కుమార్

ఆంధ్రప్రదేశ్

కంగ్టి జూలై 31: కుట్టుమిషన్ శిక్షణ పూర్తి.

కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో 30 రోజుల పాటునిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ శుక్రవారం పూర్తయిందనిగ్రామ స్వరాజ్య కోఆర్డినేటర్ మహానంద తెలిపారు. గ్రామస్వరాజ్య సమస్థ ఆధ్వర్యంలో 40 మంది మహిళలకుకుటుంబ శిక్షణతోపాటు సర్టిఫికెట్తో పాటు 50%రాయితీపై మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయురాలు పూజ, ఉపాధ్యాయులు తహుర్,సవిత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మన్నూరు సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ముక్కా వరలక్ష్మి

చిట్వేల్ పున్నమి ప్రతినిధి జూలై 31 చిట్వేల్ మండలంలోని మార్గోపల్లి గ్రామంలో మన్నూరు సుదర్శన్ రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన ముక్కా వరలక్ష్మి , ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులతో మమేకమై మాట్లాడిన ఆమె, ప్రజల మద్దతుతో సేవా కార్యక్రమాల్లో ముందుండేలా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణ రాజకీయం గరం గరం :10 శాసన సభ నియోజకవర్గల్లో ఉప ఎన్నికలు

•••భారీ ఎత్తున 10 మందిపై అనర్హత వేటు తిరిగి ఎన్నికలు పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాజకీయాల్లో గరం గరం *తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.* బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వీరే దానం నాగేందర్ (ఖైరతాబాద్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్) తెల్లం వెంకట్రావు (భద్రాచలం) గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు) కాలె యాదయ్య (చేవేళ్ల) ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) డాక్టర్ సంజయ్ (జగిత్యాల) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ)

ఖమ్మం

ప్ర శిక్షణ శిబిరం లో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షులు

ఖమ్మం పున్నమి ప్రతినిధి బిజెపి తెలంగాణ శాఖ నిర్ణయం ప్రకారం బిజెపి మండల అధ్యక్షుల శిక్షణ శిబిరం వరంగల్ వాగ్దేవి కాలేజ్ నందు గురువారం జరిగింది. ఈ శిబిరం లో ఖమ్మం వన్ టౌన్ అధ్యక్షులు గడిల నరేష్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, అర్బన్ టౌన్ అధ్యక్షులు వంకదాని రామకృష్ణ, ఖమ్మం రూరల్ అధ్యక్షులు జాతోట్ మధు నాయక్ పాల్గొన్నారు.

నిర్మల్

పంచాయితీ కార్యదర్శులకు భారంగా మారుతున్న నిర్వహణ…!

పున్నమి ప్రతినిధి ముధోల్: నిధులు లేక ముందుకు సాగని పనులు గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తి అయి దాదాపు 18 నెలలు పూర్తి కావస్తున్న నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు నిర్వహణ భారంగా మారుతుంది. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టడం తో పాటు ఇంటింటా తిరుగుతూ చెత్తను ట్రాక్టర్లు సేకరించి డంపింగ్ యార్డులు వేయడం వంటి పనులు చేపట్టాలి. అదేవిధంగా వర్షాకాలం కావడంతో దోమల బెడదను నివారించేందుకు విధిగా ఫాగింగ్ను నిర్వహించాలి. ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు బోరు మోటర్లను ఎప్పటికప్పుడు రిపేరు చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టాలి. శానిటేషన్ మెటీరియల్ కు అవసరమైన నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు సొంతంగా కొంత ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. దాదాపు 12 నెలల నుండి గ్రామపంచాయతీలకు నిర్వహణకు అవసరమయ్యే నిధులు రాక ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలవకుండా కార్యదర్శులు పనులను ముందుకు సాగిస్తున్నారు. నిధుల కొరతతో పంచాయితీల్లో అభివృద్ధి నత్త నడకన సాగుతుంది. పాలకవర్గాల గడువు తీరిన తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధులు ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్ కొరకు బ్యాంకులు తీసుకున్నాయి. దాని తర్వాత మాత్రం నిధులు రాక పంచాయతీల్లో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం స్పందించి పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకైనా గ్రామపంచాయతీలకు రోజువారి నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చెయ్యాలని కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.