Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి:ఖమ్మం బాలయ్య హర్షం

పున్నమి ప్రతినిధి ఖమ్మం 71 వ జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రం గా నందమూరి బాల కృష్ణ నటించిన *నేల కొండభగవంత్ కేసరి* ఎంపిక కావడం పట్ల ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్ హర్షం వ్యక్తం చేసారూ. ఈ సంధర్భముగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతు భగవంత్ కేసరి సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా బాలయ్య బాబు అభిమానుల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.

E-పేపర్

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తెదేపా జంబూ సూర్య నారాయణ

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి పాలన అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు .. శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వితంతు పెన్షన్లను పెద్ద మొత్తంలో మంజూరు చేయడం జరిగింది అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో 14 మంది మహిళలకు పింఛన్లను అందజేయడం జరిగిందన్నారు. కార్యాలయల చుట్టూ తిరక్కుండానే సంబంధిత మహిళలకు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి గారి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి *సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి గారి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలి* – *సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ పిలుపు* భూమికోసం, భుక్తి కోసం, పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం రాచరిక వ్యవస్థకు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బక్క చిక్కిన పేదలను ఒక్కటి చేసి వారి చేత బంధుకూలు పట్టించి సాయుధ రైతాంగ పోరాటంలో ముందు నడిచిన పోరాట యోధుడు, వందలాది ఎకరాల భూములను పేదలకు పంచిన భూ పోరాటాల దిక్సూచి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి స్ఫూర్తితో పేదలు, వ్యవసాయ కూలీలు మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ పిలుపునిచ్చినారు. శుక్రవారం సుందరయ్య భవన్, భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అనంతరం ” భూ భారతి – భూ సమస్యలను పరిష్కరిస్తుందా ” అనే అంశంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు వెట్టి చాకిరికి, దోపిడికి, బానిస విధానానికి ఆత్మగౌరవ పోరాటాలు, భూమి బుక్తి విముక్తి పోరాటాలు నిర్వహిస్తే ప్రజలు నేటి వరకు స్వేచ్ఛగా జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. కానీ దేశంలో అధికారంలో చేపట్టిన బిజెపి గత పది సంవత్సరాల్లో అనేక చట్టాలను మారుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీయాలనె కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. భారత దేశాన్ని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో దళారుల రక్షణ కోసం, కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు తిరిగి భూములను అప్పజెప్పడానికి ధరణి అనే చట్టాన్ని తెచ్చి రైతులను, పేదలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల అనేకమంది పేదలు నూతన పాసుబుక్కులు రాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేసి చట్టాన్ని అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం కూడా ఎత్తివేయాలని అన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని సర్వే చేసి ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని, రెండు ఎకరాలు చొప్పున సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. నాడు కృష్ణమూర్తి గారు కూలీల, రైతుల కార్మికుల సమస్యలపై పోరాడి అన్ని వర్గాల ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని వారి స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని వారు సూచించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ దళారుల రక్షణ కోసం తెచ్చిన ధరణి చట్టాన్ని రద్దుచేసి భూ భారతి చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తున్నామని కానీ గత ప్రభుత్వం అనుసరించిన విధంగా ఈ ప్రభుత్వము తమ విధానాలను అమలు చేయొద్దని సూచించారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా భూమి లేని పేదలను గుర్తించి వారందరికీ ప్రభుత్వ భూములను పంచాలని అన్నారు. ప్రజల చేతికి భూమి వస్తేనే దరిద్రం పోతుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందని వారు తెలియజేసారు. దేశంలో నరరూప రాక్షసుడైన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 ఆదివాసి గూడాల్లో ఐదు లక్షల ఎకరాల పైగా భూమి రక్షణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆనాడు కామ్రేడ్ కృష్ణమూర్తి లాంటి వాళ్లు అనేకమంది ప్రజల పక్షాన పోరాడి హక్కులను చట్టాలను సాధించుకున్నారని అన్నారు. ఈనాటి పాలకులు ఆ చట్టాలను, హక్కులను కాలరాయడానికి కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం రైతులు, కూలీలు, కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఐలు జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి కుమార్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య పాల్గొని మాట్లాడగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, తిరందాసు గోపి విజ్ఞాన కేంద్రం ట్రస్టు అధ్యక్షులు గద్దె నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిపంగి స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, సిపిఎం భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డబోయిన వెంకటేష్ , ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , కొండపురం యాదగిరి, నాయకులు కొండపురం పౌల్, మూడుగుల బాలరాజు, ఉప్పలయ్య , బండారి ప్రభాకర్, రాంబాబు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

పున్నమి ప్రతినిధి నిర్మల్: ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణ్ రావు పటేల్ గారు కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర 3వ 4వ తేదీల్లో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నటరాజన్ మీనాక్షి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల పర్యటన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముధోల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్ లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీ లు మరియు ఎంపిటిసిలు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు NSUI అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు మైనారిటీ సెల్ అధ్యక్షులు మహిళా సంఘ అధ్యక్షులు ఎస్టి సెల్ ఆధ్యక్షులు కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది

ఖమ్మం

నకిలీ విత్తనాలు విక్రయించే వారిని కఠినంగా శిక్షించాలి :పడిగల మధు డిమాండ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి వర్షాలు పడి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం లో రైతున్నలని నఖిలి విత్తనాల భయం పట్టుకుంది. ఏవి నఖిలినో ఏవి నకిలీ కావో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు లకి నకిలీ విత్తనాలు పట్ల అవగాహనా కలిపించాలని అని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు డిమాండ్ చేశారూ..నకిలీ విత్తనాలు అమ్మి రైతులని మోసం చేసే కంపెనీ లని సీజ్ చేయాలి పడిగల మధు డిమాండ్ చేసారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ

నూతన భవనం మరియు సీసీ రోడ్డు ప్రారంభం

శాలిగౌరారం మండలంలోని తక్కెల్లపాడు గ్రామంలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే మందుల సామెలు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి గౌరవ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారు, ప్రజలు పాల్గొన్నారు. తదుపరి ఇండ్ల లబ్ధిదారులు అండాలు అనే మహిళ ఇంటి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు

ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం: మోర్త సత్తిబాబు

కోనసీమ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అంబాజీపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో భర్త చనిపోయిన 11 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కూటమి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి*

ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో రెండు 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, మరో నాలుగు ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ఐదు ఆయుష్ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు కూడా సహకారం అందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 92 కో-లొకేటెడ్ ఆయుష్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ముఖ్యమైన ఆయుష్ మందుల సరఫరాకు కేంద్రం ద్వారా మద్దతు లభించిందని మంత్రి వివరించారు. అంతేకాక, ఒక కొత్త ఆయుష్ విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందించామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని చెంగనగుంట రూ.9.08 లక్షలు, కురుగొండ రూ.8.62 లక్షలు, మోమిడి రూ.8.01 లక్షలు, మంగళం ప్రాజెక్టుకు రూ.8.29 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నాలుగు కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 వరకు మొత్తం 25,173 మంది లబ్ధిదారులు ఆయుష్ సేవలు పొందారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఇటీవల తిరుపతి జిల్లాలోని రాస్-కృషి విజ్ఞాన కేంద్రంలో “నన్నారి సాగు, కోత తర్వాత నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, దాని ద్వారా సుమారు 60 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు రూ.10.80 లక్షలు, అశ్వగంధ మొక్కల ప్రచారానికి రూ.18.90 లక్షలు ఆర్థిక సహాయం అందించబడిందని కేంద్ర మంత్రి వివరించారు. *ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్త్రుతమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృత సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పంటపాలెం లోని బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం పలువురు కార్మికులకు గాయాలు బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో రిఫైనరీ లను శుభ్రపరుస్తుండగా ప్రవహించిన కెమికల్ కలిసిన నీరు దాంతో పలువురు కార్మికులకు గాయాలు అవ్వగా ముత్తుకూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు, ఈ ఘటన గురించిన ప్రమాద వివరాలను రహస్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.