Tuesday, 12 May 2026

Blog

అన్నమయ్య

బొప్పాయి రైతుల సమస్యలపై సమీక్ష సమావేశం – రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

రైతులు, ట్రేడర్స్, వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాన్ని కుదిర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈనెల 5 తేది వరకు కిలో బొప్పాయి ధర రూ.9 వరకు ఫిక్స్,- తర్వాత రూ.10 రూపాయలు అని కలెక్టర్ గారు మరియు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారుబొప్పాయి పంట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుదళారి వ్యవస్థకు చెక్ – రైతుల పక్షాన నిలిచిన కలెక్టర్ మరియు ముక్కా రూపానంద రెడ్డి తక్షణ స్పందనబొప్పాయి రైతులకు దళారీలు మరియు వారి సేట్లు నుంచి విముక్తి కలిగించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుఅన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతుల సమస్యలపై జరిగిన సమీక్ష సమావేశం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, బొప్పాయి సాగు చేసిన రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారనీ, దళారీ వ్యవస్థ కారణంగా వారు తీవ్రంగా మోసపోతున్నారని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కేవలం రూ.9/- కేజీగా ఉన్న కొనుగోలు ధరను పెంచుతూ, ఇక నుంచి కనీసం రూ.10/- కేజీకి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, దళారీ వ్యవస్థపై నిఘా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న _ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం,దళారీ వ్యవస్థను కట్టడి చేస్తాం అని తెలిపారు,రైతులు మాట్లాడుతూ తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెంటనే స్పందించిన కలెక్టర్ మరియు రూపానంద రెడ్డి బొప్పాయి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ స్పందనతో పాటు టీడీపీ నాయకత్వం తమకు అండగా నిలవడాన్ని రైతులు సానుకూలంగా స్వీకరించారు.ఈ సమావేశం ద్వారా బొప్పాయి రైతులకు న్యాయం జరిగే దిశగా ప్రారంభమైన నూతన ప్రయాణం మీద ఆశలు నెలకొనడంతో పాటు అడ్డగోలుగా వారిని దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నియంత్రణ కూడా ఏర్పడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నమయ్య

ఆపద వేళ అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి – ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.12 లక్షల పరిహారం అందించిన కలెక్టర్ శ్రీధర్ , ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కుటుంబ భారం మోసే వ్యక్తులు హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో, కుటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సాయం అందిస్తూ, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల పరిహారం మంజూరు చేసింది.రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులైన గజ్జల శ్రీను, గజ్జల వెంకటేశ్వర్లు మరియు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సునీత, రాజేశ్వరి, గంగయ్య లకు పంపిణీ చేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో రాత్రి అధికారికంగా పంపిణీ చేశారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ: “ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ఇలాంటి విషాద సంఘటనలు మరల జరగకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.ప్రభుత్వ స్పందన పట్ల గ్రామస్తులు, బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, తమ జీవితాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి కొంతవరకైనా భరోసానిచ్చిందని వారు తెలిపారు.ఈ ఘటన కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా నిలుస్తుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైతుల పక్షంగా నిలిచిన కూటమి ప్రభుత్వం – “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గం రైతన్నల మేలు కోసం ఐదు మండలాల్లో రూ.17.23 కోట్ల నిధులు మంజూరు

రైతన్నల మేలు కోసం రూపన్న కృషి– ముక్కా రూపానంద రెడ్డి అరవ శ్రీధర్ నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం అన్నదాత ఆశలకూ అండగా ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాయకత్వం రైల్వేకోడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈరోజు జరిగిన “అన్నదాత సుఖీభవ” పథకానికి సంబంధించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రూ.17.23 కోట్ల అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ కానుందని, మొత్తం 5 మండలాల రైతులు ఈ పథక ప్రయోజనాన్నిపొందబోతున్నారని వారు తెలిపారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“కూటమి ప్రభుత్వం అంటే రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం. ఇటీవల బొప్పాయి రైతులు ఎదుర్కొన్న ధరల సమస్యపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు కలెక్టర్ ద్వారా బొప్పాయి ధర రూ.9కి ఫిక్స్ చేయించారు. దళారీల వ్యవస్థపై నియంత్రణచర్యలుచేపట్టారు.అనంతరం”అన్నదాత సుఖీభవ” రైతులకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.20,000/- పైగా సహాయం అందుతోంది.” అని పేర్కొన్నారు.అరవ శ్రీధర్ మాట్లాడుతూ“మా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా సుమారు 24622 మంది అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడతాయి.” అని అన్నారు.ఈ పథకాలు కేవలం సహాయం కాదు, రైతుకు గౌరవం మరియు పంటల పెట్టుబడికి భరోసా అని నేతలు పేర్కొన్నారు.పలుశాఖఅధికారులు,కూటమి నేతలు, 5 మండలాల నాయకులు, రైతులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఖమ్మం

పుట్టినరోజు రోజు వేడుకలో మాజీ ఎం ఎల్ ఏ

నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండ పల్లి లో శ్రీకర ఫంక్షన్ హాల్ నందు జరిగిన నెలకొంద పల్లి గ్రామానికి చెందిన పెరలా గాంధీ మనవడు పుట్టి న రోజు వేడుకలో పాలేరు మాజీ శాసన సభ్యులు కాందాల ఉపేందర్ రెడ్డి మరియు బి ఆర్ ఎస్ నాయకులు హాజరై చిరంజీవి ని ఆశీర్వదించారు.

ఖమ్మం

హరితహారం కార్యక్రమం లో మొక్కలు పంపిణి

నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల నేల కొండ పల్లి మండలం బొదుల బండ గ్రామం లో శనివారం హరితహారం కార్యక్రమం లో భాగంగా మామిడి మొక్కలు పంపిణి చేశారు.దాత ఓరుగంటి నారాయణ రావు ఆర్థిక సహాయం తో 200మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షులు ఎటుకూరు రామారావ్ , కార్యదర్శి రమణ గుప్తా గ్రామస్థులు పాల్గొన్నారు

ఖమ్మం

బీసీ రిజర్వేషన్ ల మీద బిజెపి యువనేత స్పందన

ఖమ్మం పున్నమి ప్రతినిధి (ఖమ్మం రూరల్ మండలం) బిసి రిజర్వేషన్ ల మీద బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తాం, బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా 20 వేల కోట్లు కేటాయిస్తాం, బీసీ బిడ్డలు వ్యాపారం చేసుకోవడం కోసం కానీ చదువు కోసం కానీ 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పింది, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేయకుండా బీసీలను మోసం చేస్తుందనిఅని అన్నారు, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అదే విధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని రమేష్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ అబద్దాలను నమ్మి మోసపోయిన బీసీ బిడ్డలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని వల్లాల రమేష్ యాదవ్ అన్నారు

ఖమ్మం

42% బిసి రిజర్వేషన్ లని బీసీ లకే అమలు చెయ్యాలి

ఖమ్మం పున్నమి ప్రతినిధి కామరెడ్డి బిసి దీక్లరేషన్ లో పేర్కొన్నట్లు 42% రిజర్వేషన్ ని పూర్తి గ బిసి లకే అమలు చెయ్యాలి అని బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. బిసి లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వారి హక్కుల ని కాల రాస్తుంది అని మండిపడ్డారు.బిసి రిజర్వేషన్ విషయం లో కాంగ్రెస్కి బిజెపిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. బిసి రిజర్వేషన్ లో ముస్లిం లని చేర్చడం దూర్మార్గం అని ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ అన్నారు

ఖమ్మం

బోర్డు మీద ఆర్గానిక్ పాలు, అమ్మదేమో కంపెనీ పాలప్యాకెట్లు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లో ప్రతి రోజు సుమారు 40 నుండి 50వేలు లీటర్ల పాల వ్యాపారము జరుగుతుంది. వీటిలో హెరిటేజ్, అమూల్, సంగం, విజయ లాంటి ప్రముఖ కంపెనీ పాలు వినియోగా దారులు వాడుతున్నారు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛమైన డైరీ ఫామ్ ల నుండి తెచ్చిన పాలను అమ్ముతున్నారు. వినయోగ దారులు డైరీ ఫామ్ నుండి వచ్చే ఆర్గానిక్ పాల వినియోగం పై మక్కువ చూపుతున్నారు. ఇదే అవకాశం గా బావించి న కొంతమంది కేటు గాల్లు అనామకమైన పాల డైరీ ల నుండి పాలు సేకరించి క్యాన్ లలో నింపి వినియోగదారులకి విక్రయించి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ న్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఇలాంటి పాల విక్రయదారులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి వినియోగ దారులు కోరుతున్నారూ

తెలంగాణ

శాలిగౌరారం మండలంలో ఎమ్మెల్యేగారు సుడిగాలి పర్యటన

నల్గొండ జిల్లా పున్నమి ప్రతినిధి: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పోలీసుస్టేషన్ ప్రక్కన 80 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మించిన సింగిల్ విండో భవనం మరియు గోదామును ఎమ్మెల్యే మందుల సామెలు గారు ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు క్రొత్తగా వొచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలోని NG కొత్తపల్లి గ్రామం, జాలోని గ్రామం, రామాంజపురం గ్రామాలలో MGNREGS నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మంచిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మండలంలోని అంబరిపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీకి శంకుస్థాపన చేసి, అనంతరం MGNREGS నిధులు 15 లక్షల రూపాయల సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈకార్యక్రమాలలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి గారు, AMC చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి గారు, మాదారం గ్రామం మాజీ ఎంపీటీసీ నోముల జనార్దన్ గారు, మండల నాయకుడు బెల్లి వీరభద్రం, వంగమర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్ గారు, కాంగ్రెస్ గ్రామ శాఖ బీసీ అధ్యక్షులు రూపని వెంకన్నగారు,మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.