Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

దేశాయ్ బీడీ కంపెనీలో నయా దందా

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామం లో గల దేశాయ్ బీడీ ఆఫీస్ లో కిరాణా దందా నడపడం జరుగుతుంది కుర్ కురే ,గులాబ్ జామ్ , సోనూ పాపిడి ,అమ్ముతున్న వైనం దేశాయ్ బీడీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున గత కొన్ని ఏళ్లుగా ఈ దందా అదే కంపెనీ కి చెందిన వ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలు గా కొనసాగుతోంది. ఆఫీసు లో టెకెదర్ లకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీ లో బీడీ కార్మికులకు ఆముతూ కార్మికుల వద్ద రూ. 200 -300 విరివిగా చిప్స్ ,సోనూ పాపిడి విక్రయాలు, జరుపుతున్నారు.. నేల వారి కార్మికులకు వచ్చే డబ్బుల నుంచి కట్ చేయడం జరుగుతుంది, చట్టవ్యతిరేకమైన వ్యాపారం కొనసాగుతున్న తరుణంలో ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వాల్సిన కంపెనీ చట్టం చేతిలో తీసుకుని కార్మికులకు పనులు చేయించడంపై కార్మిక శాఖ అటు వైపు కన్నెత్తి చూపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆర్.జి.ఎన్. హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్ డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఖమ్మం

ప్రముఖ సాయి భక్తురాలు జెన్నారెడ్డి విజయ రెడ్డి మృతి

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని పెనుబల్లి మండల కేంద్రం లో గల రాజసాయి మందిరం చైర్మన్ శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి గుండె పోటు తో మరణించారు. కుమారుని యొక్క జ్ఞాపకం గా వంగముత్యాల బంజర్ లో 25 ఎళ్ల క్రితం *రాజసాయి మందిరం ని నిర్మించి ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తు ఎంతో మందికి కంటి చూపు ని బాగుచేసి వారిని తిరిగి లోకాన్ని చూసే ల చేశారు. అలాంటి మహా వ్యక్తి శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి ని గుండె పోటు రూపం లో ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి సేవలు పొందిన ఎందరో ప్రజలు కోరుకుంటున్నారూ. వారి జీవిత భాగస్వామి రిటైర్డ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి కి పున్నమి దినపత్రిక ఖమ్మం జిల్లా తరుపున ప్రఘడా సానుభూతి తెలియజేస్తున్నాను

యాదాద్రి భువనగిరి

బ్రేకింగ్ న్యూస్

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ పలు దుకాణాల పై కి దూసుకెళ్ళింది. ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. రహదారికి అడ్డంగా ఉన్న లారీ నీ క్రేన్ సహాయం తో పోలీసులు తొలగిస్తున్నారు. కాగా లారీ గజ్వేల్ నుండి భువనగిరి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. బ్రేక్ లు ఫెయిల్ కావటం తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఖమ్మం

శుభాకార్యం లో పాల్గొన్న సత్తుపల్లి మాజీ శాససభ్యులు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మరికంటి సుబ్బారావు, కళావతి దంపతుల కుమార్తె చి ।। నవ్యశ్రీ మహాలక్ష్మి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య . సండ్ర వెంకట వీరయ్య తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, పర్వతనేని వేణు, మేకల నర్సింహారావు, చింతల సత్యనారాయణ, మరికంటి శ్రీను, వాసు తదితరులున్నారు.

జనగాం

🎶 హరే కృష్ణ నామం నర్తించిన వేదిక – వేదిక్ విద్యార్థుల ఆధ్యాత్మిక అనుభూతి 🎥

తేదీ: 03-08-2025, ఆదివారం రోజు, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ బృందంగా కలిసి దేవి థియేటర్, జనగామలో ప్రదర్శితమైన “మహావతార్ నరసింహ” సినిమాను వీక్షించారు. ఈ చిత్రం అందరికీ ఆధ్యాత్మికంగా ప్రేరణనిచ్చింది. నరసింహస్వామి అవతారంలో ధర్మ పరిరక్షణ కోసం జరిగే సంఘర్షణ, భక్తి, ధైర్యం పట్ల ఈ సినిమా అందించిన సందేశాలు ప్రతి విద్యార్థి హృదయంలో గాఢంగా నిలిచిపోయాయి. మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసిన ఈ చిత్రం మరువలేని అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా, హరే కృష్ణ భక్తబృందం వారు హరినామ సంకీర్తన చేస్తూ, ఎంతో ఉత్సాహంగా సందడిగా నృత్య ప్రదర్శనను కూడా అందించారు. వారి భక్తి, పాటల మాధుర్యం మరియు నృత్యం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నాయి. మేము, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ, ఈ చిత్రం నిర్మాణ బృందానికి, నటీనటులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి చిత్రాలు యువతలో సంస్కారాలను, భక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని మా నమ్మకం.

నిర్మల్

సివిల్ ఇంజనీర్ లో డాక్టరేట్ పొందిన దేగాం యువకుడు*

పున్నమి ప్రతినిధి నిర్మల్: భైంసా మండలం లోని దేగాం గ్రామానికి సింగారపు కైలాష్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పి హెచ్ డి పట్టాను అందుకున్నారు. మహీంద్రా యూనివర్సిటీలో పి. హెచ్. డి చేయడంతో యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహేంద్ర చేతుల మీదుగా పట్టాను అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కైలాష్ ప్రస్తుతం స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్ లో పరిశోధన పూర్తిచేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను అందుకోవడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. దేగాం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కుమారుడు కైలాస్… కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండి జి. వి. ప్రసాద్, వైస్ ఛాన్సలర్ యాదులు మేడురి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న సందర్భంగా అతని మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్

ఘనంగా జరిపిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు బోనాల పండగ వేడుకలు

దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్ జనం న్యూస్ ఆగస్టు 03 ప్రతినిధి దూపం అంజనేయలు: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో బోనాల పండుగ సందర్భంగా ఘనంగా శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు బోనాల పండగ మైసమ్మ దేవతల ఆలయాలను దర్శించిన దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్, కమిటీ సభ్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దేవుని ఆశీస్సులు, వేద విద్యానగర్ ముంగనూరు తుర్కయంజాల్ మున్సిపాలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని దీవెన వల్ల వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపాల్టీ పెద్దలు, ఆలయ కమిటీ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

యోగా సాధన జీవితంలో ఒక భాగం కావాలి: ఎమ్మెల్యే బగ్గు

ఆగస్టు 3: యోగ సాధన ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. ఆదివారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రాథమిక స్థాయిలో నుంచే యోగాభ్యాసం అలవాటు చేస్తే, అది వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. యోగా వల్ల మనశ్శాంతి, శారీరక సామర్థ్యం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి,” అని పేర్కొన్నారు.పోటీలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, యోగా శిక్షకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఘనంగా జరిపిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు బోనాల పండగ వేడుకలు

దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్ జనం న్యూస్ ఆగస్టు 03 ప్రతినిధి దూపం అంజనేయలు: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో బోనాల పండుగ సందర్భంగా ఘనంగా శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు బోనాల పండగ మైసమ్మ దేవతల ఆలయాలను దర్శించిన దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్, కమిటీ సభ్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దేవుని ఆశీస్సులు, వేద విద్యానగర్ ముంగనూరు తుర్కయంజాల్ మున్సిపాలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని దీవెన వల్ల వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపాల్టీ పెద్దలు, ఆలయ కమిటీ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Blog

కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి నందు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీ యం కిసాన్ 20 వ విడత నగదు బదిలీ – అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం

కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి నందు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీ యం కిసాన్ 20 వ విడత నగదు బదిలీ – అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం డా. జి ధనలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అధ్యక్షతన నిర్వహించారు. వీరు మాట్లాడుతూ పీఎం కిసాన్ కార్యక్రమం ప్రాముఖ్యత వివరిస్తూ రైతులు ఈ పథకం 2019 నుండి ప్రారంభమై 20 వ విడత క్రింద దాదాపుగా ఇరవైవేల కోట్ల రూపాయలు పది కోట్ల మంది రైతులకు అందజేస్తున్నట్లుగా వివరించారు. ముఖ్య అతిధిగా భూపాల్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్ ఆర్ బీ సి, వారు పాల్గొని ఈ రోజు జిల్లాలో 3.93 లక్షల మంది రైతుల ఖాతాల్లో 140 కోట్ల రూపాయలు జమచేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి పీ ఎమ్ కిసాన్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం లో వీక్షించారు. శాస్త్రవెత్తల సలహాలతో రసాయన ఎరువుల పై ఖర్చు తగ్గించే మార్గాలపై ద్రుష్టి సరించాలన్నారు. వ్యవసాయ ఏ డి ఏ, కోయిలకుంట్ల సుధాకర్ మాట్లాడుతూ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 మరియు కేంద్ర ప్రభుత్వం రూ 2000 లబ్దిదారులకు అందచేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు నగదు జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ సేవా కేంద్రం సంప్రదించాలని సుంచించారు అనంతరం శాస్త్రవెత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటల్లో చీడ పీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం మరియు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో *మండల రెవెన్యూ అధికారి నారాయణ రెడ్డి పాల్గొని సి సి ఆర్ సి కార్డు కలిగిన కౌలు రైతుకూడా అన్నదాత సుఖీభవకు అర్హులని కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో రాజశేఖర్ రెడ్డి చైర్మన్ వాటర్ యూస్ అసోసియేషన్, సురేష్ కుమార్, కేవీకే పరిపాలన అధికారి, బనగానపల్లి మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, ఎమ్. పీ. డి. ఒ సయ్యద్ మొహమ్మద్ అలీ, జోనల్ మేనేజర్, కోరమండల్ టిడిపి నాయకులు మౌలేశ్వర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, భూషన్న, పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.