Tuesday, 12 May 2026

Blog

Blog

కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి నందు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీ యం కిసాన్ 20 వ విడత నగదు బదిలీ – అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం

కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి నందు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీ యం కిసాన్ 20 వ విడత నగదు బదిలీ – అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం డా. జి ధనలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అధ్యక్షతన నిర్వహించారు. వీరు మాట్లాడుతూ పీఎం కిసాన్ కార్యక్రమం ప్రాముఖ్యత వివరిస్తూ రైతులు ఈ పథకం 2019 నుండి ప్రారంభమై 20 వ విడత క్రింద దాదాపుగా ఇరవైవేల కోట్ల రూపాయలు పది కోట్ల మంది రైతులకు అందజేస్తున్నట్లుగా వివరించారు. ముఖ్య అతిధిగా భూపాల్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్ ఆర్ బీ సి, వారు పాల్గొని ఈ రోజు జిల్లాలో 3.93 లక్షల మంది రైతుల ఖాతాల్లో 140 కోట్ల రూపాయలు జమచేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి పీ ఎమ్ కిసాన్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం లో వీక్షించారు. శాస్త్రవెత్తల సలహాలతో రసాయన ఎరువుల పై ఖర్చు తగ్గించే మార్గాలపై ద్రుష్టి సరించాలన్నారు. వ్యవసాయ ఏ డి ఏ, కోయిలకుంట్ల సుధాకర్ మాట్లాడుతూ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 మరియు కేంద్ర ప్రభుత్వం రూ 2000 లబ్దిదారులకు అందచేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు నగదు జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ సేవా కేంద్రం సంప్రదించాలని సుంచించారు అనంతరం శాస్త్రవెత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటల్లో చీడ పీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం మరియు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో *మండల రెవెన్యూ అధికారి నారాయణ రెడ్డి పాల్గొని సి సి ఆర్ సి కార్డు కలిగిన కౌలు రైతుకూడా అన్నదాత సుఖీభవకు అర్హులని కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో రాజశేఖర్ రెడ్డి చైర్మన్ వాటర్ యూస్ అసోసియేషన్, సురేష్ కుమార్, కేవీకే పరిపాలన అధికారి, బనగానపల్లి మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, ఎమ్. పీ. డి. ఒ సయ్యద్ మొహమ్మద్ అలీ, జోనల్ మేనేజర్, కోరమండల్ టిడిపి నాయకులు మౌలేశ్వర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, భూషన్న, పాల్గొన్నారు

Blog

రైలు ఆగేందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ప్రత్యేక కృతజ్ఞతలు

రాయలసీమలో ప్రత్యేక స్థానం, చారిత్రాత్మక, విశిష్టత గల ప్రదేశంగా ఉంటున్న కోవెలకుంట్లలో రైలు బండి ఆగేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోనల్ వినియోగదారుల కన్సట్లేట్ మెంబర్ ఎ. వెంకట రంగయ్య అన్నారు కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ ను వెంకటరంగయ్య సందర్శించి, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తో సమావేశమయ్యి గుంటూరు – తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగడంతో రైలుకు స్వాగతం పలికి ఇందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి రైలు ప్రయాణికుల పక్షాన అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ పరిశీలించి, స్టేషన్ ఆవరణలోని రైలు ప్రయాణికులతో మాట్లాడుతూ కోయిలకుంట్ల రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు కల్పించాలి, గుంటూరు _ నంద్యాల _ తిరుపతి ట్రైన్ కు (17261/17262) స్టాప్ ను ఎంపీ శబరి సహకారంతో పునరుద్ధరించారన్నారు. వారాంతపు స్పెషల్ ట్రైన్ నాందేడ్ _ చర్లపల్లి _తిరుపతి_ధర్మవరం (07189/07190) రైళ్లకు కోవెలకుంట్ల లో స్టాప్ ఏర్పాటు చేశామన్నారు. ISO ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ఫెసిలిటి అందించాలి ప్రయాణికులకు లిఫ్ట్ సౌకర్యం కలిగించాలి కోవెలకుంట్ల పట్టణం నుంచి రైల్వే స్టేషన్ పోయే మార్గంలో కొత్త రోడ్డు ను ఏర్పాటు చేయాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని, కోయిలకుంట్ల , బనగానపల్లి లలో రైలు టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, స్టేషన్ లో ట్రైన్ నేమ్ డిజిటల్ డిస్ప్లే బోర్డు లు, బోగీల వరుస క్రమం బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉదయం పూట డెమో ట్రైన్ లో టాయిలెట్ ఫెసిలిటీ ఉన్న బోగీలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళల, చిన్న పిల్లలు , సీనియర్ సిటిజన్ ల కొరకు పగటి పూట రేణిగుంట నుంచి నంద్యాల _ రేణిగుంట నూతన మేమూ ట్రైన్ ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకొంటున్నారని రైలు ప్రయాణికుల సలహాలు, సూచనలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని వెంకటరంగయ్య తెలిపారు

యాదాద్రి భువనగిరి

బ్రేకింగ్ న్యూస్

పున్నమి ప్రతినిధి సిద్దయ్య యాదాద్రి : చౌటుప్పల్ వద్ద రోడ్డుప్రమాదం… ఆటోను వెనకనుంచి ఢీకొన్న లారీ… ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు…ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు…

సంగారెడ్డి

నారాయణఖేడ్ ఆగస్ట్ 02 : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నారాయణఖేడ్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థులు రెండు లక్షల విలువైన సీసీ కెమెరాలను, ఎలక్ట్రిక్ బెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ ఆచార్యులకు, మాతాజీలకు సన్మానం చేశారు. ఇందుకుగాను పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వచార్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

E-పేపర్

సిర్గాపూర్ ఆగస్ట్ 02: గంజాయి సాగు, రవాణాపై ఎస్సై కీలక హెచ్చరిక

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు, కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

E-పేపర్

సిర్గాపూర్ ఆగస్ట్ 02: గంజాయి సాగు, రవాణాపై ఎస్సై కీలక హెచ్చరిక

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు, కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ పరిధిలో “అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్” నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మొదటి విడత నిధుల ప్రారంభోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారితో కలిసి రాజంపేట, తాళ్లపాక నందు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.చైర్మన్ కె కె చౌదరి మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రైతులకు 50 రూపాయలకే ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని, తర్వాత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఎన్నో పథకాలను అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నది కూడా నారా చంద్రబాబునాయుడు గారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టి బాబు గారు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు గారు, శరత్ కుమార్ రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు గారు, ప్రభుత్వ అధికారులు, భారీ సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని ఒక పండగ వాతావరణంలో రైతులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం

బోళ్ల బిక్షపతి కుటుంబ సభ్యులని పరామర్శించిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి *భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బోళ్ల బిక్షపతి గారి తండ్రిగారు బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు గురువారం స్వర్గస్తులయ్యారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ గల్లా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది* *ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ బోళ్ల బిక్షపతి గారి తండ్రి గారు బోళ్ల లక్ష్మయ్య గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబంతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు ఎప్పుడు చూసినా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని, అదేవిధంగా బోల్ల చిన్న లక్ష్మి గారు వారి చిన్నతనంలో నాటకాల పైన ఉన్న శ్రద్ధతో శ్రీరాముని పాత్ర శ్రీకృష్ణుని పాత్ర పోషించారని, ఇప్పటికీ రామాయణం మహాభారతం గురించి ఈ తరం వారికి వివరిస్తూ ఉండేవారని, అటువంటి మంచి మనిషి ఆకస్మికంగా మరణించడం అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటువంటి కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు*

ఖమ్మం

బోళ్ల బిక్షపతి కుటుంబ సభ్యులని పరామర్శించిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి*భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బోళ్ల బిక్షపతి గారి తండ్రిగారు బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు గురువారం స్వర్గస్తులయ్యారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ గల్లా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది* *ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ బోళ్ల బిక్షపతి గారి తండ్రి గారు బోళ్ల లక్ష్మయ్య గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబంతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు ఎప్పుడు చూసినా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని, అదేవిధంగా బోల్ల చిన్న లక్ష్మి గారు వారి చిన్నతనంలో నాటకాల పైన ఉన్న శ్రద్ధతో శ్రీరాముని పాత్ర శ్రీకృష్ణుని పాత్ర పోషించారని, ఇప్పటికీ రామాయణం మహాభారతం గురించి ఈ తరం వారికి వివరిస్తూ ఉండేవారని, అటువంటి మంచి మనిషి ఆకస్మికంగా మరణించడం అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటువంటి కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు*

E-పేపర్

సంగారెడ్డి ఆగస్ట్ 02 : ఆపరేషన్ ముస్కాన్.. 126 మంది బాలలకు విముక్తి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత వారసులకు అప్పగించామన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.