సాదర స్వాగతం పలికిన గ్రామస్తులు
పున్నమి ప్రతినిధి ,వెదురుకుప్ప మండలం
వెదురుకుప్పం మండలం మారేపల్లి జాతరకు పలువురు వైసీపీ ప్రముఖులు మంగళవారం హాజరయ్యారు. చిత్తూరు నియోజక వర్గ వైసీపీ సమన్వయ కర్త విజయానంద రెడ్డి, చంద్రగిరి నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గ బూత్ కమిటీల కన్వీనర్ బోడి రెడ్డి నారాయణ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. మారేపల్లిలోని కె. బాబు అలియాస్ మురళి నివాసానికి చేరుకోన్న వీరందరికీ సాదర స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలను చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పరిచయం చేశారు. ఆ తర్వాత అందరితో కలిసి గంగమ్మను దర్శించారు.


