తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిల్లీ లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను ఒకేసారి కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి PMAY-G ఇళ్ల కేటాయింపు జరిగితే గ్రామీణ పేదలకు మరింత వేగంగా సొంతిళ్లు అందించగలమని వివరించారు. తెలంగాణకు ఇళ్ల కేటాయింపును స్వయంగా రాష్ట్రానికి వచ్చి ప్రకటించాలని ఆహ్వానించగా, చౌహాన్ సానుకూలంగా స్పందించి తెలంగాణ పర్యటనకు అంగీకరించారు.


