Tuesday, 12 May 2026

Blog

తూర్పు గోదావరి

రూ. 9 లక్షల బీసీటీ నిధులతో పార్క్ నిర్మాణం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

` శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : జులై 26 పున్నమి ప్రతి నిధి, భవానీ చారిటబుల్‌ ట్రస్టు (బీసీటీ) నిధులు సుమారు రూ. 9 లక్షలతో నిర్మించనున్న పార్కు పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక 43, 44 డివిజన్లకు సరిహద్దు ప్రాంతం మల్లికార్జున నగర్‌లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో స్థానిక ప్రజల కోసం ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో ఈ డివిజన్లకు పర్యటనకు వచ్చిన నేపధ్యంలో స్థానిక మహిళలు, పిల్లలు తమకు పార్కు కావాలని విన్నవించారి, వారి కోరిక మేరకు మహిళలకు, పిల్లలకు ఉపయోగపడేలా పార్కును నిర్మించనున్నట్టు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. తమ భవానీ చారిటబుల్‌ ట్రస్టు తరపున విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. నగరంలోని సంపన్నులు ముందుకు వచ్చిన సమాజ సేవ చేసి వారి దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. తన స్నేహితుడి సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కోక్కటి సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే 6 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్లికార్జున నగర్‌లో పార్కు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం అయిన తరువాత దానిని నగర పాలక సంస్థకు అప్పగిస్తామన్నారు. పి4లో భాగంగా బంగారు కుటుంబాలను మార్గ దర్శకులు దత్తత తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, అవకాశం మేరకు నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రకటించారు. టీడీపీ నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, వర్రే శ్రీనివాస్‌, రెడ్డి మణేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్‌, జవ్వాది మురళి, పాలవలస వీర భద్రం, బుడ్డిగ రవి, మళ్ల వెంకట రాజు, వంజరపు శంకర్‌, బ్రహ్మాజీ, సంసాని ప్రసాద్‌, నిమిష కవి, గుదే రఘు నరేష్‌, కె వి శ్రీను, తుళ్లి పద్మ, శివారెడ్డి, చాపల చిన్న రాజు, అస్లాం, ఆడారిలక్ష్మి నారాయణ, దుద్దేటి నాగేంద్ర, మదినా సాహెబ్‌, వానపల్లి శ్రీను తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వెంట ఉన్నారు.

అన్నమయ్య

ఆన్ లైన్ రిజిస్టర్ పోస్టు విధానమును రద్దుచేయాలి

రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 26 రైల్వేకోడూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మణి రిజిస్టర్ పోస్టు చేయడాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్ పోస్ట్ ఆన్ లైన్ పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందలను కస్టమర్లు పడాల్సి వస్తుందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే పాత పద్ధతిలోనే రిజిస్టర్ పోస్టు చేసే విధంగా అమలు చేయాలన్నారు.

జనగాం

SSCలో మెరిసిన శ్రీజర్ రెడ్డి – IIIT బాసర సీటు సాధనపై నగదు బహుమతి

ZPHS ఏడునూతులలో చదువుకున్న విద్యార్థి శ్రీజర్ రెడ్డి, 2025 సంవత్సరం SSC ఫలితాల్లో 566 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. తన అద్భుతమైన కృషితో IIIT బాసరలో సీటు సాధించి, పాఠశాల పేరు మరింత మెరిపించాడు. ఈ సందర్భాన్ని గుర్తుగా చేసుకుంటూ, ప్రాథమిక పాఠశాల, ఏడునూతుల LFL HM అయిన శ్రీ బుక్క ప్రవీణ్ కుమార్ గారు శ్రీజర్ విజయాన్ని అభినందిస్తూ రూ.5,000 నగదు బహుమతిని ప్రకటించి అందజేశారు. శ్రీజర్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినా, అతని తండ్రి శ్రీ సంజీవ రెడ్డి గారు బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా బుక్క ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ, > “ఇది మా గ్రామ పాఠశాల విద్యార్థుల కృషికి నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో ఎవరు IIIT బాసరలో సీటు సాధించినా, నేను ఇలాగే నగదు బహుమతిని అందజేస్తాను” అన్నారు. ఈ మాటలు విద్యార్థుల్లో విశ్వాసం, తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో ZPHS ఎడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారు పాల్గొని అభినందనలు తెలిపి, సంజీవరెడ్డి & ప్రవీణ్ కుమార్ గార్లను సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ ఘట్టాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, భాస్కర్, ఈర్య, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత మొ., వారు పాల్గొన్నారు. ఈ విజయగాథ గ్రామల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

ఖమ్మం

బీసీ హక్కు ల మీద కాంగ్రెస్ కపట ప్రేమ : బిజెపి మాజీ ఎం ఎల్ ఏ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపుతున్న ప్రేమ కేవలం సవతి ప్రేమ మాత్రమేనని, అది కపటంతో నిండిన మోసం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఖమ్మం జిల్లా పర్యటలో భాగంగా ఖమ్మంలో హర్షా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సన్నే ఉదయ్ ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరావ్, నున్నరవి కుమార్, పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు లతో కలిసి వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై దుయ్యబట్టారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తున్న ఆలోచన అంతర్వాహినిగా సాగుతోందని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీ జనాభా దాదాపు 55 శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వేలో బీసీ జనాభా తక్కువగా ఎలా నమోదవుతుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. సర్వేలు నిర్వహించే యంత్రాంగం ఒకటే కాగా గణాంకాలు ఎలా మారతాయో వివరించాలని డిమాండ్ చేశారు. ఇది బీసీలను రాజకీయంగా అణచివేయాలన్న కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. 42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీ లు నష్టపోతారని చెప్పారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీ కే లబ్ధి అని అన్నారు. బీసీ వర్గాల్లోని వాస్తవ గణాంకాలను తక్కువచేసి, ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రమాదకరమైన చర్య అని చెప్పారు. ఇటువంటి చర్యల ద్వారా బీసీల మధ్య సామాజిక విభేదాలు కలిగించే అవకాశం ఉందని, బీజేపీ పార్టీగా దీన్ని సహించబోదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే హద్దులు దాటి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీ వాడుక భాషలో ప్రేమ చూపిస్తూ, ధృతరాష్ట్రుని కౌగిలికి మాదిరిగా ఉంటోందని పేర్కొన్నారు. వారి సమస్యలపై అసలైన పరిష్కారాలు చూపించకుండా, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం

పెద్దవడుగూరు ఎమ్మార్వో ని సస్పెండ్ చేయాలి కుళ్లాయమ్మ. ఆవేదన

పెద్దవడుగూరు మండలంలో భూమి హక్కుల కోసం సాధారణ కుటుంబాలు ఎదుర్కొంటున్న అవ్యవస్థితిపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివసించే కుళ్లాయమ్మ కుటుంబానికి చెందిన భూమికి సంబంధించిన సర్వేను నిర్వహిస్తామని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) నిన్న (తేదీ) ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. అయితే ఈరోజు బాధితులు ఎమ్మార్వో కార్యాలయాన్ని సంప్రదించగా,మేడమ్ కార్యాలయానికి రాకపోవడమే కాకుండా అక్కడి అధికారులు ఎవ్వరూ అందుబాటులో లేరు. బాధితుల వద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ, ఆ భూమిని మాసినేని రామయ్య పేరుతో ఆన్లైన్‌లో నమోదు చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి కోసం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా సర్వే ఇన్‌చార్జి సహా అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. “ఎమ్మార్వో ఆదేశిస్తేనే సర్వే చేస్తాం” అనే వాదనతో సర్వే అధికారులు బాధితుల ఆకాంక్షలకు తూట్లు పెడుతున్నారని పేర్కొన్నారు. పెద్దవడుగూరు ఎమ్మార్వో గారు మరియు సర్వే ఇన్‌చార్జి మాసినేని రామయ్యకు తొత్తులుగా మారారు. మా పేద కుటుంబం కోసం నిలబడి న్యాయం చేయాల్సిన వారు, అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారు,” అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని, లేకపోతే తమ సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా ద్వారా హెచ్చరించారు.

ఖమ్మం

కార్గిల్ విజయ దివస్ సం దర్భముగా నాటి అమరుల కి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫర్ ) కార్గిల్ యుద్ధంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోటెర్రరిస్టు పాకిస్తాన్తో వీరోచిత పోరాటం చేసిన వీరవరే ణ్యు లకు పాదాభివందనం అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జ్ గల్లా సత్య నారాయణ అన్నారు. ఆ పోరాటంలో మాతృభూమి సంరక్షణలోప్రాణార్పణ చేసిన వీర కిశోరాలకు నమస్సుమాంజలి అని గల్లా సత్య నారాయణ అన్నారూ

ఖమ్మం

డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీస్ లు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ ) ఖమ్మం టూ టౌన్ si వి. రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం గట్టయ్య సెంటర్ నందు శనివారం ఉదయం డ్రంక్ డ్రైవ్ మరియు సంబదింత కాగితలు లేని బండ్లని తనిఖీ చేసి జరిమానా లు విడిస్తున్నారు. పలువురు కానిస్టేబుల్ లు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు

అన్నమయ్య

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర 25 రూపాయలు  చెల్లించాలి. సిఐటియు. ఏపీ రైతు సంఘం డిమాండ్!! వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు!!

రైల్వే కోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 26 అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గంలో  బొప్పాయి రైతులకు కనీసం 25 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని  సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐకేఎస్ అనుబంధం, మండల కన్వీనర్, సి సుభాన్,  విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు, మధ్య దళారులు, ప్రారంభంలో 16 రూపాయలు, పెట్టి,  సిండికేట్ ఐ, రోజు రోజుకి ధర తగ్గించుకుంటూ,13 రూపాయలకు, చేశారన్నారు. రైతులు ఏడాది పంటకి,  పెట్టిన పెట్టుబడి రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం, చిట్వేల్ ,కోడూరులో, బొప్పాయి రైతులు, చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాలకే, లక్షల్లో ఖర్చు చేస్తున్నారన్నారు.  దుక్కెలు, కూలీలు, ఎరువులు, ట్రాన్స్పోర్ట్, ఏడాది పాటు, మధ్య  దళారులు దగ్గర, వడ్డీకి తేవడం, వారికే  సరిపేయాలని కండిషనర్ తో, సిండికేట్ఐ, ధర తగ్గిస్తున్నారు అన్నారు, అనంతపురం, పీలేరులో,  30రూపాయలు  ధర పలుకుతుంటే, కోడూరులో మాత్రం, అతి ఘోరంగా, 13 రూపాయలకు, దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. సూటు పేరుతో, టన్నుకి, 100 కేజీలు తీసివేయాలన్నారు. విపరీతమైన దోపిడీ కారణంగా, రైతులు మోసపోతున్నారు అన్నారు. గత ఏడాది, ఇదే విధాన కొనసాగితే, సిఐటియు ఆందోళన చేసి, కలెక్టరు జాయింట్ కలెక్టర్, మార్కెట్ అధికారులతో, మీటింగ్  వేసి, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆదేశించారు. కానీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చూసుకుని, మేలు రకం, ఢిల్లీ కటింగ్, కనీసం 25 రూపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కోడూరు నియోజకవర్గంలో, గురువారం నుండి రైతులతో స్వచ్ఛందంగా, కోతలు నిలిపివేసి, సమ్మె చేస్తున్నారని, వారికి  సిఐటియు, ఏపీ రైతు సంఘం,  సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి,  పి. జాన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

తెలంగాణ: పున్నమి ప్రతినిధి: హైదరాబాద్లో మరో తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజేంద్రనగర్ లోని మీరాలం చెరువుపై వంతెన నిర్మాణం కోసం రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ ప్రారంభించారు.

ఖమ్మం

JVR లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకం కి దరఖాస్తులు ఆహ్వానం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫర్ ) ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి లో గల JVR కాలేజీ నందు 2025-26 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక ప్రాతిపదిక న ఉపాధ్యాయులు నియామకానికి రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ N. గోపి తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఫిజికల్ సైన్స్, జువలాజీ సబ్జెక్ట్ లకి దరఖాస్తు లు చేసుకోవా అని ఈ నెల 29 లోపు కళాశాల లో సంప్రదించాలి అని ప్రిన్సిపాల్ N గోపి తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.